Daily Current Affairs in Telugu: 2022, జులై 30th కరెంట్ అఫైర్స్
Chess Olympiad 2022: చెన్నైలో ప్రారంభించిన ప్రధాని మోదీ
భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తున్న ఈ పోటీల ప్రారంభ వేడుకలు చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ర్యాలీగా సాగారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్ వాళ్తు గీతాలను ఆలపించారు. చెస్ ఒలంపియాడ్ టార్చ్‌ను గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వేదికపైకి తీసుకురాగా ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్ అందుకున్నారు.
also read: Weekly Current Affairs (Sports) Bitbank: పురుషుల హాకీ ఆసియా కప్ 2022ను ఏ జట్టు గెలుచుకుంది?
భారత్‌లోని చెన్నై వేదికగా జరుగుతున్న 44వ చెస్ ఒలింపియాడ్ నుంచి పాకిస్తాన్ వైదొలిగింది. ఈ నెల జూలై 21 జమ్మూ కశ్మీర్‌లో ఒలింపియాడ్‌కు సంబంధించిన ‘టార్చ్ రిలే’ మొదలైంది. అయితే దీనిపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఆఖరి నిమిషంలో టోర్నీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారి అరిందమ్ బాగ్చి అసహనం వ్యక్తం చేశారు. ‘జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. పక్కదేశానికి అభ్యంతరమేంటి? అయినా ప్రతిష్టాత్మక క్రీడల్లో ఆడేందుకువచ్చి రాజకీయ రగడ చేయడం విచారకరం’ అని అన్నారు.
also read: Quiz of The Day (July 29, 2022): పులుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
Fiscal Deficit: లక్ష్యంలో 21.2 శాతానికి ద్రవ్యలోటు
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి లక్ష్యంలో 21.2 శాతానికి చేరింది. 2022– 23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.16, 61,196 కోట్లు ఉండాలన్నది (జీడీపీ అంచనా ల్లో 6.4 శాతం) కేంద్ర బడ్జెట్ లక్ష్యం. అయితే జూన్ ముగిసే నాటికి ఈ మొత్తం రూ.3.51 లక్షల కోట్లకు చేరినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గణాంకాలు వెల్లడించాయి. గణాంకాల ప్రకారం, జూన్ నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.5,96,040 కోట్లు. ఇది బడ్జెట్ మొత్తం ఆదాయాల అంచనాల్లో 26.1 శాతం. ఇక వ్యయాలు ఇదే కాలంలో రూ.9,47,911 కోట్లు. అంటే మొత్తం ఆర్థిక సంవత్సరం వ్యయ అంచనాల్లో 24 శాతం.
Also read: Vote Application : 17 ఏళ్లు దాటితే దరఖాస్తు
IIBXని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ (గిఫ్ట్) సిటీలో జూలై 29న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ... ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్‌ఎస్‌సీఏ)కి శంకుస్థాపన చేశారు. ఇంటర్నేషనల్ బులియన్ ఎక్చేంచ్ (IIBX)ను ఎన్‌ఎస్‌సీ ( National Stock Exchange), ఐఎఫ్‌ఎస్సీ (International Financial Service Centre), ఎస్‌జీఎక్స్ (Singapore Exchange Ltd) కనెక్ట్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించారు.
also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2022 గెలుచుకున్న మొదటి హిందీ నవల ఏది?
