Sunita Williams in Space: ఐఎస్‌ఎస్ నుంచి త్వరలో రానున్న సునీత విలియమ్స్!
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు చేర్చాక స్టార్‌లైనర్‌లోని రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థలోని కొన్ని థ్రస్టర్లు మొరాయించారు. నౌకను శూన్యంలో సరైన దిశలో తిప్పేందుకు చిన్నపాటి ఇంజన్లవంటి థ్రస్టర్లు అత్యంత కీలకం.
హీలియం సైతం లీక్ అవుతుండటంతో సునీత, విల్మోర్‌ల తిరుగు ప్రయాణాన్ని వాయిదావేసి రిపేర్ల పనిపట్టారు. తాజాగా థ్రస్టర్లను ఒకదాని తర్వాత మరొకటి ఇలా 27 థ్రస్టర్లను మండించి వాటి పనితీరును పరిశీలించారు. 97–02 శాతం ఖచ్చితత్వంతో అవి పనిచేశాయని హాట్ ఫైర్ పరీక్షకు నాయకత్వం వహించిన ఫ్లైట్ డైరెక్టర్ కోలోయి మెహరింగ్ చెప్పారు.
ఈ పరీక్ష జరిపినంతసేపు హీలియం వ్యవస్థలు సవ్యంగానే పనిచేశాయని మెహరింగ్ ప్రకటించారు. ఈ ఫలితాలను వచ్చేవారు సమీక్షించనున్నారు. ఐఎస్‌ఎస్‌ను ఏ రోజున భూమికి తిరుగుపయనం మొదలెట్టాలనే విషయాన్ని వచ్చేవారం సమీక్షలో చర్చించనున్నారు.
Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్.. ఈ సమస్యలే కారణం!!