Skip to main content

Demanding‌ Job ‌Profiles‌: వీరికి రూ.8లక్షలు–రూ.20లక్షల వరకు వార్షిక వేతనం

లక్షల సంఖ్యలో విద్యార్థులు.. మరికొన్ని నెలల్లోనే పట్టాలతో క్యాంపస్‌ బయటకు వస్తారు. ఆయా డిగ్రీ సర్టిఫికెట్లతో.. జాబ్‌ మార్కెట్‌లో అడుగు పెట్టనున్నారు! ఇప్పటికే.. పేరున్న కాలేజీల్లో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కోసం కంపెనీలు సిద్ధమవుతున్నాయి! వాస్తవానికి అక్టోబర్, నవంబర్‌ల్లో కంపెనీలు నూతన నియామకాలపై ప్రణాళికలు రూపొందించి, ప్రకటిస్తుంటాయి. దీంతో ఫ్రెషర్స్‌ మొదలు అనుభవజ్ఞుల వరకూ.. అక్టోబర్‌ వచ్చిందంటే చాలు.. జాబ్‌ మార్కెట్, రిక్రూట్‌మెంట్‌ ట్రెండ్స్‌పై సమాచారం కోసం అన్వేషిస్తుంటారు. ఈ నేపథ్యంలో... ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో నియామకాల తాజా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..
Latest and present Job Market Trends and Recruitment Trends
Latest and present Job Market Trends and Recruitment Trends
  • కరోనా పరిణామాల నుంచి కోలుకుంటున్న సంస్థలు
  • కొత్త నియామకాలకు ఓకే చెబుతున్న కంపెనీలు
  • ఐటీ, హెల్త్‌కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల్లో అవకాశాలు
  • పలు సంస్థల సర్వే అంచనాల్లో వెల్లడి

ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఏఏ రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.. రానున్న రోజుల్లో డిమాండ్‌ ఎలా ఉంటుంది.. ఎలాంటి స్కిల్స్‌ను కంపెనీలు కోరుకుంటున్నాయి..తదితర సందేహాలను విద్యార్థులు, ఉద్యోగార్థులు వ్యక్తం చేస్తున్నారు. సంస్థలు ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితుల నుంచి బయట పడుతున్నాయి. కార్యకలాపాలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దీంతో నూతన నియామకాల దిశగా అడుగులు వేస్తున్నాయి. అన్ని రంగాల్లోని 17 నుంచి 20 శాతం సంస్థలు కొత్తగా నియామకాలు చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు వివిధ సర్వేలు పేర్కొంటున్నాయి. 

ఆ నాలుగు రంగాలు

  • ఇటీవల పలు సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం–నియామకాల పరంగా నాలుగు రంగాలు ముందంజలో నిలుస్తున్నాయి. అవి.. ఐటీ, హెల్త్‌కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ, మాన్యుఫ్యాక్చరింగ్‌. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి జరిగే కొత్త నియామకాల్లో ఈ రంగాల్లోని సంస్థలు ముందజలో నిలిచే అవకాశముందని ఆయా సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 
  • టీమ్‌లీజ్‌ సర్వే ప్రకారం–ఐటీ సెక్టార్‌లో 31 శాతం, హెల్త్‌కేర్, అనుబంధ విభాగాల్లో 23 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐలో 22 శాతం, ఉత్పత్తి రంగంలో 21 శాతం మేర డిసెంబర్‌ చివరి నాటికి కొత్త రిక్రూట్‌మెంట్స్‌ జరగనున్నాయి.
  • మాన్‌స్టర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఇండెక్స్‌ ప్రకారం–గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఆగస్ట్‌ చివరి నాటికి ఐటీలో 39 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐలో 33 శాతం, ఉత్పత్తి రంగంలో 20 శాతం మేర నియామకాలు జరిగాయి. 
  • ఫ్రెషర్స్‌ నుంచి అనుభవజ్ఞుల వరకూ.. అన్ని స్థాయిల్లోనూ గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం హైరింగ్‌ శాతం పెరుగనుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

