CWG 2022: రెజ్లింగ్ లో భారత్ కు 3 స్వర్ణాలు
స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు.
Also read: Quiz of The Day (August 06, 2022): భారతదేశంలో తొలి మొబైల్ మ్యూజిక్ క్లాస్ రూమ్, రికార్డింగ్ స్టూడియోను ఏ నగరంలో ప్రారంభించారు?
పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
బంగారం @ 75
స్కాట్లాండ్‌కు చెందిన జార్జ్ మిల్లర్ ‘లేట్ వయసు’లో గ్రేట్ అనిపించుకున్నాడు. 75 ఏళ్ల 8 నెలల జార్జ్ ‘లాన్ బౌల్స్’ మిక్స్‌డ్ పెయిర్‌లో బంగారు పతకం సాధించాడు. మెలనీ ఇన్నెస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పసిడి పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: 1,800 టన్నుల రిఫైనింగ్ కెపాసిటీతో గోల్డ్ రీసైక్లింగ్‌లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP