New Districts: లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు ఆగస్టు 26వ తేదీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. లద్దాఖ్-జన్‌స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌థాంగ్‌లను జిల్లాలు నూతనంగా రూపుదాల్చనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం లభించడంతో ప్రధాన కార్యాలయం, సరిహద్దులు, నిర్మానాలు వంటి వివిధ అంశాలను అంచనా వేయడానికి ఓ కమిటీని వేయాలని లద్దాఖ్ పరిపాలన విభాగాన్ని హోం శాఖ కోరింది.
2019లో పూర్వపు జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలితం ప్రాంతంగా లఢఖ్‌ను సాధారణ కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించింది.
శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పాలనా నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ లేహ్, కార్గిల్ రెండు జిల్లాలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఈ జిల్లాల సంఖ్య ఏడుకు చేరుకోనుంది.
Union Cabinet: రెండు విమానాశ్రయాలు, మూడు మెట్రో రైలు ప్రాజెక్టులకు గ్రీన్‌సిగ్నల్