డిమాండింగ్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌

  • నెట్‌వర్క్‌ ఇంజనీర్స్‌(ఐటీ), అసెట్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌(బీఎఫ్‌ఎస్‌ఐ), సోర్సింగ్‌ మేనేజర్‌(ఐటీ–బీపీఓ), బిజినెస్‌ ఆపరేషన్‌ అనలిస్ట్‌(ఆటోమొబైల్, అనుబంధ విభాగాలు) డిమాండింగ్‌ జాబ్‌ ప్రొఫైల్స్‌గా ముందంజలో నిలుస్తున్నాయి. అదే విధంగా బ్యాంకింగ్‌ ట్రైనర్, కంప్లయన్స్‌ ఆఫీసర్, సాఫ్ట్‌వేర్‌ టెస్ట్‌ స్పెషలిస్ట్‌ కొలువులు కూడా టాప్‌లో ఉంటున్నాయి. 
  • వీటితోపాటు అనలిస్ట్‌–లిక్విడిటీ రిస్క్‌ కంట్రోలర్‌(బీఎఫ్‌ఎస్‌ఐ); ఫైనాన్స్‌/బడ్జెటింగ్‌ మేనేజర్‌  (బీపీఓ); ఐటీ అప్లికేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌); ఐటీ సర్వీస్‌ మేనేజర్‌(హెల్త్‌కేర్, అనుబంధ విభాగాలు); నెట్‌వర్క్‌ ఇంజనీర్‌    (ఐటీ అండ్‌ నాలెడ్జ్‌ సర్వీసెస్‌); ఏఆర్‌ ఎక్స్‌పర్ట్‌  (ఈ–కామర్స్‌ అండ్‌ టెక్‌ స్టార్టప్స్‌); మాస్టర్‌ ఎడ్జ్‌ కంప్యూటింగ్‌(ఐటీ); డిజిటల్‌ ఇమేజింగ్‌ లీడర్‌  (రిటెయిల్‌) జాబ్‌ ప్రొఫైల్స్‌కు డిమాండ్‌ నెలకొంది. వీరికి నైపుణ్యాలు, అనుభవం, కంపెనీని బట్టి రూ.8లక్షలు–రూ.20లక్షల వరకు వార్షిక వేతనం అందుతోంది. 

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లోనూ

కరోనా కాలంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పరిస్థితిల్లోనూ.. ఎస్‌క్యూఎల్‌ అనలిస్ట్, యూఐ డిజైనర్, సాఫ్ట్‌వేర్‌ స్పెషలిస్ట్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీర్‌ పోస్టులకు డిమాండ్‌ పెరుగుతుండటం విశేషం. అదే విధంగా అగ్రికల్చర్,ఆగ్రో కెమికల్స్‌లో మార్కె టింగ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, బీఎఫ్‌ఎస్‌ఐలో ఫైనాన్స్‌ కన్సల్టెంట్, బీపీఓలో టీమ్‌ మేనేజర్‌ ఉద్యోగాల్లోనూ నూతన నియామకాలు జరుగుతున్నాయి.

స్కిల్స్‌ ఉంటేనే

నూతన నియామకాలకు సానుకూలంగా ఉన్న సంస్థలు.. అభ్యర్థులకు లోతైన సబ్జెక్ట్‌ పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, పైథాన్‌ ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డిజిటల్‌ మార్కెటింగ్‌ స్కిల్స్, సేల్స్‌/కస్టమర్‌ సర్వీసెస్‌ స్కిల్స్‌ తప్పనిసరిగా ఉండాలని కోరుతున్నాయి.

