Skip to main content

Chemistry for TET and DSC : మాక్స్‌ ఫ్లాంక్‌  ప్రతిపాదించిన సిద్ధాంతం?

ఫ్లాంక్‌ తన క్వాంటం సిద్ధాంతాన్ని ఉపయోగించి కృష్ణ వస్తువు వికిరణాన్ని విశదీకరించాడు.
Study material and bit banks for tet and dsc in chemistry

పరమాణు నిర్మాణం 

ఫ్లాంక్‌ క్వాంటం సిద్ధాంతం ప్రకారం విద్యు దయస్కాంత వికిరణం ప్యాకెట్‌ రూపంలో ఉంటుంది. దీన్నే క్వాంటా అంటారు. 
●    ఫ్లాంక్‌ తన క్వాంటం సిద్ధాంతాన్ని ఉపయోగించి కృష్ణ వస్తువు వికిరణాన్ని విశదీకరించాడు.
●    ఫ్లాంక్‌ స్థిరాంకం (h) విలువ = 6.625 × 10–27 ఎర్గ్‌ సెకన్‌ లేదా 6.625 ణ 10ృ34 జౌల్‌ సెకన్‌.
●    బోర్‌ స్థిర కక్ష్యలను K, L, M, N అక్షరాలతో లేదా 1, 2, 3, 4 అంకెలతో సూచించాడు.
●    బోర్‌ నమూనా హైడ్రోజన్‌ వర్ణ పటాన్ని, హైడ్రోజన్‌ వంటి He+ Li2+...అయా న్‌ల వర్ణపటాలను విశదీకరించింది.
●    అయస్కాంత క్షేత్రంలో వర్ణపటరేఖలు, చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోయాయి. దీన్నే జీమన్‌ ఫలితం  అంటారు.
●    ఒక స్థిర కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్‌ కోణీయ ద్రవ్యవేగం (mvr), = nh/2p
    పూర్ణాంకంగా ఉంటుంది. (mvr), = nh/2p
●    దీర్ఘ వృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్ర వేత్త ఆర్నాల్డ్‌ సోమర్‌ఫెల్డ్‌. ఎలక్ట్రాన్‌కు కణ స్వభావం, తరంగ స్వభావం ఉంటుందని పేర్కొన్న శాస్త్ర వేత్త డీబ్రోగ్లీ.
●    కేంద్రకంలోని ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లను న్యూక్లియాన్‌లు  అంటారు. 
●    మొట్టమొదటి పరమాణు నమూనాను ప్రతి ΄ాదించిన శాస్త్రవేత్త జె.జె.థామ్సన్‌. 
●    రూథర్‌ ఫర్డ్‌ పరమాణు నమూనానే గ్రహమండల లేదా న్యూక్లియర్‌ నమూనా అంటారు. 
●    జర్మనీ శాస్త్రవేత్త ఇర్విన్‌ శ్రోడింజర్‌ హైడ్రోజన్‌ పరమాణువులోని ఎలక్ట్రాన్‌కు తరంగ సమీకరణాన్ని ప్రతిపాదించాడు.
●    ప్రధాన క్వాంటం సంఖ్య (n)ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త నీల్స్‌బోర్‌. ప్రధాన క్వాంటం సంఖ్య (n) కక్ష్య పరిమాణం, శక్తిని సూచిస్తుంది.
Join our WhatsApp Channel (Click Here)
●    అజిముతల్‌ క్వాంటం సంఖ్య (l)ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త సోమర్‌ఫెల్డ్‌. అజిముతల్‌ క్వాంటం సంఖ్యను కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అని కూడా అంటారు. ∙గరిష్ట విలువ n –1
    అజిముతల్‌ క్వాంటం సంఖ్య ఉప స్థిరకక్ష్య ఆకృతిని తెలియజేస్తుంది.
●    l విలువ 0 అయితే s ఆర్బిటాల్, l విలువ 1 అయితే p ఆర్బిటాల్, l విలువ 2 అయితే d ఆర్బిటాల్, l విలువ 3 అయితే  f ఆర్బిటాల్‌.
●    అయస్కాంత క్వాంటం సంఖ్య (m)ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త లాండే.
●    ఒక 'l' విలువకు ఉన్న మొత్తం m విలువల సంఖ్య = 2l +1
●    సమాన శక్తి  ఉన్న స్థాయిలను సమశక్తి స్థాయిలు అంటారు.
●    అయస్కాంత క్వాంటం సంఖ్య (ఝ) ఆర్బిటా ల్‌ దృగ్విన్యాసాన్ని తెలియజేస్తుంది.
●    స్పిన్‌ క్వాంటం సంఖ్యను ఉలెన్‌బెక్, గౌడ్‌ స్మిత్‌లు ప్రతి΄ాదించారు.
●    స్పిన్‌ క్వాంటంసంఖ్య (s) విలువలు +1/2, –1/2 మాత్రమే.
●    ఎలక్ట్రాన్‌ను కనుగొనే సంభావ్యత  ఉన్న ప్రాంతాన్ని పరమాణుæ/ ఆర్బిటాల్‌ అంటారు.
●   s –  ఆర్బిటాల్‌ గోళాకారంగా ఉంటుంది. p – ఆర్బిటాల్‌ డంబెల్‌ ఆకారాన్ని,  d – ఆర్బిటాల్‌ డబుల్‌ డంబెల్‌ ఆకారాన్ని కలిగి ఉంటాయి.
●   p – ఆర్బిటాళ్లు L కర్పరం నుంచి, d – ఆర్బి టాళ్లు M కర్పరం నుంచి, జృఆర్బిటాళ్లు N కర్పరం నుంచి ఉంటాయి.
●    ఆఫ్‌ భౌ నియమం ప్రకారం ఎలక్ట్రాన్‌ తక్కువ శక్తి  ఉన్న ఆర్బిటాల్‌ను ఆక్రమించుకొంటుంది.
●    పాలీ వర్జన నియమం ప్రకారం రెండు ఎలక్ట్రాన్‌లకు నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు.
●   హుండ్‌ నియమం ప్రకారం సమశక్తి ఆర్బి టాళ్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్‌ నిండిన తర్వాతనే జతకూడుతాయి.
●    పరమాణు కేంద్రకానికి, బాహ్య ఆర్బిటాల్‌కు మధ్య ఉండే దూరాన్ని పరమాణు వ్యాసార్థం అని అంటారు. దీన్ని ఆంగ్‌స్ట్రాం యూనిట్స్‌లో కొలుస్తారు. (1A° =10–8 సె.మీ.)
●    వాయుస్థితిలో  ఉన్న పరమాణు బాహ్య  కర్ప రం నుంచి ఎలక్ట్రాన్‌ను తీసి వేసేం దుకు కావాల్సిన శక్తి పరిమాణాన్ని అయనీకరణ శక్మం అంటారు.

