Physical Chemistry for Competitive Exams : పోటీ పరీక్షల్లో సన్నద్ధత కోసం.. పరస్పర భావాలను పంచుకునే విధానం?
మూలకాల వర్గీకరణ
డాబర్‌నీర్ మూలకాల వర్గీకరణకు నాంది పలికారు. మూలకాలను వాటి ధర్మాల ఆధారంగా మూడు సమూహాలుగా విభజించి, ట్రయాడ్ (త్రికం) అని పేరు పెట్టారు.
☛ Li, Na, K, Cl, Br, I, S, Se, Te మొదలైనవి డాబర్‌నీర్ త్రికాలు.
☛ అష్టక సిద్ధాంతాన్ని ప్రతి΄ాదించింది
– జాన్ న్యూలాండ్స్
☛ స్వతంత్రంగా ఆవర్తన నియమాన్ని ప్రతిపాదించినవారు
– మెండలీఫ్, లోథర్ మేయర్.
☛ మూలకాల వర్గీకరణకు పరమాణు ధర్మం ఆధారం కావాలని మెండలీఫ్ భావించాడు.
☛ మెండలీఫ్ ఆవర్తన నియమం ప్రకారం మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు.
☛ ఆధునిక ఆవర్తన నియమం ప్రకారం మూలకాల ధర్మాలు వాటి పరమాణు సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన ప్రమేయాలు.
☛ నవీన ఆవర్తన పట్టికను విస్తృత ఆవర్తన పట్టిక అంటారు.
☛ విస్తృత ఆవర్తన పట్టికలో అడ్డుగా ఉన్న వరసలను పీరియడ్‌లు అని, నిలువుగా ఉన్న వరసలను గ్రూపులు అని అంటారు.
☛ విస్తృత ఆవర్తన పట్టికను 7 పీరియడ్‌లు, 18 గ్రూపులుగా విభజించారు.
☛ మొదటి పీరియడ్‌లో రెండు, రెండో, మూడో పీరియడ్లలో ఎనిమిదేసి మూలకాలు
ఉంటాయి.
Jobs In Tata Company: ‘పది’ పాసైన మహిళలకు ‘టాటా’లో ఉద్యోగం..
☛ 4, 5, 6వ పీరియడ్లలో 18 మూలకాలుంటాయి.
☛ 7వ పీరియడ్ అసంపూర్ణంగా నిండి ఉంది.
☛ పరమాణు సంఖ్య 57 నుంచి 70 వరకు ఉన్న మూలకాలను లాంథనైడ్‌లు అంటారు.
☛ పరమాణు సంఖ్య 89 నుంచి 102 వరకు ఉన్న మూలకాలను ఆక్టినైడ్‌లు అంటారు.
☛ రసాయనశాస్త్ర బోధనలో హ్యూరిస్టిక్ పద్ధతిని తొలిసారిగా ప్రవేశ పెట్టినవారు
– ఆర్మ్‌స్ట్రాంగ్
☛ అన్వేషణా పద్ధతిని ఒక ప్రధాన విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతిగా అంగీకరించని రిపోర్ట్
– థామ్సన్ రిపోర్ట్
☛ జాన్ డ్యూయి ప్రతిపాదించిన వ్యవహారిక సత్తావాదాన్ని అనుసరించి రూపొందించిన పద్ధతి
– ప్రకల్పన పద్ధతి.
