Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 8th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu August 8th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu August 8th 2022
Current Affairs in Telugu August 8th 2022

US Appeals Court Judgeగా  రూపాలీ దేశాయ్‌ 
భారత సంతతికి చెందిన జడ్జి రూపాలీ హెచ్‌.దేశాయ్‌ అమెరికాలో అత్యంత శక్తిమంతమైన నైన్త్‌ సర్క్యూట్‌ అపీల్స్‌ కోర్ట్‌ జడ్జిగా నియమితురాలయ్యారు. దక్షిణాసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి జడ్జి ఆమే. 44 ఏళ్ల రూపాలీ నియామకానికి సెనేట్‌ 67–29 ఓట్లతో ఆమోదముద్ర వేసింది. అత్యంత ప్రతిభావంతురాలైన రూపాలీ నామినేషన్‌కు భారీ మద్దతు లభించడం ఆశ్చర్యం కలిగించలేదని సెనేట్‌ జ్యుడీషియరీ కమిటీ చైర్‌పర్సన్‌ డిక్‌ డర్బిన్‌ కొనియాడారు. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పని చేసే నైన్త్‌ సర్క్యూట్‌ అమెరికాలోని 13 పవర్‌ఫుల్‌ అపీల్‌ కోర్టుల్లో అతి పెద్దది. 9 రాష్ట్రాలు, 2 ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి.

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ గోల్డెన్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించిన భారతీయుడు ఎవరు?

రూపాలీ 1978లో కెనడాలో జన్మించారు. అమెరికాలో న్యాయవాదిగా, న్యాయ నిపుణురాలిగా 16 ఏళ్ల అనుభవం ఆమె సొంతం. అరిజోనా వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో మాస్టర్స్‌చేశారు. మెరిట్‌ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు. 2007 నుంచి కాపర్‌స్మిత్‌ బ్రోకెల్‌మన్‌ లా సంస్థలో పార్టనర్‌గా ఉన్నారు. 2021లో కీలకమైన అమెరికన్‌ లా ఇన్‌స్టిట్యూట్‌లో మెంబర్‌గా చేరారు.  గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అరిజోనా రాష్ట్రంలో జో బైడెన్‌ గెలుపును సవాలు చేస్తూ డొనాల్డ్‌ ట్రంప్‌ వేసిన కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా సమర్థంగా వాదనలు విన్పించి ఆకట్టుకున్నారు.

Also read: Aadhar biometric locking: నకిలీలలు - ముద్ర కాని ముద్ర

Taiwan Warns China : రంగంలోకి మిస్సైల్ వ్యవస్థలు  

పెలోసీ తమ మాట లెక్కచేయకుండా తైవాన్‌లో పర్యటించడం పట్ల డ్రాగన్‌ మండిపడుతోంది. తైవాన్‌కు బుద్ధి చెప్పడం తథ్యమంటూ సైనిక విన్యాసాలు సైతం ప్రారంభించింది. తమపై నేరుగా దాడులకు దిగాలన్న కుట్రతోనే చైనా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోందని తైవాన్‌ ఆరోపించింది. చైనా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు ఇప్పటికే తైవాన్‌ అఖాతంలోని మీడియన్‌ లైన్‌ను దాటేసి ముందుకు దూసుకొచ్చాయి. ఈ పరిణామం పట్ల తైవాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. తైవాన్‌ జాతీయ రక్షణ శాఖ శనివారం కీలక ప్రకటన జారీ చేసింది. చైనా చర్యలకు ప్రతిస్పందనగా తమ ల్యాండ్‌–బేస్డ్‌ మిస్సైల్‌ వ్యవస్థలను యాక్టివేట్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. తమ వైమానిక, నావికా దళాలు పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తాయని ప్రకటించింది. ఒకవేళ చైనా దాడికి దిగితే ప్రతీకార దాడులు తప్పవని తైవాన్‌ రక్షణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారమే సముద్రంలో, గగనతలంలో సైనిక విన్యాసాలు కొనసాగిస్తున్నట్లు చైనా శనివారం పేర్కొంది. సైనిక సామర్థ్యాలను పరీక్షించుకొనేందుకు ఉత్తర, తూర్పు, నైరుతి తైవాన్‌లో మిలటరీ ఎక్సర్‌సైజ్‌ చేపట్టినట్లు పేర్కొంది. తైవాన్‌ విషయంలో సంక్షోభం మరింత ముదిరేలా చేయొద్దని అమెరికాను చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ హెచ్చరించారు.

