Skip to main content

World Athletics U 20: రూపల్‌ చౌదరీకి కాంస్యం

ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో పతకం వచ్చింది.
World Athletics U 20: Bronze for Rupal Chaudhary
World Athletics U 20: Bronze for Rupal Chaudhary

కొలంబియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో మహిళల 400 మీటర్ల విభాగంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రూపల్‌ చౌదరీ కాంస్య పతకాన్ని సాధించింది. 17 ఏళ్ల రూపల్‌ 400 మీటర్ల దూరాన్ని 51.85 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. యెమీ మేరీజాన్‌ (బ్రిటన్‌; 51.50 సెకన్లు) స్వర్ణం గెలిచింది. ఈ పతకంతో రూపల్‌ ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 4X400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్‌లో రజతం నెగ్గిన భారత బృందంలో రూపల్‌ సభ్యురాలిగా ఉంది.

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 06 Aug 2022 05:47PM

Photo Stories