Skip to main content

KVPY 2021: స్కాలర్‌షిప్‌ పరీక్షకు సిద్ధమా.. ప్రయోజనాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ టిప్స్‌..

KVPY Scholarship 2021 Exam Procedure, Benefits, Preparation Tips
KVPY Scholarship 2021 Exam Procedure, Benefits, Preparation Tips

కేవీపీవై.. కిషోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన. విద్యార్థులను చిన్న వయసులోనే పరిశోధనల దిశగా పోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ఇది. దీన్నే సంక్షిప్తంగా కేవీపీవై అంటారు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించే రాత పరీక్ష ద్వారా ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు బ్యాచిలర్‌ డిగ్రీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకూ.. ఉపకార వేతనాలను అందిస్తారు. ఈ పరీక్ష వచ్చే నెల అంటే జనవరి 9వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. కేవీపీవైతో ప్రయోజనాలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్‌ టిప్స్‌.. 

జనవరి 9వ తేదీన కేవీపీవై పరీక్ష

కేవీపీవై స్కాలర్‌షిప్‌ కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూలో అర్హత సాధించడంతో పాటు తప్పనిసరిగా బీఎస్సీ, బీఎస్, బీస్టాట్, బీమ్యాథ్‌ కోర్సుల్లో ఏదో ఒకదానిలో ప్రవేశం పొందాలి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ఎంఎస్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులు కూడా అర్హులే.

ప్రయోజనాలెన్నో

  • ఉపకారం వేతనం: కేవీపీవైకు ఎంపికైన విద్యార్థులకు మొదటి మూడేళ్లు అంటే డిగ్రీ స్థాయిలో నెలకు రూ.5 వేలు స్టైపెండ్‌గా ఇస్తారు. దీనికి అదనంగా వార్షికగ్రాంటు రూ.20వేలు అందు తుంది. చివరి రెండేళ్లు అంటే పీజీ స్థాయిలో ఎమ్మెస్సీ లేదా 4–5 ఇయర్‌ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ఎంఎస్‌ వారికి నెలకు రూ.7వేల చొప్పున స్టైపెండ్‌ లభిస్తుంది. దీంతోపాటు వార్షికగ్రాంటు రూ.28వేలు అందిస్తారు. 
  • సమ్మర్‌ క్యాంప్‌: ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులను ఇస్తారు. దీని ద్వారా జాతీయస్థాయి ప్రయోగశాలలు, యూనివర్సిటీల లైబ్రరీలు, ప్రయోగశాలల్లో అందించే సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. 
  • ఈ ఫెలోషిప్‌లకు ఎంపికైన వారికి వేసవి సెలవుల్లో ఐఐటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తారు. అక్కడ సైన్స్‌కు సంబంధించిన వివిధ అంశాలపై నిపుణులు ప్రసంగిస్తారు. సైన్స్‌కు సంబంధించిన అనేక అంశాలను ప్రయోగాత్మకంగా చూపిస్తారు. అలాగే శాస్త్రవేత్తలతో భేటీలు నిర్వహిస్తారు. వీటితో పాటు సైన్స్‌లో కెరీర్‌ అవకాశాలనూ వివరిస్తారు. 

మూడు స్ట్రీమ్‌లుగా పరీక్ష

ఎస్‌ఏ స్ట్రీమ్‌

  • పదో తరగతి ఉత్తీర్ణులై.. 2021–22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియెట్‌లో చేరేందుకు అర్హత పొందిన విద్యార్థులు ఈ స్ట్రీమ్‌ కిందకు వస్తారు. ఎస్‌ఏ స్ట్రీమ్‌ పరీక్ష రెండు పార్ట్‌లుగా 80 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌–ఎ నుంచి 60 ప్రశ్నలు, పార్ట్‌–బి నుంచి 20 ప్రశ్నలను అడుగుతారు.
  • పార్ట్‌–ఎ: మ్యాథ్స్‌–15, ఫిజిక్స్‌–15, కెమిస్ట్రీ–15, బయాలజీల నుంచి 15ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులను తగ్గిస్తారు.
  • పార్ట్‌–బి: మ్యాథ్స్‌–5, ఫిజిక్స్‌–5, కెమిస్ట్రీ–5, బయా లజీల నుంచి 5ప్రశ్నలు చొప్పున అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కులు లభిస్తాయి. అలాగే తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 0.5 మార్కులను తగ్గిస్తారు. 

