Skip to main content

Moutaineering : 13 ఏళ్లకే కార్తికేయ రికార్డు

హైదరాబాద్ బోయిన్ పల్లికి చెందిన పడకంటి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ దంపతుల కుమారుడు విశ్వనాథ్ కార్తికేయ పర్వతారోహణలో రికార్డు నెలకొల్పాడు.
World record in mountain climbing by 13 year old boy
World record in mountain climbing by 13 year old boy

13 ఏళ్ల వయసులోనే హిమాలయాల్లోని ఎత్తయిన పర్వతాలుగా పేరుగాంచిన కాంగ్‌యాత్సే, డోజో జోంగోలను తక్కువ సమయంలో అధిరోహించి ఔరా అనిపించాడు. కార్తికేయ 9వ తరగతి చదువుతున్నాడు. అతని అక్క వైష్ణవికి పర్వతారోహణ హాబీ. 2020లో డెహ్రాడూన్‌లోని ఓ పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్తున్న తన వెంట తమ్ముణ్ని సైతం తీసుకెళ్లింది. అక్కయ్య పోరాటాన్ని చూసిన కార్తికేయ కూడా పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రముఖ మౌంటైన్‌ కోచ్‌ భరత్‌ తమ్మినేని వద్ద తర్ఫీదు పొందాడు.  
Also read: Bella J Dark: ఐదేళ్ల వయసు పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిన చిన్నారి

70 గంటల్లో రెండు పర్వతాలు.. 
ఈ నెల 20వ తేదీన హిమాలయాల్లోని లదాక్‌లో అత్యంత ఎత్తయిన కాంగ్‌యాత్సే, జోజోంగో పర్వతాలను 70 గంటల సమయంలో అధిరోహించాడు. పిన్న వయసులోనే ఈ ఘనత సాధించి రికార్డు నెలకొల్పాడు కార్తికేయ. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ పర్వతాలను అధిరోహించిన రికార్డు ఉంది. 

Also read: Justice Ujjal Bhuyan is the new CJ of the High Court:హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 29 Jul 2022 05:57PM

Photo Stories