నైపుణ్యాలు

ప్రస్తుతం జాబ్‌ మార్కెట్‌లో ప్రోగ్రామింగ్‌; మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌; ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), డేటాసైన్స్‌; సైబర్‌ సెక్యూరిటీ; రీసెర్చ్‌; మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలుంటే.. కొలువులు దక్కించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

సాఫ్ట్‌ స్కిల్స్‌ కామన్‌!

సంస్థలు ఒకవైపు కోర్, ఇండస్ట్రీ 4.0 స్కిల్స్‌ను కోరుకుంటూనే.. సాఫ్ట్‌ స్కిల్స్‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనలిటికల్‌ థింకింగ్, ఇన్నోవేషన్, రీజనింగ్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, లీడర్‌షిప్, టెక్నాలజీ డిజైన్, యాక్టివ్‌ లెర్నింగ్, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్, క్రిటికల్‌ థింకింగ్, క్రియేటివిటీ నైపుణ్యాలున్న వారికి నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. 

క్యాంపస్‌ డ్రైవ్స్‌కు ప్రాధాన్యం

ఈ ఏడాది ఫ్రెషర్స్‌ నియామకాలు జరుపుతామని చెబుతున్న సంస్థలు.. అధిక శాతం క్యాంపస్‌ డ్రైవ్స్‌ ద్వారానే చేపట్టనున్నట్లు పేర్కొంటున్నాయి. దీంతో విద్యార్థులు గతంలో సదరు సంస్థలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో అనుసరించిన విధానాలు, రిటెన్‌ టెస్ట్‌లు,ఇంటర్వ్యూల తీరుతెన్నులపై అవగాహన పెంచుకోవాలి.వాటికి అనుగుణంగా ఇప్పటి నుంచే సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు పలు ప్రముఖ కంపెనీలు జాతీయ స్థాయిలో నిర్వహించే టెస్టుల ద్వారా అవకాశాలు అందుకోవడంపైనా దృష్టిపెట్టాలని సలహా ఇస్తున్నారు. 

సంస్థలు కోరుకుంటున్న స్కిల్స్‌

లేటెస్ట్‌ స్కిల్స్‌

  • ఏఐ, మెషిన్‌ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, వెబ్‌ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్, గ్రాఫిక్‌ డిజైనింగ్‌.

సాఫ్ట్‌ స్కిల్స్‌

  • లీడర్‌షిప్‌ క్వాలిటీస్, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, క్రియేటివ్‌ థింకింగ్, ఇన్నోవేషన్, క్రిటికల్‌ అనాలిసిస్‌.

రిక్రూట్‌మెంట్‌ ట్రెండ్స్‌.. ముఖ్యాంశాలు

  • ఐటీలో అత్యధిక నియామకాల అంచనా
  • తర్వాతి స్థానాల్లో హెల్త్‌కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ, తయారీ
  • డిజిటల్, ఏఐ నైపుణ్యాలున్న వారికి పెద్ద పీట వేస్తున్న సంస్థలు
  • వేతనాల్లోనూ పెరుగుదల కనిపిస్తున్న పరిస్థితి.

నైపుణ్యాలు పెంచుకోవాలి
జాబ్‌ మార్కెట్‌ కరోనా పూర్వ స్థితికి చేరుకుంటోంది. అయితే అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా రంగాల్లోని కంపెనీలకు అవసరమవుతున్న లేటెస్ట్‌ నైపుణ్యాలను పెంచుకుంటూ.. జాబ్‌ మార్కెట్‌లో అన్వేషణకు సిద్ధంకావాలి. అప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుంది.
–ప్రొ‘‘అభినవ్‌ కుమార్, ఫ్యాకల్టీ ఇంచార్జ్, సీడీఎస్, ఐఐటీ–హైదరాబాద్‌

చ‌ద‌వండి: AP DEECET-2021: ఇంటర్‌తోనే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశానికి మార్గం.. ప్రిపరేషన్‌ ఇలా..

Published date : 13 Oct 2021 05:51PM

Photo Stories