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ... అంతర్జాతీయ ఆర్థిక రంగం రూపురేఖలను ప్రభావితం చేసే అతి కొద్ది దేశాల జాబితాలో ఒకటిగా భారత్ ఎదిగిందని చెప్పారు. ఈ విషయంలో అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల సరసన నిలిచిందని పేర్కొన్నారు. ‘అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లో అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని తీర్చిదిద్దే కొత్త ట్రెండ్లు కనిపిస్తుంటాయి. ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన నిల్చింది. ఈ ఘనత సాధించినందుకు ప్రజలను అభినందిస్తున్నాను. స్వాతంత్య్రానంతరం మనకు మనమే గిరిగీసుకుని కూర్చున్నాం. వందల ఏళ్ల బానిసత్వం వల్ల ఆత్మవిశ్వాసం లోపించడమే ఇందుకు కారణం. కానీ ప్రస్తుతం పాత ఆలోచనా ధోరణులను నవభారతం సమూలంగా మార్చేస్తోంది‘ అని మోదీ అన్నారు. ప్రపంచ ఎకానమీలో భారత్ కీలకంగా ఎదుగుతోందని, దీనికి ఊతమిచ్చే స్థాయి సంస్థలు దేశీయంగా అవసరమని పేర్కొన్నారు. టెక్నాలజీకి హబ్‌గా గిఫ్ట్ సిటీ ఎంతో ప్రత్యేకత సాధించిందని తెలిపారు.
Also read: IMF: ఆర్థిక సంక్షోభం అంచున దేశాలు
Common Wealth Games : ఇంగ్లండ్ ఖాతాలో తొలి స్వర్ణం
ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణం ఆతిథ్య ఇంగ్లండ్ ఖాతాలో చేరింది. జూలై 29న జరిగిన తొలి రోజు పోటీల్లో పురుషుల ట్రయాథ్లాన్‌లో ఇంగ్లండ్‌కు చెందిన అలెక్స్ యీ విజేతగా నిలిచాడు. 50 నిమిషాల 34 సెకన్లలో పరుగు పూర్తి చేసిన యీ అగ్ర స్థానం అందుకోగా...హేడెన్ విల్డ్ (న్యూజిలాండ్), మాథ్యూ హాజర్ (ఆ్రస్టేలియా) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. తొలి రోజు ఆస్ట్రేలియా 2 స్వర్ణాలు, 1 కాంస్యం సాధించగా...ఇంగ్లండ్ 1 స్వర్ణం సహా మొత్తం 5 పతకాలు గెలుచుకుంది. స్కాట్లాండ్, బెర్ముడా ఖాతాలో కూడా ఒక్కో స్వర్ణం చేరాయి.
Also read: Moutaineering : 13 ఏళ్లకే కార్తికేయ రికార్డు
Krishna Projects : గెజిట్ నోటిఫికేషన్ లో సవరణ
కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఆరు ప్రాజెక్టులకు లైన్ క్లియర్ అయింది. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో కేంద్రం గుర్తించిన ఈ ఆరు ప్రాజెక్టులకు మళ్లీ అనుమతి అవసరం లేదన్న ఆంధ్రప్రదేశ్ వాదనతో కేంద్ర ప్రభుత్వం ఏకీభవించింది. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు గంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు పరిధిపై కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో సవరణ చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ మోహన్ జూలై 29న ఉత్తర్వులు జారీ చేశారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 29th కరెంట్ అఫైర్స్
Family Doctor Scheme : నెలలో 26 రోజులు గ్రామాల్లోనే వైద్య సేవలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానం అమలుకు వైద్య, ఆరోగ్య శాఖ ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆశా వర్కర్, ఏఎన్‌ఎం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్ ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్), పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రం) వైద్యుడు.. ఇలా వీరందరి విధులు, బాధ్యతలను ఎస్‌ఓపీలో పొందుపరిచారు. ఎస్‌ఓపీపై జిల్లాల్లో అధికారులు, వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రజలకు ఉత్తమ వైద్యం, ఆరోగ్య సంరక్షణ కోసం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఈ విధానం అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిశ్చయించారు. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
Also read: Jobs: హైకోర్టులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రోజంతా గ్రామంలోనే..