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?

World U20 Athletics లో తిరుమారన్ కు రజతం 

ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో మూడో పతకం చేరింది. పురుషుల ట్రిపుల్‌జంప్‌లో సెల్వ తిరుమారన్‌ రజత పతకం గెల్చుకున్నాడు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల సెల్వ 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 4X400 మీటర్ల రిలేలో సుమ్మీ, ప్రియా హబ్బతనహల్లి మోహన్, కుంజ రజిత, రూపల్‌ చౌదరీలతో కూడిన భారత  బృందం ఫైనల్‌ చేరింది. ఇప్పటి వరకు భారత్‌కు ఈ టోర్నీలో 4X400 మిక్స్‌డ్‌ రిలేలో రజతం,  మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్యం లభించాయి.   

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?

Miss India USA ఆర్య వల్వేకర్ 

వర్జీనియాకు చెందిన ఆర్య న్యూజెర్సీలో జరిగిన 40వ వార్షిక పోటీలో మిస్‌ఇండియా యూఎస్‌ఏ కిరీటం గెలుచుకుంది. సౌమ్య శర్మ, సంజన చేకూరి రన్నరప్‌లుగా నిలిచారు.

GST Council Meet : రాష్ట్రానికో జీ20 టీమ్‌

దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్‌ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నీతీ ఆయోగ్‌ పాలక మండలి ఏడో సమావేశం ఆగస్టు 7న ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. నాలుగు కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలనల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీతీ ఆయోగ్‌ భేటీని బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ సమావేశానికి రాలేదు. 

Also read: Weekly Current Affairs (Science & Technology) Bitbank: భారతదేశంలో ఏ రోజు నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని భారతదేశం ప్రకటించింది?

రాష్ట్రానికో జీ20 టీమ్‌ 
నీతీ ఆయోగ్‌ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. ‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్‌ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రం ఓ జీ20 టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశంలో అతిపెద్ద Ikea స్టోర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

రాష్ట్రాలేమన్నాయంటే... 
రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్‌ సీఎంలు కోరారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్‌ డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ డిమాండ్‌ చేశారు. వీటన్నింటినీ నీతీ ఆయోగ్‌ లోతుగా అధ్యయనం చేస్తుందని మోదీ ప్రకటించారు.

Also read: Global Energy Prize: కౌశిక్‌ రాజశేఖరకు గ్లోబల్‌ ఎనర్జీ అవార్డు

CSIR కు తొలి మహిళా DG

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలో శాస్త్ర పరిశోధనలు చేసే 38 సంస్థలతో కూడిన కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండ్రస్టియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)కు తొలిసారిగా ఒక మహిళ డైరెక్టర్‌ జనరల్‌ అయ్యారు. సీనియర్‌ సైంటిస్ట్‌ నల్లతంబి కలైసెల్వను సీఎస్‌ఐఆర్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కలైసెల్వి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. ఇథియమ్‌ అయాన్‌ బ్యాటరీలు రూపొందించడంలో కలైసెల్వి గతంలో మంచి ప్రతిభ కనబరిచారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ కార్యదర్శిగానూ ఆమె బాధ్యతలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కలైసెల్వి తమిళనాడులోని కరైకుడిలో సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఎలక్ట్రో కెమికల్‌ పవర్‌ సిస్టమ్స్‌ అభివృద్ధిపై గత 25 ఏళ్లుగా ఆమె పరిశోధనలు  చేస్తున్నారు.  

