Skip to main content

TIFR GS 2022: ఇందులో ప్రతిభ చూపిన వారికి.. ప్రతి నెల రూ.35 వేల ఆర్థిక ప్రోత్సాహం

సైన్స్‌లో ఉన్నత విద్య, పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు చక్కటి వేదిక.. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌). ఈ విద్యాసంస్థ ఏటా గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ అడ్మిషన్స్‌(జీఎస్‌)ను నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు టీఐఎఫ్‌ఆర్‌ పరిశోధన సంస్థల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీల్లో ప్రవేశం కల్పిస్తోంది. వీరు ప్రతి నెల ఆర్థిక ప్రోత్సాహం సైతం అందుకోవచ్చు. ప్రస్తుతం జీఎస్‌–2022కు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. టీఐఎఫ్‌ఆర్‌ జీఎస్‌కు సంబంధించిన సమాచారం..
TIFR Notification for GS-2022
TIFR Notification for GS-2022
  • జీఎస్‌–2022కు నోటిఫికేషన్‌ విడుదల చేసిన టీఐఎఫ్‌ఆర్‌
  • ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, పీహెచ్‌డీల్లో ప్రవేశం
  • ఎంపికైన విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహం

డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌)ను ప్రఖ్యాత శాస్త్రవేత్త డా.హోమి బాబా 1945 జూన్‌లో ప్రారంభించారు. పరిశోధనల కోసం వివిధ క్యాంపస్‌లను ఏర్పాటు చేశారు. టీఐఎఫ్‌ఆర్‌కు డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ హోదా ఉంది. ఈ సంస్థ ప్రతి ఏటా గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ అడ్మిషన్స్‌(జీఎస్‌) నిర్వహించి.. ఎంఎస్సీ/ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ/పీహెచ్‌డీల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. బయాలజీకి సంబంధించి ఈ పరీక్షను జాయింట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ బయాలజీ అండ్‌ ఇంటర్‌డిసిప్లినరీ లైఫ్‌ సైన్సెస్‌ (జేజీఈఈబీఐఎల్‌ఎస్‌)గా పేర్కొంటారు. 

ప్రవేశం కల్పించే సంస్థలు

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఈఆర్‌), ముంబై; నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌(ఎన్‌సీబీఎస్‌),బెంగళూరు; సెంటర్‌ ఫర్‌ అప్లికబుల్‌ మ్యాథమెటిక్స్‌(సీఏఎం), బెంగళూరు; ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ థియోరిటికల్‌ సైన్సెస్‌(ఐసీటీఎస్‌), బెంగళూరు; నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌(ఎన్‌సీఆర్‌ఏ), పుణె; టీఐఎఫ్‌ఆర్‌ సెంటర్‌ ఫర్‌ ఇంటర్‌yì సిప్లినరీ సైన్సెస్, హైదరాబాద్‌; హోమీ బాబా సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ (హెచ్‌బీసీఎస్‌ఈ), ముంబై తదితర టీఐఎఫ్‌ఆర్‌ సెంటర్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. 

కోర్సులు, కాల వ్యవధి

పీహెచ్‌డీ–ఐదేళ్లు, ఇంటిగ్రేడెట్‌ పీహెచ్‌డీ–ఆరేళ్లు, ఎమ్మెస్సీ కోర్సుల కాల వ్యవధి వేర్వేరుగా ఉంది.

కోర్సులు–అర్హతలు

పీహెచ్‌డీ మ్యాథ్స్‌: మ్యాథమెటిక్స్‌లో పీహెచ్‌డీ చేయాలనుకునే అభ్యర్థులు ఎంఏ/ఎమ్మెస్సీ/ ఎం.మ్యాథ్స్‌/ఎం.స్టాట్స్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 
ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ మ్యాథ్స్‌: ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ చేయాలనుకునే అభ్యర్థులు బీఏ/బీఎస్సీ/బీ.మ్యాథ్స్‌/బీ.స్టాట్‌/బీఈ/బీటెక్‌ పూర్తిచేసి ఉండాలి. 