అయనీకరణ శక్మం ప్రమాణాలు 
●    ఎలక్ట్రాన్‌ వోల్ట్‌ (ev) లేదా కి.కా.  మోల్‌ లేదా కి.జౌ మోల్‌1
●    అయనీకరణ శక్మం.. కేంద్రక ఆవేశం, పర మాణు సైజు,  అయాన్‌ ఆవేశాలపై ఆధారపడి ఉంటుంది.
●    వాయుస్థితిలో తటస్థ పరమాణువు భూ స్థాయిలో ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రాన్‌ను చేర్చితే విడుదలయ్యే శక్తిని ఎలక్ట్రాన్‌ అఫినిటీ అంటారు. 
గతంలో అడిగిన ప్రశ్నలు
1.    క్రోమియం (Z=24) ఎలక్ట్రాన్‌ విన్యాసం? (డీఎస్సీ–2006)
   1) [Ar]4s13d5    2) [Ar]4s23d1
    3) [Ar]4s23d5    4) [Ar]4s23d4
2.    పరమాణువులో వృత్తాకార కక్ష్య ’l’ గరిష్ట విలువ?    (డీఎస్సీ–2012)
    1) 0    2) 1    3) –1        4) 1/2
3.    అతిచిన్న పరమాణు వ్యాసార్థం  ఉన్న మూలకం?    (డీఎస్సీ–2003)
    1) లిథియం    2) సోడియం
    3) హీలియం    4) హైడ్రోజన్‌
4.    ఒక పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం విలువ గ్రాముల్లో?    (డీఎస్సీ–2012)
    1) 1.64´10–24     
    2) 1.602´10–19 
    3) 1.602´10–23     
    4) 6.023´10–23 
5.    1s2 2s2 2p6 3s2 3p6 4s2 ఎలక్ట్రాన్‌ విన్యాసంగా గల మూలకం సంకేతం?
    (డీఎస్సీ–2003)
    1) Mn    2) Si    3) Mg    4) Ca
Follow our Instagram Page (Click Here)
6.    ఆర్బిటాళ్ల శక్తుల ఆధారంగా సరైన క్రమం?
    (డీఎస్సీ–2012)
    1) 3d, 4s, 4p, 4d    
    2) 4s, 3d, 4p, 5s 
    3) 3d, 4s, 4d, 4p
    4) 3d, 4s, 4p, 5s
7.    కింది వాక్యాల్లో సరైనవి?  (డీఎస్సీ–2008)
    ఎ)    కేథోడ్‌ కిరణాలు పల్చని రేకుల ద్వారా చొచ్చుకు΄ోతాయి
    బి)    X – కిరణాలు ప్రయాణ మార్గం లోని వాయువులను అయనీ కరిస్తాయి
    సి)    కేథోడ్, X –   కిరణాలు zns వంటి పదార్థాలపై పడినప్పుడు ప్రతి దీప్తిని కలిగిస్తాయి
     1) ఎ, బి, సి    2) బి, సి
    3) ఎ, బి    4) ఎ, సి 

