Skip to main content

Global Energy Prize: కౌశిక్‌ రాజశేఖరకు గ్లోబల్‌ ఎనర్జీ అవార్డు

Global Energy Prize

అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన కౌశిక్‌ రాజశేఖర.. ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఎనర్జీ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. విద్యుత్తు ఉత్పాదక ఉద్గారాలను తగ్గించేటపుడు విద్యుత్తు రవాణా, శక్తిసామర్థ్య సాంకేతికతల రంగంలో అందించిన సేవలకుగాను ఆయనకు ఈ బహుమతి దక్కింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల నుంచి 119 నామినేషన్లు రాగా.. ముగ్గురిని మాత్రమే గ్లోబల్‌ ఎనర్జీ అసోసియేషన్‌ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. అక్టోబరు 1214 తేదీల మధ్య మాస్కోలో జరిగే రష్యన్‌ ఎనర్జీ వారోత్సవాల్లో ఈ అవార్డులను అందజేస్తారు.

చ‌ద‌వండి:  Weekly Current Affairs (Awards) Bitbank: ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 06 Aug 2022 06:13PM

Photo Stories