రాష్ట్ర వ్యాప్తంగా 1142 పీహెచ్‌సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండేలా వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో భాగంగా ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులకు తమ పరిధిలోని సచివాలయాలు/విలేజ్ క్లినిక్‌లను విభజిస్తున్నారు. ఏ రోజు ఏ సచివాలయం/విలేజ్ క్లినిక్ పరిధిలో వైద్య సేవలు అందించాలన్న దానిపై టైమ్ టేబుల్ వేస్తున్నారు. దాని ఆధారంగా ఒక్కో వైద్యుడు రోజు మార్చి రోజు గ్రామాలు సందర్శించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పీహెచ్‌సీ వైద్యుల సేవలు నెలలో 26 రోజుల పాటు గ్రామాల్లోనే అందుతాయి. గ్రామాలకు వెళ్లే వైద్యుడు 104 మొబైల్ మెడికల్ యూనిట్‌తో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గ్రామంలోనే ఉంటాడు. అతనితో పాటు ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌లతో కూడిన బృందం గ్రామీణ ప్రజలకు సేవలు అందిస్తుంది. ప్రారంభంలో ప్రతి గ్రామానికి నెలలో ఒక సారి సందర్శన ఉంటుంది. తర్వాత నెలలో రెండు సార్లు 104 ఎంఎంయూ సందర్శించేలా సేవలు విస్తరిస్తారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న 656 వాహనాలకు అదనంగా 432 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.
Also read: Fake Advertisement: ఆ ప్రచారాన్ని నమ్మవద్దు.. నిరుద్యోగులకు సూచన..
తొలుత ఓపీ.. తర్వాత హోమ్ విజిట్స్
- కొన్ని గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ నిర్మాణంలో ఉన్నందున ఓపీ 104 వాహనాల వద్దే ఉంటుంది. క్లినిక్స్ నిర్మాణం పూర్తయ్యాక వాటి వద్దే ఓపీ నిర్వహిస్తారు.
- మెడికల్ ఆఫీసర్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఔట్‌పేషెంట్ సేవలు అందిస్తారు. బీపీ, షుగర్, ఇతర నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌తో బాధపడుతున్న రోగులకు రెగ్యులర్ చెకప్ చేస్తారు.
- గర్భిణులు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తన పరిధిలోని గర్భిణులు, బాలింతలకు అన్ని యాంటీనేటల్, పోస్ట్‌నేటల్ చెకప్స్ జరిగేలా చూస్తారు. హైరిస్క్ గర్భిణులను గుర్తిస్తారు.
- నవజాత, శిశు సంరక్షణ సేవలు అందిస్తారు. అంగన్‌వాడీ సెంటర్‌లు సందర్శించి రక్తహీనతతో బాధ పడుతున్న పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తారు. అవసరమైన వైద్య సేవలు చేస్తారు.
- పిల్లల్లో జబ్బులు, ఎదుగుదల, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు పరీక్షలు చేస్తారు.
- మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వైద్యుడు హోమ్ విజిట్స్ చేస్తారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన రోగుల ఆరోగ్య పరిస్థిని ఫాలో అప్ చేస్తారు.
- మంచానికి పరిమితం అయిన వృద్ధులు, వికలాంగులు, ఇతర రోగులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు అందిస్తారు. క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సేవలు అందిస్తారు.
- పాఠశాలల్లో విద్యార్థులకు జనరల్ చెకప్, అనీమియా, ఇతర సమస్యలకు వైద్యం చేస్తారు. పిల్లల్లో అనీమియా నియంత్రణకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ పంపిణీ అమలును పర్యవేక్షిస్తారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2022 గెలుచుకున్న మొదటి హిందీ నవల ఏది?
ప్రాథమిక ఆరోగ్య సేవలు ఇలా
వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లోని ఎంఎల్‌హెచ్‌పీ తన పరిధిలోని ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందిస్తారు. టెలీ మెడిసిన్ ద్వారా గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ సేవలను అందిస్తారు. 30 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి ఎన్‌సీడీ జబ్బుల నిర్ధారణకు స్క్రీనింగ్ చేపడతారు. మొత్తంగా గ్రామ స్థాయిలో 12 రకాల వైద్య సేలను ప్రజలకు అందిస్తారు.
Also read: Polity Bit Bank For All Competitive Exams: ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి?