 

స్ట్రీమ్‌ ఎస్‌ఎస్‌/ఎస్‌బీ పరీక్ష

  • స్ట్రీమ్‌ ఎస్‌ఎక్స్‌: 2021–22 విద్యాసంవత్సరంలో సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌లో ప్రవేశం పొంది.. 2022–23లో బేసిక్‌ సైన్సెస్‌లో డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ పీజీలో చేరాలనుకుంటున్న విద్యార్థులు ఈ విభాగంలోకి వస్తారు. 
  • స్ట్రీమ్‌ ఎస్‌బీ: 2021–22 విద్యాసంవత్సరంలో సైన్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై.. అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సులు బీఎస్సీ/బీఎస్‌/బీస్టాట్‌/బీమ్యాథ్, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ఎంఎస్‌లో ప్రవేశం పొందేవారు ఈ విభాగంలోకి వస్తారు. 
  • స్ట్రీమ్‌ ఎస్‌ఎస్‌/ఎస్‌బీ పరీక్ష 2 పార్ట్‌లుగా 160 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌–ఎ నుంచి 80, పార్ట్‌–బి నుంచి 40 ప్రశ్నలను అడుగుతారు.

సిలబస్‌ విశ్లేషణ

  • ఫిజిక్స్‌: రిఫ్రాక్షన్, అప్లికేషన్‌ ఇన్‌ డైలీ లైఫ్, లాస్‌ అండ్‌ మోషన్, థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్, డ్యూయల్‌ రేడియేషన్‌ అండ్‌ మ్యాటర్,  న్యూక్లిౖయె, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ తదితరాలు ముఖ్యమైనవి.
  • కెమిస్ట్రీ: పిరియాడిక్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్, క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఎలిమెంట్స్‌ అండ్‌ పిరియాడిసిటీ ఇన్‌ ప్రాపర్టీస్, ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ, మెటల్స్‌ అండ్‌ నాన్‌ మెటల్స్, జనరల్‌ ప్రిన్సిపుల్స్‌ అండ్‌ ప్రాసెసెస్‌ ఆఫ్‌ ఐసోలేషన్‌ ఎలిమెంట్, ది పి–బ్లాక్‌ ఎలిమెంట్స్, ది డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌ ఎలిమెంట్స్, కో ఆర్డినేషన్‌ కాంపౌండ్స్, హాలో అల్కనేస్‌ అండ్‌ హాలోరెన్స్‌.
  • బయాలజీ: జెనెటిక్‌ ఎవల్యూషన్, అవర్‌ ఎన్విరాన్‌మెంట్, లైఫ్‌ ప్రాసెస్, హ్యూమన్‌ సైకాలజీ, బయోటెక్నాలజీ అండ్‌ ఇట్స్‌ అప్లికేషన్స్, ప్రిన్సిపుల్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటెన్స్‌ అండ్‌ వేరియేషన్, మాలిక్యూలర్‌ బేసిస్‌ ఆఫ్‌ ఇన్‌హెరిటెన్స్‌.
  • మ్యాథమెటిక్స్‌: క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, మ్యాథమెటికల్‌ రీజనింగ్, స్టాటిస్టిక్స్‌ ప్రాబబిలిటీ, రియల్‌ నంబర్, అనలిటికల్‌ జామెట్రీ ఇన్‌ టూ డైమెన్షన్, కోఆర్డినేట్‌ జామెట్రీ, మ్యాథమెటికల్‌ రీజనింగ్, ఎవల్యూషన్‌ ఆఫ్‌ ఇంటిగ్రల్స్‌.

ప్రిపరేషన్‌ టిప్స్‌

  • ప్రస్తుతం పరీక్షకు ఉన్న సమయం చాలా తక్కువ. కాబట్టి ఈ సమయంలో రివిజన్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ఇప్పుడు కొత్త టాపిక్స్‌ జోలికి వెళ్లకపోవడమే మంచిది.
  • రివిజన్‌ సందర్భంగా బలహీనంగా ఉన్న అంశాలకు కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. సూత్రాలు, వాటి ఉత్పన్నాలు, సమీకరణాలు మొదలైన వాటిపై∙ప్రత్యేక దృష్టిపెట్టాలి. 
  • ప్రిపరేషన్‌ చివరి దశకు చేరిన ప్రస్తుత సమయంలో ఆయా అంశాల్లో ఏమేరకు పట్టు సాధించారో తెలుసుకోవడానికి ప్రాక్టీస్‌ టెస్టులు, మాక్‌ టెస్టులు రాయాలి. దీనిద్వారా బలాలు, బలహీనతలపై స్పష్టత వస్తుంది.
  • వెబ్‌సైట్‌: http://www.kvpy.iisc.ernet.in


చ‌ద‌వండి: LIC: గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపికైతే రూ. 20 వేలు అంద‌జేత..

Published date : 16 Dec 2021 06:07PM

Photo Stories