☛ ప్రకల్పన పద్ధతిని మొదటిసారిగా ఆచరణలో పెట్టిన విద్యావేత్త
– కిల్ పాట్రిక్
☛ అనువైన సహజ పరిసరాల్లో పూర్తిచేసే సమస్యాకృత్యమే ప్రకల్పన అని నిర్వచించినవారు
– స్టీవెన్‌సన్
☛ పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజజీవిత భాగమే ప్రకల్పన అని పేర్కొన్నవారు
– బెల్లార్డ్
BECIL Recruitment 2024: టెన్త్/ డిప్లొమా అర్హతతో ఉద్యోగం.. నెలకు రూ. 30వేలు
☛ ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు:
1. వాస్తవికత సూత్రం
2. క్రియాత్మక సూత్రం
3. ఉపయుక్త సూత్రం
4. స్వేచ్ఛా సూత్రం
5. పొదుపు
6. సహసంబంధం
☛ థార్నడైక్ అభ్యసన సిద్ధాంతానికి అను గుణంగా ఉన్న పద్ధతి
–ప్రాజెక్టు పద్ధతి
☛ ప్రయోగశాల పద్ధతిని మూడు రకాలుగా నిర్వహించవచ్చు.
☛ ప్రయోగశాలలోని ప్రయోగాలను 5 రకాలుగా విభజించవచ్చు.
☛ సమస్యా పరిష్కార పద్ధతిలో మొదటి సో΄ానం
– సమస్యను గుర్తించడం
☛ లెక్చర్ అంటే
– బిగ్గరగా చదవడం
AP Police Constable Jobs 2024 Update News : 6,100 కానిస్టేబుల్ పోస్టులపై అప్‌డేట్ న్యూస్ ఇదే.. ఈ నియామకాలను...
☛ అన్వేషణా పద్ధతిలో ΄ాటించాల్సిన నియమాలు:
1. చేయడం ద్వారా నేర్చుకునే నియమం
2. పరిశోధనా నియమం
3. తార్కికంగా ఆలోచించే నియమం
4. అభ్యసనా నియమాల నియమం
5. ప్రజాస్వామ్య వాతావరణ నియమం
6. ప్రయోజనాత్మక అనుభవాల నియమం
☛ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతుల ప్రయో జనాలు:
☛ బోధనోపకరణాలు, ప్రయోగశాలల ఆవశ్యకత లేదు.
☛ సకాలంలో సిలబస్ పూర్తవుతుంది.
☛ ఎక్కువ తరగతి గదులు, ఉపాధ్యాయులు అవసరం లేదు.
☛ పాఠ్య పరిచయం, ముగింపు, సింహావలోకనం, సాధారణీకరణం చేయడం, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు లాంటివి బోధించడానికి ఇదే ఉత్తమ పద్ధతి.
☛ విద్యార్థి కేంద్రక పద్ధతుల ప్రయోజనాలు:
☛ ప్రత్యక్ష అనుభవం, ఇంద్రియ శిక్షణ కారణంగా విద్యార్థుల్లో మూర్త భావనలు కలుగుతాయి.
☛ ఈ పద్ధతులు సమస్యా పరిష్కార శక్తిని పెంపొందిస్తాయి.
☛ విద్యార్థుల మానసిక అవసరాలను తృప్తి పరుస్తాయి.
☛ ఇవి మనోవైజ్ఞానిక పద్ధతులు.
IIITDM Faculty Posts : ట్రిపుల్‌ఐటీడీఎంలో వివిధ విభాగాల్లో ఫాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు..
బోధనోపగమాలు
☛ కమ్యూనికేషన్ అనేది ‘కమ్యూనిస్’ అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భవించింది. లాటిన్‌లో కమ్యూనిస్ అంటే కామన్ అని అర్థం.
☛ భావ ప్రసార ప్రక్రియలోని దశల సంఖ్య 4. ఈ ప్రక్రియలో సందేశం అంటే చెప్పాల్సిన విషయం, మాధ్యమం అంటే చెప్పే
విధానం.
☛ బోధనాభ్యసన ప్రక్రియకు మూలాధారాలు
– చర్య, పరస్పర చర్య, పునర్బలనం.
