TGPSC Group 3 Exams : నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్–3 పరీక్షలు.. 1,363 పోస్ట్‌లకు 5 లక్షలకుపైగా పోటీ!
ప్రొఫెషనల్ కోర్సులు మొదలు సంప్రదాయ డిగ్రీ అభ్యర్థుల వరకు.. ఈ పరీక్షలో విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పరిస్థితి! ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో.. పరీక్షకు పది రోజుల ముందు ప్రిపరేషన్ ప్లాన్, పరీక్ష రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కథనం..
టీజీపీఎస్సీ గ్రూప్–3 పోస్ట్‌లకు పోటీ ఎక్కువగానే ఉంది. మొత్తం 1,363 పోస్ట్‌లకు 5.36 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు ఈ పోటీని చూసి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ప్రిపరేషన్ సాగించాలి. ఇప్పటి వరకు సాగించిన ప్రిపరేషన్ శైలికి భిన్నంగా.. ఇకపై వేగంగా పలుమార్లు రివిజన్ చేయడంపై దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
Telangana TET 2025 : నేటి నుంచి ఆన్‌లైన్‌లో టెట్ దరఖాస్తుల స్వీకరణ ........ టెట్ అర్హత పరీక్ష జనవరి 1 నుంచి 20వ తేదీ వరకూ
రివిజన్.. రివిజన్
గ్రూప్–3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. అంటే 12 రోజుల సమయం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సమయంలో పూర్తిగా రివిజన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటి వరకు తాము అధ్యయనం చేసిన అంశాలనే పదే పదే చదవాలి. అందుకోసం ఆయా పేపర్ల వారీగా నిర్దిష్టంగా సమయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ప్రస్తుతం కొత్త పుస్తకాలు, కొత్త టాపిక్స్ జోలికి వెళ్లకుండా.. ఇంతకాలం చదివిన పుస్తకాలనే చదవడం మేలు. సాధ్యమైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయడంపై దృష్టిపెట్టాలి.
☛Follow our YouTube Channel (Click Here)
ఉమ్మడి అంశాలు
మూడు పేపర్లలో జరిగే గ్రూప్ 3 పరీక్షలో.. ఉమ్మడి అంశాలను గుర్తించాలి. వాటిని ఒకే సమయంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. తద్వారా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. ముఖ్యంగా ఆయా సబ్జెక్ట్‌లలోని ఉమ్మడి అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదవాలి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, భారత రాజ్యాంగం విధానం, పరిపాలన, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.. ఇలా అనేక అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది.ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి.
Non Teaching Posts : స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో నాన్ టీచింగ్ పోస్టులు
కరెంట్ అఫైర్స్‌తో సమన్వయం
అభ్యర్థులు ఆయా అంశాలను చదివేటప్పుడు బేసిక్స్(నిర్వచనం,సిద్ధాంతం,ఫార్ములా)మొదలు.. తాజా పరిణామాల వరకూ సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. ప్రధానంగా కరెంట్ అఫైర్స్‌తో అనుసంధానం చేసుకుంటూ చదవాలి. కొత్త స్కీమ్స్, కొత్త గణాంకాలు విడుదలైతే వాటిని అప్‌డేట్ చేసుకోవాలి. ఉదాహరణకు నూతన నియామకాలు, ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదిక వంటివి.
☛ Follow our Instagram Page (Click Here)
తెలంగాణపై ఫోకస్
ప్రస్తుత సమయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ చరిత్రలో.. తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు, నూతన ప్రభుత్వం తెచ్చిన స్కీమ్స్, లబ్ధిదారులు.. ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి.
ITBP Temporary Jobs : ఐటీబీపీలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు
సొంత నోట్స్
అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభం నుంచే ఆయా సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రాసుకుంటారు. ప్రస్తుత సమయంలో ఈ నోట్స్‌ను తమ ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన అంశాలు, పాయింట్లతో రాసుకున్న నోట్సును చదువుతూ ముందుకు సాగాలి. అన్ని సబ్జెక్టుల్లోనూ అలాగే చేయాలి. ఇలా చదువుతూ అన్ని అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నింటినీ చదవాలి. అప్పుడే ఒక అంశంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.
తాజా విధానాలపై ప్రశ్నలు
పరీక్షలో ప్రభుత్వ విధానాలపై కనీసం 15 నుంచి 20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు చేసిన విధానాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం అధికారిక డాక్యుమెంట్లను పరిశీలించాలి. ఇందులో మహిళా సాధికారత వంటివి ముఖ్యమైనవి. మహిళల సాధికారత కోసం జాతీయ స్థాయిలో పలు పథకాలు తెచ్చారు. ఎస్సీలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, గిరిజనుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి.
☛ Join our WhatsApp Channel (Click Here)
ప్రాక్టీస్ టెస్ట్‌లు
ప్రస్తుతం సమయంలో గ్రూప్–3 అభ్యర్థులు ప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌లలో తమకు ఇప్పటి వరకు లభించిన పరిజ్ఞాన స్థాయిపై అవగాహన వస్తుంది. ఇంకా చదవాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. అదే విధంగా తాము చేస్తున్న పొరపాట్లను విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకునే వీలుంటుంది.