Also read: US Appeals Court Judgeగా రూపాలీ దేశాయ్‌

SSLV–D1 ప్రయోగం విఫలం 

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 రాకెట్‌ను ఆగస్టు 7న ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. మైక్రోశాట్‌–2ఏ (ఈఓఎస్‌శాట్‌)తోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు రూపొందించిన ఆజాదీశాట్‌ను నిర్దేశిత సమయంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ప్రయోగం సఫలం కాలేదు. 

also read: GST Council Meet : రాష్ట్రానికో జీ20 టీమ్‌

ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 ప్రయోగం తొలి మూడు దశల్లో విజయవంతంగా ప్రయాణం సాగించింది. నాలుగో దశలో రాకెట్‌ రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలిపెట్టిన వెంటనే ఏదో అపశృతి చోటు చేసుకున్నట్లు గుర్తించారు.  

also read: Weekly Current Affairs (Persons) Bitbank: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?

రాకెట్‌లో నాలుగు దశలూ అద్భుతంగా పనిచేశాయని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ తెలిపారు. మైక్రోశాట్‌–2ఏ, ఆజాదీశాట్‌లను 13.2 నిమిషాల్లో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని, ఉపగ్రహాలకు ఉన్న సోలార్‌ ప్యానెల్స్‌ కూడా విచ్చుకున్నాయని చెప్పారు. అయితే, ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి కాకుండా వేరే కక్ష్యలోకి చేరుకోవడంతో వాటిలోని సెన్సార్లు పనిచేయక సిగ్నల్స్‌ అందలేదని పేర్కొన్నారు. వృత్తాకార కక్ష్యలోకి కాకుండా దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించడంతో సెన్సార్లు పనిచేయక గ్రౌండ్‌ స్టేషన్‌కు సిగ్నల్స్‌ అందకుండా పోయాయని వివరించారు.  సెప్టెంబర్ లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ2 ప్రయోగానికి సిద్ధం కాబోతున్నామని ప్రకటించారు.

Most Distant Star ఎరెండల్  

ఈ గెలాక్సీ భూమికి ఏకంగా 2,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇప్పటిదాకా మనకు చిక్కిన అత్యంత సుదూరంలోని తార కేవలం 1,000 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానికంటే ఎరెండల్‌ ఏకంగా 1,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది ముందుగా హబుల్‌ టెలిస్కోప్‌కు కనిపించింది. దాంతో ఆశ్చర్యానికి లోనైన నాసా సైంటిస్టులు జూలై 30న జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ ద్వారా కూడా పరీక్షించారు. దాని ఉనికి నిజమేనని నిర్ధారించుకున్నారు. దీని కాంతి భూమిని చేరేందుకు ఏకంగా 1,290 కోట్ల కాంతి సంవత్సరాలు పడుందని తేల్చారు. ఆ లెక్కన మనకిప్పుడు చిక్కిన ఎరెండెల్‌ రూపం బిగ్‌బ్యాంగ్‌ అనంతరం కేవలం 90 కోట్ల ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు తెలిపారు.  
ఎరెండెల్‌ అంటే వేకువ తార అని అర్థం. 

Also read: World Bank: ప్రపంచ బ్యాంక్‌ ముఖ్య ఆర్థికవేత్తగా ఇందర్మిత్‌ గిల్‌

సాకేత్‌–యూకీ జంటకు Luxembourg టెన్నిస్ టైటిల్‌ 


అమెరికాలో జరిగిన లెక్సింగ్టన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్‌–యూకీ 3–6, 6–4, 10–8తోబ్రువెర్‌ (నెదర్లాండ్స్‌)–మెకగ్‌ (బ్రిటన్‌)లపై నెగ్గారు. ఈ ఏడాది సాకేత్‌–యూకీకిది నాలుగో ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌. విజేతగా నిలిచిన సాకేత్‌–యూకీ జంటకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 46 వేలు) లభించింది. 

ALSO READ: Most Distant Star ఎరెండల్

FIDE ఉపాధ్యక్షుడిగా ఆనంద్‌ 

భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అధ్యక్షుడు అర్కడి వొర్కోవిచ్‌ రెండోసారి అధ్యక్షుడయ్యారు. చెన్నై లో జరుగుతున్న 44వ చెస్ ఒలంపియాడ్ వేదికగా ప్రపంచ చెస్ సమాఖ్య నూతన కార్యవర్గం ఎంపికకు ఫిడే కాంగ్రెస్ ఎన్నికలు నిర్వహించింది.  

చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్.. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు.  

ALSO READ: Weekly Current Affairs (Sports) Bitbank: ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?


CWG 2022 : భారత్  @ 5

ఆగస్టు 7 వరకు జరిగిన పోటీల్లో 171 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా... ఇంగ్లండ్, కెనడా రెండూ మూడు స్థానాల్లో ఉన్నాయి. 53 పతకాల ( 18 స్వర్ణాలు)తో భారత్ 5వ స్థానంలో కొనసాగుతోంది.  

ఆగస్టు 6, 7 తేదీల్లో విజేతల వివరాలు 

పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రవి దహియా (57 కేజీలు), నవీన్‌ (74 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. దీపక్‌ నెహ్రా (97 కేజీలు), పూజా సిహాగ్‌ (76 కేజీలు), పూజా గెహ్లోత్‌ (50 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. 

Also read: World Athletics U 20: రూపల్‌ చౌదరీకి కాంస్యం

అథ్లెటిక్స్‌ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఈవెంట్‌లో మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల అవినాష్‌ సాబ్లే రజత పతకం సాధించాడు. అవినాష్‌ 8 నిమిషాల 11.20 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 8 నిమిషాల 12.48 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అవినాష్‌ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా జాతీయ రికార్డును తిరగరాయడం అవినాష్‌కిది తొమ్మిదోసారి. తాజా ప్రదర్శనతో అవినాష్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌ ఈవెంట్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా ఘనత వహించాడు. 

మహిళల 10,000 మీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి రజత పతకం సాధించింది. తద్వారా కామన్వెల్త్‌ గేమ్స్‌ క్రీడల చరిత్రలో రేస్‌ వాకింగ్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా ప్రియాంక గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల ప్రియాంక 43 నిమిషాల 38.83 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది.

Also read: Indian Navy : నేవీలో నారీ ఘనత..

లాన్‌ బౌల్స్‌లో రజతం 
లాన్‌ బౌల్స్‌ క్రీడాంశంలో పురుషుల ‘ఫోర్స్‌’ ఈవెంట్‌లో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. సునీల్‌ బహదూర్, నవనీత్‌ సింగ్, చందన్‌ కుమార్‌ సింగ్, దినేశ్‌ కుమార్‌లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–18తో నార్తర్న్‌ ఐర్లాండ్‌ చేతిలో ఓడిపోయింది.  

Also read:  Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 6th కరెంట్‌ అఫైర్స్‌

ఆగస్టు 7న జరిగిన పోటీల్లో మహిళల 50 కేజీల విభాగంలో తెలంగాణ అమ్మాయి, ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌... 48 కేజీల విభాగంలో హరియాణా అమ్మాయి నీతూ ఘంఘాస్‌... పురుషుల 51 కేజీల విభాగంలో హరియాణాకే చెందిన అమిత్‌ పంఘాల్‌ స్వర్ణ పతకాలు సాధించారు. 

Also read: CWG 2022: రెజ్లింగ్ లో భారత్ కు 3 స్వర్ణాలు

కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి పాల్గొంటున్న నిఖత్‌ జరీన్‌ ఫైనల్లో 5–0తో కార్లీ మెక్‌నాల్‌ (నార్తర్న్‌ ఐర్లాండ్‌)ను చిత్తుగా ఓడించగా... నీతూ 5–0తో డెమీ జేడ్‌ రెస్టాన్‌ (ఇంగ్లండ్‌)పై... అమిత్‌ 5–0తో డిఫెండింగ్‌ చాంపియన్‌ కియరాన్‌ మెక్‌డొనాల్డ్‌ (ఇంగ్లండ్‌)పై గెలుపొందారు. 