☛ ‘బోధన అనేది ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య జరిగే పరస్పర చర్యా ప్రక్రియ’ అని పేర్కొన్నవారు
– ఎడ్మండ్ ఎమిడాన్
☛ బోధన ఒక పరస్పర చర్యా ప్రక్రియ అని పేర్కొన్నవారు – ఎ. క్లాండర్స్
☛ బోధనలో అతి తక్కువ స్థాయికి
చెందింది. – శిక్షణ
Indian History Quiz for Group-2 Exams: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన దుర్ఘటనలో ఏ తేదీన అదృశ్యమయ్యారు?
☛ బోధనలో ఉన్నత స్థాయికి చెందింది
– ఉపదేశం
☛ స్మృతి స్థాయి బోధనా నమూనాను రూపోందించినవారు – జె.ఎఫ్. హెర్బర్ట్
☛ అవగాహన స్థాయి బోధనా నమూనాను రూపోందించినవారు – మోరిసన్
☛ పర్యాలోచక స్థాయి బోధనా నమూనాను ప్రతిపాదించింది – హంట్
☛ మెథడ్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది.
☛ పద్ధతి అంటే అర్థం – విధం లేదా మార్గం
☛ బోధనా పద్ధతులు రెండు రకాలు
ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు
1. ఉపన్యాస పద్ధతి
2. ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి
3. చారిత్రక పద్ధతి
విద్యార్థి కేంద్రక పద్ధతులు
1. అన్వేషణ పద్ధతి
2. ప్రకల్పన పద్ధతి
3. ప్రయోగశాల పద్ధతి
4. ఆగమన, నిగమన పద్ధతి
5. సమస్యా పరిష్కార పద్ధతి
Indians Leaving Sweden: స్వీడన్‌ను వీడి స్వదేశానికి వస్తున్న భారతీయులు.. కారణాలు ఇవే..!
☛ ముఖత: విషయ పరిజ్ఞానాన్ని బోధించే పద్ధతి – ఉపన్యాస పద్ధతి
☛ చారిత్రక పద్ధతిని ఉపయోగించే పద్ధతులు – ఉపాఖ్యాసన పద్ధతి, జీవిత చరిత్ర పద్ధతి, పరిణామ పద్ధతి, సాంఘిక పద్ధతి
☛ అన్వేషణ పద్ధతికి మరో పేరు
– హ్యూరిస్టిక్ పద్ధతి
☛ గ్రీకు భాషలో ‘హ్యూరిస్కో’ అంటే కనిపెట్టడం లేదా పరిశోధించడం అని అర్థం.
గతంలో అడిగిన ప్రశ్నలు
1. హ్యూరిస్టిక్ పద్ధతిని రూపొందించినవారు? (డీఎస్సీ–2001)
ఎ) జాన్ డ్యూయి బి) పెస్టాలజీ
సి) కిల్‌పాట్రిక్ డి) హెచ్.ఎ. ఆర్మ్‌స్ట్రాంగ్
2. ఉపాధ్యాయ కేంద్రక పద్ధతికి ఉదాహరణ? (డీఎస్సీ–2001)
ఎ) అన్వేషణా పద్ధతి బి) ప్రకల్పనా పద్ధతి
సి) చారిత్రక పద్ధతి డి) ప్రయోగశాల పద్ధతి
3. విద్యార్థులు తాము గుర్తించిన సమస్యలను విడిగా గానీ, గ్రూపుల్లో గానీ పరిశోధించి పరిష్కారాన్ని కనుగొనే పద్ధతి? (డీఎస్సీ–2003)
ఎ) చారిత్రక పద్ధతి బి) నియోజన పద్ధతి
సి) ప్రదర్శన పద్ధతి డి) ప్రకల్పన పద్ధతి
4. ‘సహజమైన సన్నివేశంతో పూర్తిచేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్టు’ అని నిర్విచించినవారు? (డీఎస్సీ–2002)
ఎ) కిల్‌పాట్రిక్ బి) బిల్లార్డ్
సి) బైనింగ్ అండ్ బైనింగ్ డి) జె.ఎ. స్టీవెన్‌సన్
సమాధానాలు:
1) డి; 2) సి; 3) డి; 4) డి.
TS RTC Jobs 2024 Notification : 2 వారాల్లో ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. మరో 4 వేల ఉద్యోగాలకు కూడా..
మాదిరి ప్రశ్నలు
1. పరస్పర భావాలను పంచుకునే విధానం?
ఎ) కమ్యూనికేషన్ బి) చర్చ
సి) ప్రక్రియ డి) సందేశం
2. లాటిన్‌లో కమ్యూనిస్ అంటే అర్థమేమిటి?
ఎ) మాధ్యమం బి) ప్రత్యక్షం
సి) కామన్ డి) పైవన్నీ
3. భావ ప్రసార ప్రక్రియలోని దశల సంఖ్య?
ఎ) 2 బి) 3 సి) 5 డి) 4
4. ‘బోధన అనేది ఒక పరస్పర చర్యా ప్రక్రియ’ అని పేర్కొన్నవారు?
ఎ) ప్లాండర్స్ బి) ఎడ్మండ్ ఎమిడాన్
సి) బి.ఒ. స్మిత్ డి) మోరిసన్
5. ప్రవర్తన అలవాట్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించే ప్రక్రియను ఏమంటారు?
ఎ) ఉద్దీపన బి) శిక్షణ
సి) నిబంధన డి) ప్రక్రియ
6. బోధనలో అతి తక్కువ స్థాయికి చెందింది?
ఎ) ఉపదేశం బి) నిబంధనం
సి) శిక్షణ డి) సిద్ధాంతీకరణ
New Districts: ఈ రాష్ట్రంలో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు
7. బోధనలో ఉన్నత స్థాయికి చెందింది?
ఎ) నిబంధనం బి) ఉపదేశం
సి) శిక్షణ డి) సిద్ధాంతీకరణ
8. స్మృతి స్థాయి బోధనా నమూనాను రూపోందించినవారు?
ఎ) హంట్ బి) బెర్లో
సి) జె.ఎఫ్.హెర్బర్ట్ డి) మోరిసన్
9. అవగాహన స్థాయి బోధనా నమూనాను రూపోందించినవారు?
ఎ) హంట్ బి) మోరిసన్
సి) హెర్బర్ట్ డి) ఎమిడాన్
10. కిందివాటిలో ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి కానిది?
ఎ) ప్రాజెక్టు పద్ధతి బి) ఉపన్యాస పద్ధతి
సి) చర్చా పద్ధతి డి)పాఠ్య పుస్తక పద్ధతి
11. కిందివాటిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి కానిది?
ఎ) ఉపన్యాస పద్ధతి బి) ప్రాజెక్టు పద్ధతి
సి) ప్రయోగ పద్ధతి డి) సమస్యా పద్ధతి
12. మెథడ్ అనేది ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) లాటిన్ బి) గ్రీకు
సి) ఫ్రెంచి డి) ఇటాలియన్
13. ఆగమనాత్మక దృక్పథానికి వ్యతిరేకమైంది?
ఎ) విశ్లేషణ బి) సంశ్లేషణ
సి) నిగమన డి) పైవన్నీ
సమాధానాలు:
1) ఎ; 2) సి; 3) డి; 4) ఎ;
5) సి; 6) సి; 7) బి; 8) సి;
9) బి; 10) ఎ; 11) ఎ; 12) ఎ;
13) సి.
Telugu University Admissions 2024: తెలుగు యూనివర్సిటీలో వివిధ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
Tags
- physical chemistry study material
- Competitive Exams
- study materials for dsc exams
- dsc exam preparations
- dsc study material
- chemistry study material for dsc exams
- eligibility exams
- dsc eligibility exams
- chemistry study material for dsc eligibles
- model questions for dsc eligibles
- dsc preparation questions
- Education News
- Sakshi Education News