పరీక్ష రోజు ఇలా
ఎన్ని సంవత్సరాలు కష్ట పడినా.. ఎన్ని పుస్తకాలు అధ్యయనం చేసినా.. పరీక్ష రోజున చూపే ప్రతిభే విజయాన్ని నిర్దేశిస్తుందని గుర్తించాలి. అభ్యర్థులు పరీక్ష హాల్లో ప్రత్యేక వ్యూహాలను అనుసరించాలి. ప్రశ్న పత్రాన్ని పూర్తిగా చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. కనీసం పది నిమిషాలపాటు ప్రశ్న పత్రం పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్న పత్రం క్టిష్లత స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది.
Jobs In Reserve Bank of India: ఆర్‌బీఐలో ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం.. జీతం రూ.2.25 లక్షలకు పైనే..
ఆ తర్వాత సులభంగా భావించిన ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇవ్వాలి. అనంతరంఓ మోస్తరు క్లిష్టత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. చివరగా అత్యంత క్లిష్టంగా భావించిన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. దీనికి భిన్నంగా ముందు తమకు అవగాహన లేని ప్రశ్నలకు సమాధానాలిచ్చేందుకు ఉపక్రమిస్తే.. సమయం వృధా కావడమే కాకుండా.. సమాధానాలు స్ఫురించక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. పర్యవసానంగా తమకు తెలిసిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని గుర్తించాలి.
పేపర్ల వారీగా ముఖ్యమైన అంశాలు
పేపర్–1: జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్
▶ జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ ముఖ్య పరిణామాలు, సంఘటనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి భారతదేశ ప్రమేయం, అదే విధంగా భారత్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
▶ చరిత్రలో ముఖ్యమైన యుద్ధాలు, ఆయా రాజ వంశాల పాలన, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు, కళలు, వాస్తు, నిర్మాణాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ముఖ్య ఉద్యమాల గురించి తెలుసుకోవాలి.
High Court Recruitment : మద్రాస్ హైకోర్టులో రీసెర్చ్ లా అసిస్టెంట్ పోస్టులు
▶ పాలిటీకి సంబంధించి రాజ్యాంగం, రాజ్యాంగ ప్రవేశిక, ముఖ్యమైన ఆర్టికల్స్, రాజ్యంగ సవరణలను అధ్యయనం చేయాలి. ఎకానమీ కోసం బేసిక్ ఎకనామిక్స్‌తో పాటు ఇటీవల కాలంలో ఆర్థిక విధానాలు, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, పథకాల లక్ష్యం వంటి అంశాలను అధ్యయనం చేయాలి.
▶ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బేసిక్ సైన్స్ అంశాలతోపాటు నిజ జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, ఇటీవల కాలంలో ఈ రంగంలో తాజా పరిణామాలు, వాటి వల్ల ప్రయోజనాలు వంటి అంశాలపై పట్టు సాధించాలి. జాగ్రఫీ విషయంలో భౌగోళికంగా ప్రాధాన్యం సంతరించుకున్న ప్రాంతాలు, ఖనిజ వనరులు, సహజ వనరులు, నదీ తీర ప్రాంతాలు, అడవులు–రకాలు, పంటలు–అవి ఎక్కువగా పండే ప్రాంతాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. జనరల్ ఎబిలిటీలో రాణించేందుకు దత్తాంశాల విశ్లేషణ, టేబుల్స్, గ్రాఫ్స్‌ను పరిశీలించి.. వాటిలోని ముఖ్యాంశాలను గుర్తించే విధంగా అధ్యయనం చేయాలి.
పేపర్–2
▶ హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పేరిట ఉన్న పేపర్–2 కోసం ప్రత్యేకంగా చదవాలి. ముఖ్యంగా తెలంగాణ హిస్టరీ కోసం తెలంగాణ సంస్కృతి, కవులు,కళలు,మధ్యయుగ చరిత్ర,కాకతీయులు, శాతవాహనులు,కుతుబ్ షాహీలు,అసఫ్ జాహీల పాలన తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి.
☛ Join our Telegram Channel (Click Here)
▶ పాలిటీ విభాగానికి సంబంధించి భారత రాజ్యాంగం ప్రధాన చట్టాలపై పట్టు సాధించాలి. ముఖ్యమైన ఆర్టికల్స్, సవరణల గురించి పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి.
అదే విధంగా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి. వీటితోపాటు రాజ్యాంగ పరమైన సంస్థలు, వాటి విధుల గురించి తెలుసుకోవాలి.
పేపర్–3 కోసం
ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పేరిట ఉండే పేపర్–3 కోసం దేశ, రాష్ట్ర ఆర్థిక విధానాలపై అవగాహన పెంచుకోవాలి. జాతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కోర్ ఎకానమీ అంశాలు మొదలు తాజా ఆర్థిక విధానాల వరకు.. ముఖ్యాంశాలను మననం చేసుకోవాలి. తెలంగాణ ఆర్థిక విధానాలపై పట్టు సాధించాలి. రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన పథకాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ గణాంకాలు, ఆర్థిక సర్వే గణాంకాలపై పట్టు సాధించాలి.
Bank of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో 592 పోస్టులు
Tags
- tspsc group 3 exams
- group 3 exam dates
- preparation tips for tspsc group 3 exams
- paper 1 2 and 3 for tspsc groups exams
- tgpsc group 3 exam preparation tips
- tgpsc group 3 2024 exam schedule
- group 3 exam syllabus
- Economy and Development
- exams preparation method for group 3
- Education News
- Sakshi Education News
- Group-3 Services Exam
- Telangana State Exams
- Exam Preparation Tips
- Mock Test Strategies
- Time Management Techniques
- Healthy Study Habits