ఏఎన్‌ఎం గ్రామ ఆరోగ్య మిత్రగా వ్యవహరిస్తారు. మెరుగైన వైద్యం కోసం పెద్దాస్పత్రులకు రెఫర్ చేసిన ఆరోగ్య శ్రీ కేసులను ఫాలోఅప్ చేస్తారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందిన రోగులకు సీఎం వైఎస్ జగన్ సందేశంతో కూడిన లేఖలను అందజేస్తారు. ఆరోగ్య శ్రీ సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. 104 ఎంఎంయూ వద్ద వైద్య సేవలు పొందడానికి హాజరవ్వాల్సిన యాంటీనేటల్, పోస్ట్ నేటల్ కేసులను నిర్ధారిస్తారు. ఆరోగ్య కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు.
also read: Quiz of The Day (August 01, 2022): హైదరాబాద్ నగరం సముద్రమట్టానికి ఎంత ఎత్తులో ఉంది?
ఫ్యామిలీ డాక్టర్ వైద్య సేవలు పొందడానికి ప్రజలను ఆశ వర్కర్ సమీకరిస్తారు. బాలింతలు, గర్భిణులు, కౌమార దశ పిల్లలకు వైద్య సేవలు అందేలా చూస్తారు. వైద్యుడు గృహాల సందర్శన కోసం మంచానికి పరిమితం అయిన రోగులు, వృద్ధుల వివరాలు సేకరిస్తారు.
Tobacco - New Warnings : సిగరెట్ ప్యాకెట్లు తదితరాలపై కొత్త హెచ్చరిక, బొమ్మ
దేశంలో విక్రయించే పొగాకు ఉత్పత్తుల ప్యాక్‌లపై డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ‘టొబాకో కాజెస్ పెయిన్‌ఫుల్ డెత్’ అనే కొత్త ఆరోగ్య హెచ్చరిక, కొత్త చిత్రం ముద్రితమవుతాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అవి ఏడాది పాటు కొనసాగుతాయని వివరించింది. 2023 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ప్రమాదాన్ని తెలిపే మరో కొత్త చిత్రంతోపాటు ‘టొబాకో యూజర్స్ డై యంగర్’ అని ముద్రితమవుతుందని పేర్కొంది. ఈ మేరకు జూలై 29న నోటిఫికేషన్ జారీ చేసింది. సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ రూల్స్–2008 చట్టానికి 2022 జూలై 21వ తేదీన చేసిన సవరణ డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని వివరించింది. పొగాకు ఉత్పత్తుల తయారీదారు, దిగుమతి దారు, పంపిణీదారులు ఎవరైనా సరే ఈ హెచ్చరికలను ముద్రించకుంటే జైలు శిక్ష, జరిమానా విధించేందుకు చట్టం వీలు కల్పిస్తోందని హెచ్చరించింది.
also read: Family Doctor Scheme : నెలలో 26 రోజులు గ్రామాల్లోనే వైద్య సేవలు
Davis Cup : 51 ఏళ్ల వయసులో మ్యాచ్ గెలిచిన డొమినికో
సాన్ మారినో టెన్నిస్ ఆటగాడు డొమెనికో వికిని అరుదైన రికార్డు సాధించాడు. 51 ఏళ్ల వయసులో డేవిస్ కప్ మ్యాచ్ గెలిచి ఈ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు. బాకులో జరుగుతున్న డేవిస్ కప్ లో జూలై 28న అల్బేనియాతో జరిగిన డేవిస్ కప్ గ్రూప్ - 4 పోరులో పురుషుల డబుల్స్ లో డొమెనికో - మార్కో రోసి 6 - 7, 7 - 6( 7 - 3) తో మార్టిన్ - మారియోపై విజయం సాధించారు. కెరీర్ లో 24వ డేవిస్ కప్ ఆడుతున్న డొమెనికోకు ఇది 99వ మ్యాచ్. మూడేళ్ల క్రితం ఇదే టోర్నీలో సింగిల్స్ మ్యాచ్ గెలిచిన పెద్ద వయస్కుడిగా ( 47 ఏళ్లు, 318 రోజులు ) డొమెనికోనే ఘనత సాధించాడు. 1993లో డొమెనికో డేవిస్ కప్ అరంగ్రేటం చేశాడు.
Also read: Top Career Ideas for Sports Lovers
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP