Skip to main content

CWG 2022 : జెరెమీ లాల్‌రినుంగాకి స్వర్ణం

CWG 2022 Weightlifter Jeremy Lalrinnunga Wins Gold In Men's 67kg Final
CWG 2022 Weightlifter Jeremy Lalrinnunga Wins Gold In Men's 67kg Final

కామన్వెల్త్ గేమ్స్ 2022లో జూలై 31న భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించింది. అంతర్జాతీయ జూనియర్‌ స్థాయిలో కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తున్న మిజోరం టీనేజర్‌ జెరెమీ లాల్‌రినుంగా సీనియర్‌ స్థాయిలో పసిడి పతకంతో అరంగేట్రం చేశాడు. జూలై 31న జరిగిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్‌ 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్‌రినుంగా విజేతగా నిలిచాడు. స్నాచ్‌లో 140 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 160 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 300 కేజీలతో జెరెమీ చాంపియన్‌గా అవతరించాడు. స్నాచ్‌లో, ఓవరాల్‌ టోటల్‌లో జెరెమీ రెండు కామన్వెల్త్‌ గేమ్స్‌ కొత్త రికార్డులు సృష్టించాడు. వైపావా లోన్‌ (సమోవా; 127+166=293 కేజీలు) రజతం... ఎడిడియోంగ్‌ యుమోఫియా (నైజీరియా; 130+160=290 కేజీలు) కాంస్యం సాధించారు. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 30th కరెంట్‌ అఫైర్స్‌

మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి దేవి రజత పతకం కైవసం చేసుకుంది. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల బింద్యారాణి మొత్తం 202 కేజీలు (స్నాచ్‌లో 86+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 116) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. అదిజాత్‌ అడెనికి ఒలారినోయి (నైజీరియా; 92+111=203 కేజీలు) స్వర్ణ పతకాన్ని సాధించింది. ఒలారినోయి, బింద్యారాణి ఓవరాల్‌ టోటల్‌ మధ్య కేవలం ఒక కేజీ తేడా ఉండటం గమనార్హం. ఫ్రెయర్‌ మొరో (ఇంగ్లండ్‌; 89+109=198 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 02 Aug 2022 01:54PM

Photo Stories