National Fire Service College: ఫైర్ ఇంజనీరింగ్‌తో ఉద్యోగావకాశాలు.. ఈ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు
నాగ్‌పూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీసెస్ కాలేజీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ)లో ఈ బీటెక్ కోర్సుకు సంబంధించి 60 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా ర్యాంకుల ఆధారంగా మెరిట్ విద్యార్థులకు ఇందులో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ఎన్‌ఎఫ్‌ఎస్‌సీలో ఫైర్ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఓఎన్‌జీసీ, గెయిల్, సెయిల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, రిలయన్స్, టాటాపవర్, వేదాంత, డీఎల్‌ఎఫ్ వంటి కంపెనీల్లో ప్లేస్‌మెంట్లు పొందారు. వీరిలో ఏటా రూ.22 లక్షల వేతనంతో ప్యాకేజీ వచ్చిన వారున్నట్టు అధికారులు తెలిపారు.
చదవండి: Fire Safety: అగ్ని ప్రమాదం.. మంటలను ఆర్పేందుకు ఉపయోగించే రకాలు ఇవే..!
క్యాంపస్ నియామకాలతో పాటు డీఆర్‌డీవో, బీఏఆర్‌సీ వంటి సంస్థల్లో ఫైర్ సేఫ్టీ విభాగంలో పలు అవకాశాలున్నట్టు పేర్కొన్నారు.
ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ బీటెక్ ఫైర్ ఇంజనీరింగ్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 2 అని తెలిపారు. వివరాలకు ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌తోపాటు 8983300060, 0712–2982225 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.