ఫిజిక్స్‌

  • ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేయాలనుకునే అభ్యర్థులు ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ/ఎంఎస్‌ పూర్తి చేసి ఉండాలి. 
  • ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలో చేరాలనుకునే అభ్యర్థులు ఎంఈ/ఎంటెక్‌ /బీఎస్సీ/బీఎస్‌/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 

కెమిస్ట్రీ

  • కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేయాలనుకునే అభ్యర్థులు ఎమ్మెస్సీ/బీఈ/బీటెక్‌/ఎంఫార్మసీ లేదా తత్సమాన డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
  • కెమిస్ట్రీలో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలో చేరాలనుకునే అభ్యర్థులు బీఎస్సీ/బీ ఫార్మసీ/ బీఎస్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

బయాలజీ

  • బయాలజీలో పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులు బేసిక్‌సైన్స్‌(ఎమ్మెస్సీ ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మ్యాథ్స్‌/ఏదైనా బయాలజీ బ్రాంచ్‌)లో మాస్టర్స్‌ పూర్తి చేసి ఉండాలి. లేదా ఏదైనా ప్రొఫెషనల్‌ మాస్టర్‌ డిగ్రీ(ఎంఫార్మసీ/ఎంటెక్‌), లేదా నాలుగేళ్ల డిగ్రీ ప్రోగ్రామ్‌(ఎంబీబీఎస్‌/బీడీఎస్‌)ఉత్తీర్ణులవ్వాలి. 
  • నాన్‌ బయాలజీలో డిగ్రీ పూర్తిచేసిన వారు(కెమిస్ట్రీ/ఫిజిక్స్‌/మ్యాథ్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌) ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: బయాలజీలో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ చేయాలనుకునే వారు బేసిక్‌ సైన్స్‌(ఫిజిక్స్‌/కెమిస్ట్రీ/మ్యాథ్స్‌/ఏదైనా బయాలజీకి సంబంధించింది)లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా బీఈ/బీటెక్‌/బీవీఎస్సీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. 
  • ఎమ్మెస్సీ(వైల్డ్‌ లైఫ్,కన్జర్వేషన్‌): ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు సంబంధిత సబ్జెక్టులో 50శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వైల్డ్‌ లైఫ్‌ రీసెర్చ్, కన్జర్వేషన్‌పై ఆసక్తి కలిగి ఉండాలి.

కంప్యూటర్, సిస్టమ్స్‌ సైన్సెస్‌ (కమ్యూనికేషన్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌)

పీహెచ్‌డీ: ఈ విభాగంలో పీహెచ్‌డీ చేయాలనుకునే వారు కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ సంబంధిత బ్రాంచ్‌ల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(నాలుగేళ్లు)/ఎంఈ/ఎంటెక్‌/ఎమ్మెస్సీ/ఎంసీఏను పూర్తిచేసి ఉండాలి. 
ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ: కంప్యూటర్, సిస్టమ్స్‌ సైన్సెస్‌లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులు మూడేళ్ల బీఎస్సీ లేదా కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ల్లో డిగ్రీ కలిగి ఉండాలి.

ఆర్థిక ప్రోత్సాహం

  • పీహెచ్‌డీ విద్యార్థులకు మొదటి ఏడాది నెలకు రూ.31,000, అనంతరం విద్యార్థి చూపే ప్రతిభ ఆధారంగా నెలకు రూ.35,000 స్టయిపండ్‌ చెల్లిస్తారు.
  • ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీలో చేరిన విద్యార్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.21,000గా ఇస్తారు. ప్రతిభ ఆధారంగా రెండో ఏడాది రూ.31,000, పీహెచ్‌డీకి  రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత రూ.35,000 వరకు అందిస్తారు.
  • ఎమ్మెస్సీ(బయాలజీ) విద్యార్థులకు నెలకు రూ.16000తోపాటు హెచ్‌ఆర్‌ఏ(హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌) ఇస్తారు. ఎమ్మెస్సీ(వైల్డ్‌ లైఫ్‌ బయాలజీ అండ్‌ కన్జర్వేషన్‌) విద్యార్థులకు నెలకు రూ.12,000 స్టయిపండ్‌ చెల్లిస్తారు. 

ఎంపిక ప్రక్రియ

  • దేశ వ్యాప్తంగా నిర్వహించే ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
  • సిస్టమ్‌ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు గేట్‌/జెస్ట్‌/నెట్‌ ద్వారా కూడా అడ్మిషన్‌ లభిస్తుంది.

పరీక్ష విధానం

జీఎస్‌ 2022 పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలుంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీల్లోని బేసిక్‌ టాపిక్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

ముఖ్యమైన సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 07.11.2021 
జీఎస్‌–2022 పరీక్ష తేదీ: డిసెంబర్‌ 12, 2021
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం

వెబ్‌సైట్‌: http://univ.tifr.res.in/gs2022/

చ‌ద‌వండి: Demanding‌ Job ‌Profiles‌: వీరికి రూ.8లక్షలు–రూ.20లక్షల వరకు వార్షిక వేతనం

Published date : 14 Oct 2021 03:23PM

Photo Stories