World U20 Athletics లో తిరుమారన్ కు రజతం
Sakshi Education
ప్రపంచ అండర్–20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది.
పురుషుల ట్రిపుల్‌జంప్‌లో సెల్వ తిరుమారన్ రజత పతకం గెల్చుకున్నాడు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల సెల్వ 16.15 మీటర్ల దూరం దూకి రెండో స్థానంలో నిలిచాడు. మహిళల 4X400 మీటర్ల రిలేలో సుమ్మీ, ప్రియా హబ్బతనహల్లి మోహన్, కుంజ రజిత, రూపల్ చౌదరీలతో కూడిన భారత బృందం ఫైనల్ చేరింది. ఇప్పటి వరకు భారత్‌కు ఈ టోర్నీలో 4X400 మిక్స్‌డ్ రిలేలో రజతం, మహిళల 400 మీటర్ల విభాగంలో కాంస్యం లభించాయి.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: ఆసియా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది?
Published date : 08 Aug 2022 05:44PM