Also read: World U20 Athletics లో తిరుమారన్ కు రజతం

కార్లీతో జరిగిన ఫైనల్లో నిఖత్‌ సంపూర్ణ ఆధిపత్యం చలాయించింది. లెఫ్ట్‌ హుక్, రైట్‌ హుక్‌ పంచ్‌లతో కార్లీని కంగారెత్తించిన నిఖత్‌ ప్రత్యర్థి తనపై పంచ్‌లు విసిరిన సమయంలో చాకచక్యంగా తప్పించుకుంటూ అద్భుత డిఫెన్స్‌ను కనబరిచింది. ఈ గేమ్స్‌లో స్వర్ణం గెలిచే క్రమంలో నిఖత్‌ నాలుగు బౌట్‌లలోనూ తన ప్రత్యర్థులకు ఒక్క రౌండ్‌ను కూడా కోల్పోకపోవడం విశేషం. తొలి రౌండ్‌లో నిఖత్‌ పంచ్‌ల ధాటికి రిఫరీ బౌట్‌ను మధ్యలోనే నిలిపివేయగా... క్వార్టర్‌ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో నిఖత్‌ 5–0తో గెలుపొందింది.  

Also read: Weekly Current Affairs (International) Bitbank: బ్రిక్స్ గ్రూపింగ్‌లో చేరడానికి ఏ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నాయి?

పురుషుల 67 కేజీల విభాగం సెమీఫైనల్లో భారత బాక్సర్‌ రోహిత్‌ టొకాస్‌ 2–3తో స్టీఫెన్‌ జింబా (జాంబియా) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. ప్లస్‌ 92 కేజీల విభాగం సెమీఫైనల్లో సాగర్‌ (భారత్‌) 5–0తో ఇఫెయాని (నైజీరియా)పై గెలిచి డెలిషియస్‌ ఒరీ (ఇంగ్లండ్‌)తో స్వర్ణ–రజత పోరుకు సిద్ధమయ్యాడు.   

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?

టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్‌ కమల్‌ (భారత్‌) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్‌ కమల్‌ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్‌ చూంగ్‌–లిన్‌ కరెన్‌ (మలేసియా) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో శరత్‌ కమల్‌–సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ (భారత్‌) జంట 11–8, 8–11, 3–11, 11–7, 4–11తో పాల్‌ డ్రింక్‌హాల్‌–లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ (ఇంగ్లండ్‌) జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం సాధించింది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో 40 ఏళ్ల శరత్‌ కమల్‌ 11–8, 11–8, 8–11, 

కామన్వెల్త్‌ గేమ్స్‌ స్క్వాష్‌ ఈవెంట్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సౌరవ్‌ ఘోషాల్‌–దీపిక పల్లికల్‌ జంట భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.  ఈ పోటీల్లో సౌరవ్‌–దీపిక ద్వయం 11–8, 11–4తో డోనా లోబన్‌–కామెరాన్‌ పిలె (ఆ్రస్టేలియా) జోడీపై విజయం సాధించింది.   

Also read: CWG 2022 : జెరెమీ లాల్‌రినుంగాకి స్వర్ణం

కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఈసారి ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో భారత జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆగస్టు 7న జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం 9 పరుగుల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. ముందుగా ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. భారత మహిళల జట్టు 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. 

Also read: Common Wealth Games : ఇంగ్లండ్‌ ఖాతాలో తొలి స్వర్ణం

16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. ‘షూటౌట్‌’లో 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది. కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల హాకీలో భారత్‌కిది మూడో పతకం. 2002 గేమ్స్‌లో స్వర్ణం నెగ్గిన టీమిండియా 2006లో రజతం సాధించింది.   

Also read: Chess Olympiad 2022: చెన్నైలో ప్రారంభించిన ప్రధాని మోదీ

పురుషుల ట్రిపుల్‌ జంప్‌ ఈవెంట్‌లో భారత అథ్లెట్స్‌ ఎల్డోజ్‌ పాల్, అబ్దుల్లా అబూబాకర్‌ స్వర్ణ, రజత పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ క్రీడల చరిత్రలో ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా కేరళకు చెందిన ఎల్డోజ్‌ పాల్‌ గుర్తింపు పొందాడు. 25 ఏళ్ల ఎల్డోజ్‌ పాల్‌ 17.03 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచాడు. కేరళకే చెందిన అబూబాకర్‌ 17.02 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. తద్వారా కామన్వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల ఈవెంట్‌లో వరుసగా స్వర్ణ, రజత పతకాలు నెగ్గిన భారత అథ్లెట్స్‌గా ఎల్డోజ్, అబూబాకర్‌ ఘనత వహించారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల డిస్కస్‌ త్రో ఈవెంట్‌లో కృష్ణపూనియా, హర్వంత్‌ కౌర్, సీమా అంటిల్‌ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలిచారు.  

