Skip to main content

TSPSC Group 3 Question Paper-1 (GS and General Abilities) : గ్రూప్‌–3 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ 2024 ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(TSPSC) గ్రూప్‌-3 ప‌రీక్ష‌లు నవంబర్‌ 17, 18 తేదీల్లో జ‌ర‌గ‌నున్న విష‌యం తెల్సిందే. నవంబర్‌ 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌–1 (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్) ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన కొశ్చ‌న్‌పేప‌ర్‌-1ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌(www.sakshieducation.com)లో చూడొచ్చు.
TSPSC Group 3 Question Paper-1 GS and General Abilities  TSPSC Group-3 Exam Schedule November 2024Telangana   TSPSC Group-3 Exam Dates and Details

అలాగే ఈ రోజే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష నిర్వహించ‌నున్నారు. ఈ పేప‌ర్‌-2 ప‌రీక్ష కొశ్చ‌న్‌పేప‌ర్ కూడా సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు.

గ్రూప్‌-1 పేప‌ర్-1 'కీ' ని..
TSPSC గ్రూప్‌-3 ప‌రీక్ష‌కు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించ‌నున్నారు. ఈ ప‌రీక్ష ముగిసిన త‌ర్వాత సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ వెబ్‌సైట్ గ్రూప్‌-3 ప‌రీక్ష‌ల‌ కొశ్చ‌న్ పేప‌ర్ & కీ 2024 అందుబాటులో ఉంటుంది. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసే కీ మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్‌–3 పరీక్షలకు మొత్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. దాదాపు 80 శాతం మందికి పైగా గ్రూప్‌-3 అభ్య‌ర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. తెలంగాణ‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్‌–3 ఉద్యోగాల భర్తీకి ఈ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–3 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్ ఇదే... :

Published date : 18 Nov 2024 09:08AM

Photo Stories