సమాధానాలు
    1) 1;    2) 1;    3) 4;    4) 1;
    5) 4;    6) 2;    7) 1.

 మాదిరి ప్రశ్నలు

1.    దీర్ఘ వృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త?
    1) బోర్‌    2) ష్రోడింజర్‌
    3) జీమన్‌    4) సోమర్‌ఫెల్డ్‌
2.   3p, 4s, 3d, 4pలలో దేనికి అత్యల్ప శక్తి  ఉంటుంది?
    1) 4s    2) 3p    3) 3d     4) 4p
3.   p – ఆర్బిటాల్‌ ఆకృతి?
    1) గోళాకృతి    
    2) సంక్లిష్టం
    3) డబుల్‌ డంబెల్‌    
    4) డంబెల్‌
4.  L  కర్పరంలో ఉండే ఉపకర్పరాలు?
   1) s, d     2) s, p, d    
    3) s, p     4) s, p, d, f
5.    మాక్స్‌ ఫ్లాంక్‌  ప్రతిపాదించిన సిద్ధాంతం?    
    1) తరంగ    2)విద్యుదయస్కాంత
    3) క్వాంటం  4) కణ సిద్ధాంతం
6.    3d ఆర్బిటాల్‌  n + l విలువ?
    1) 4    2) 5    3) 6     4) 8
7.    పరమాణు వ్యాసార్థానికి ప్రమా ణాలు?
    1) ఆంగ్‌స్ట్రాం యూనిట్స్‌ 
    2) కిలో కాలరీ
    3) ev            
    4) ఫారడ్స్‌
8.    పరమాణు సంఖ్య (Z) పరమాణువులోని –––  కు సమానం?
    1) న్యూట్రాన్‌
    2) న్యూట్రినో
    3) ఎలక్ట్రాన్‌ లేదా ప్రోటాన్‌  
    4) పాజిట్రాన్‌
9.    రూథర్‌ ఫర్డ్‌ పరమాణు నమూనాను –––  నమూనాగా వ్యవహరిస్తారు?
    1) పుచ్చకాయ  2) గ్రహమండల
    3) స్థిర కక్ష్య     4) దీర్ఘవృత్తాకార
10.  ప్రోటాన్‌ల ద్రవ్యరాశి, ఎలక్ట్రాన్‌ల ద్రవ్యరాశి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ?
   1) 2350    2) 1837
    3) 1950    4) 2000
11.    పరమాణు కేంద్రక వ్యాసార్ధం సుమారుగా?
    1) 10–8cm     2) 10–15mt  
    3) ఒక ఫెర్మీ    4) 2, 3
12.    న్యూక్లియాన్‌లు అంటే?
    1) ఎలక్ట్రాన్, ప్రోటాన్‌లు
     2) ఎలక్ట్రాన్, న్యూట్రాన్లు
    3) ప్రోటాన్లు, న్యూట్రాన్లు
     4) ఏవీ కావు
Join our Telegram Channel (Click Here)
13.    పరమాణువులోని తటస్థ కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?
    1) రూథర్‌ çఫర్డ్‌    2) జేమ్స్‌ చాడ్విక్‌
    3) గోల్డ్‌ స్టెయిన్‌  4) జె.జె. థామ్సన్‌
14.    11Na23లోని న్యూట్రాన్‌ల సంఖ్య?    
    1) 11     2) 23    3) 12     4) 34 
15.    n విలువ పెరిగే కొద్దీ పెరిగేవి?
    1) కక్ష్య సైజు, శక్తి      2) కేంద్రకం సైజు
    3) కేంద్రకం ఆవేశం    
    4) పరమాణు ద్రవ్యరాశి 
16.    కిందివాటిలో సరైన క్వాంటం సంఖ్యల విలు వలను చూపనిది? 
   1) n = 1  l = o m = o  s = +1/2 2) n = 2  l = 1 m = –2  s = +1/2
    3) n = 1  l = 1 m = –1  s = –1 4) n = 2  l = 0 m = +1  s = –1/2
17.    హాలోజన్‌ల ఎలక్ట్రాన్‌ ఎఫినిటీ క్రమం?
    1) F > Cl > Br > I 2) Cl > F > Br > I
    3) Br > F > I > Cl 4) I > Br > Cl > F
18.    అయస్కాంత క్షేత్ర సమక్షంలో వర్ణపట రేఖలు చిన్నచిన్న ఉపరేఖలుగా విడి ΄ోవడాన్ని     ఏమంటారు?
    1) స్టార్క్‌ ఫలితం 2) కాంప్టన్‌ ఫలితం
    3) జీమన్‌ ఫలితం    
    4) కాంతి–విద్యుత్‌ ఫలితం
19.    కేంద్రకానికి దగ్గరగా ఉండేది?
    1) 4f    2) 6p     3) 5s     4) 5d 
20.    బోర్‌ పరమాణు సిద్ధాంతం తెలిపేది?
    1) క్వాంటం సంఖ్యలు 2) శక్తి స్థాయిలు     
    3) ఉపశక్తి స్థాయిలు    4) ఆర్బిటాళ్ల ఆకృతులు
21.    పరమాణువులో ఎలక్ట్రాన్‌ను కనుగొనే     సంభావ్యత అత్యధికంగా  ఉన్న ప్రదేశం?
    1) స్థిర కక్ష్య            2) ఆర్బిట్‌
    3) ఆర్బిటాల్‌      
    4) నోడల్‌ ప్రదేశం
22.    N కక్ష్యలో ఉండే ఎలక్ట్రాన్‌ల గరిష్ట సంఖ్య?
    1) 2     2) 8    3) 16     4) 32
23.    f ఆర్బిటాళ్లు ఏ కర్పరంలో ఉంటాయి?
    1) K     2) L    3) M    4) N 
24.  3d10 4s1 వేలన్సీ ఎలక్ట్రాన్‌ విన్యాసం  ఉండే పరమాణువు?
    1) Ar    2) Cu    3) Cr     4) Zn
25.    ఫ్లాంక్‌ సమీకరణం?
   1) E = h/u     2) E = mc2
    3) mc2 = hu    4) E = hu
26.    ప్రధాన క్వాంటం సంఖ్య తెలిపే ధర్మం?    
    1) కక్ష్యసైజు     2) కక్ష్య శక్తి
    3) 1, 2     4) కక్ష్య ఆకారం
27.    బోర్‌ నమూనా వేటికి వర్తిస్తుంది?
    1) అన్ని పరమాణువులకు
     2) అన్ని ఆర్బిటాళ్లకు
    3) ఒకే ఎలక్ట్రాన్‌ను కలిగిన అయాన్‌ లేదా పరమాణువుకు
     4) అన్ని అయాన్‌లకు
28.    n ప్రధాన క్వాంటం సంఖ్య అయితే అజి ముతల్‌ క్వాంటం సంఖ్య ’ ’ గరిష్ట విలువ?
    1) n       2) n+1  3) n–1       4) n–2

Follow our YouTube Channel (Click Here)

సమాధానాలు
1) 4;    2) 2;    3) 4;    4) 3;
5) 3;    6) 2;    7) 1;    8) 3;
9) 2;    10) 2;    11) 4;    12) 3;
13) 2;    14) 3;    15) 1;    16) 3;
17) 2;    18) 3;    19) 1;    20) 2;
21) 3;    22) 4;    23) 4;    24) 2;
25) 4;    26) 3;    27) 3;    28) 3.     

Published date : 04 Oct 2024 12:21PM

Photo Stories