Skip to main content

GST Council Meet : రాష్ట్రానికో జీ20 టీమ్‌

వ్యవసాయ రంగంలో భారత్‌ స్వయంసమృద్ధంగా మారడంతో పాటు ప్రపంచ సారథిగా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇందుకు సాగు, పశుపోషణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు.
GST Council Meet
GST Council Meet

దిగుమతులను బాగా తగ్గించుకుని ఎగుమతులను ఇతోధికంగా పెంచుకోవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ట్రేడ్‌ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ అనే మూడు ‘టి’లపై మరింతగా దృష్టి సారించాల్సిందిగా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. నీతీ ఆయోగ్‌ పాలక మండలి ఏడో సమావేశం ఆగస్టు 7న ఢిల్లీలో మోదీ సారథ్యంలో జరిగింది. 23 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. నాలుగు కీలకాంశాలను పాలక మండలి లోతుగా చర్చించింది. పంట వైవిధ్యం, తృణధాన్యాలు, నూనె గింజలు తదితర వ్యవసాయ దిగుబడుల్లో స్వయంసమృద్ధి, పాఠశాల, ఉన్నత విద్యలో జాతీయ విద్యా విధానం అమలు, పట్టణ పాలనల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై సభ్యులంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. నీతీ ఆయోగ్‌ భేటీని బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కరోనా నుంచి కోలుకుంటున్న బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ సమావేశానికి రాలేదు. 

Also read: Weekly Current Affairs (Science & Technology) Bitbank: భారతదేశంలో ఏ రోజు నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని భారతదేశం ప్రకటించింది?

రాష్ట్రానికో జీ20 టీమ్‌ 
నీతీ ఆయోగ్‌ పాలక మండలి ఏడో భేటీని జాతీయ ప్రాథమ్యాలను గుర్తించేందుకు కేంద్ర రాష్టాల మధ్య నెలల తరబడి జరిగిన లోతైన మేధోమథనం, సంప్రదింపులకు ఫలితంగా మోదీ అభివర్ణించారు. పలు అంశాల్లో కేంద్ర రాష్ట్రాల నడుమ సహాయ సహకారాలు మరింతగా పెరగాల్సిన అవసరముందన్నారు. భేటీలో చర్చించిన అంశాలు వచ్చే పాతికేళ్లలో జాతి ప్రాథమ్యాలను నిర్ణయించడంలో కీలకంగా మారతాయని వెల్లడించారు. జీఎస్టీ వసూళ్లు మెరుగ్గా ఉన్నా అవి భారీగా పెరగాల్సి ఉందన్నారు. అందుకు అపారమైన అవకాశాలు కూడా ఉన్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఉమ్మడి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అప్పుడే ఆర్థికంగా దేశం మరింత బలపడి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపుదాలుస్తుందన్నారు. వీలైన ప్రతిచోటా స్థానిక వస్తువులనే వాడేలా ప్రజలను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. ‘‘శరవేగంగా సాగుతున్న పట్టణీకరణను సమస్యగా కాకుండా దేశానికి గొప్ప బలంగా మలచుకోవాల్సి ఉంది. సేవల్లో పారదర్శకత, పౌరులందరి జీవన ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి’’అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రతి రాష్ట్రమూ చురుకైన పాత్ర పోషించిందని కొనియాడారు. తద్వారా ఇవాళ వర్ధమాన దేశాలు స్ఫూర్తి కోసం భారత్‌వైపు చూసే పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. సంపన్న, వర్ధమాన దేశాలతో కూడిన జీ20కి 2023లో భారత్‌ సారథ్యం వహించనుండటాన్ని మోదీ ప్రస్తావించారు. దీన్నుంచి గరిష్టంగా లబ్ధి పొందే మార్గాలను సూచించేందుకు ప్రతి రాష్ట్రం ఓ జీ20 టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశంలో అతిపెద్ద Ikea స్టోర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?

రాష్ట్రాలేమన్నాయంటే... 
రాష్ట్రాలపై విధానాలను కేంద్రం బలవంతంగా రుద్దొద్దని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండ్‌ చేశారు. రాష్ట్రాల డిమాండ్లకు కేంద్రం మరింత ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని ఛత్తీస్‌గఢ్, కేరళ, రాజస్తాన్‌ సీఎంలు కోరారు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలోని అంశాలపై కేంద్రం చట్టాలు చేయడాన్ని మానుకోవాలని కేరళ సీఎం పినరాయి విజయన్‌ డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టపరమైన హామీ ఇవ్వాలని పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ డిమాండ్‌ చేశారు. వీటన్నింటినీ నీతీ ఆయోగ్‌ లోతుగా అధ్యయనం చేస్తుందని మోదీ ప్రకటించారు.

Also read: Global Energy Prize: కౌశిక్‌ రాజశేఖరకు గ్లోబల్‌ ఎనర్జీ అవార్డు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 08 Aug 2022 05:52PM

Photo Stories