Also read: World Wrestling : అండర్ - 17లో భారత్ కు స్వర్ణం

మహిళల జావెలిన్‌ త్రో విభాగంలో అన్నూ రాణి కాంస్య పతకం గెలిచింది. 29 ఏళ్ల అన్నూ రాణి జావెలిన్‌ను 60 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ఈ గేమ్స్‌ చరిత్రలో మహిళల జావెలిన్‌ త్రోలో పతకం నెగ్గిన భారత ప్లేయర్‌గా అన్ను రాణి గుర్తింపు పొందింది. పురుషుల 10,000 రేస్‌ వాకింగ్‌లో భారత అథ్లెట్‌ సందీప్‌ కుమార్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సందీప్‌ 38 నిమిషాల 49.21 సెకన్లలో గమ్యానికి చేరాడు.   

Also read: World Athletics Championships 2022 : నీరజ్‌ చోప్రాకి రజతం

ICRA Ratings హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 10–12 శాతం వృద్ధి 
 

హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (హెచ్‌ఎఫ్‌సీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల పరంగా 10–12 శాతం వృద్ధిని సాధించొచ్చని ఇక్రా రేటింగ్స్‌ తెలిపింది. గతంలో వేసిన 9–11 శాతం అంచనాలను పెంచింది. హెచ్‌ఎఫ్‌సీల రుణాల మంజూరులో స్థిరమైన పురోగతి ఉండడంతో అంచనాలను స్వల్పంగా పెంచినట్టు ఇక్రా తెలిపింది. కరోనా రెండో విడత కారణంగా ఏర్పడిన ప్రతికూలతల నుంచి పరిశ్రమ కోలుకుందని, రుణాల వితరణలో మెరుగుదల ఉండడంతో గడిచిన కొన్ని త్రైమాసికాలుగా హెచ్‌ఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియోలో వృద్ధి కనిపిస్తున్నట్టు ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ సచిన్‌ సచ్‌దేవ తెలిపారు. దీంతో 2021–22లో హెచ్‌ఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియోలో వృద్ధి నమోదైనట్టు చెప్పారు. 2021–22లో ఎన్‌బీఎఫ్‌సీ–హెచ్‌ఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియో 11 శాతం వృద్ధితో రూ.12.2 లక్షల కోట్లకు చేరుకుందని.. తమ అంచనాలు 8–10 శాతం కంటే ఎక్కువే నమోదైనట్టు ఇక్రా తెలిపింది. 

Also read: 5.4 శాతానికి RBI Repo Rate

తగ్గుతున్న మొండి బకాయిల భారం..
2021–22 మొదటి మూడు నెలల్లో (2021 ఏప్రిల్‌–జూన్‌) కరోనా రెండో విడత ప్రభావం హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల వ్యాపారంపై ప్రభావం చూపించినా.. తదుపరి మూడు త్రైమాసికాల్లో మంచి పురోగతి కనిపించినట్టు వివరించింది. 2021–22 మూడో త్రైమాసికంలో స్థూల మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) పెరిగిపోయినప్పటికీ, చివరి త్రైమాసికంలో తగ్గినట్టు పేర్కొంది. మొండి బాకీలను గుర్తించే విషయంలో కఠిన నిబంధనల వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్టు తెలిపింది. బకాయిల వసూళ్లు పుంజుకోవడం మొండి బాకీలు తగ్గేందుకు సాయపడినట్టు వెల్లడించింది. వసూళ్లు మరింత మెరుగుపడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎన్‌పీఏలు ఇంకా తగ్గుతాయని పేర్కొంది.   

Also read: Chief Justice of India N.V. Ramana: జస్టిస్‌ ఎన్వీ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్‌
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 08 Aug 2022 06:43PM

Photo Stories