Skip to main content

Jyothika Sri Dandi: గోదావరి తీరం నుంచి ఒలింపిక్స్‌ దాకా వెళ్లిన క్రీడాకారిణి ఈమెనే..

జ్యోతిక శ్రీ దండి భారతీయ క్రీడాకారిణి.
Tanuku Athlete Jyothika Sri Dandi Go To Paris 2024 Olympics

మహిళల 400 మీట‌ర్ల‌ పరుగులో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు ప్యారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో 4 x 400 భారత మహిళల రిలే జట్టులో భాగంగా పాల్గొంటోంది. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. జ్యోతిక ఇప్పటి వరకు రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది.

అయినా సరే.. వెనుకంజ వేయనివ్వలేదు.. 
మేం ఐరన్‌కి సంబంధించిన వర్క్స్‌ చేస్తాం. జ్యోతిక చిన్నప్పుడు స్థానికంగా జరిగే రన్నింగ్‌ పోటీలు చూసి, తనూ ఉత్సాహం చూపేది. తన ఆసక్తి చూసి, కోచ్‌ దగ్గర చేర్చాం. అలా క్రీడలవైపు ప్రోత్స‌హించాం. 2013లో స్థానికంగా జరిగే పోటీలో పాల్గొంది. అక్కణ్ణుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటూ వచ్చింది. పాల్గొన్న ప్రతి పోటీలో విజేతగా నిలిచింది. వరల్డ్‌ కాంపిటిషన్స్‌కి స్కూల్‌ రోజుల్లోనే వెళ్లింది. టర్కీకి వెళ్లినప్పుడు లక్ష రూపాయలు తప్పనిసరి అన్నారు. అప్పుడు స్థానిక ఎమ్మెల్యే సపోర్ట్‌ చేశారు. ఇంటర్మీడియట్‌లో మంచి గ్రేడ్‌ వచ్చింది. 

Paris Olympics: ఒలింపిక్స్‌లో పడి లేచిన తరంగం.. ‘మను’సంతా పతకమే!

'చదువును కొనసాగిస్తూనే, ఉద్యోగం తెచ్చుకుంటాను అంది. కానీ, స్పోర్ట్స్‌లోనే ఉండమని, అదే మంచి భవిష్యత్తును ఇస్తుంది అని చెప్పాను. విజయవాడలోని అకాడమిలో నాలుగేళ్లు, హైదరాబాద్‌లోని స్పోర్ట్స్‌ అకాడమీలో రెండేళ్లు ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా తన పట్టుదల నన్ను వెనుకంజ వేయనివ్వలేదు. రెండేళ్లుగా ఇండియన్‌ క్యాంపులో ఉండటం వల్ల నాకు కొంచెం వెసులు బాటు వచ్చింది. ఇప్పుడు ఒలింపిక్స్‌లో తన సత్తా చాటడానికి వెళ్లింది. ఇన్నాళ్ల కృషికి తగిన ఫలితం నేడు చూస్తున్నాం. స్పోర్ట్స్‌లో రాణిస్తూనే డిగ్రీ చదువుతోంది. స్పిరిచ్యువల్‌ ఆర్ట్స్‌ వేస్తుంది.దేశానికి పతకం తీసుకురావాలనే లక్ష్య సాధన కోసమే కృషి చేస్తోంది.' అని జ్యోతిక శ్రీ తండ్రి దండి శ్రీనివాసరావు అన్నారు. 

'మాకు ఇద్దరు కూతుళ్లు. చిన్నప్పుడు జ్యోతిక పరుగు మొదలు పెట్టినప్పుడు ఊళ్లో మాకో బిల్డింగ్‌ ఉండేది. పిల్లల లక్ష్యాల కోసం ఆ బిల్డింగ్‌ అమ్మి ఖర్చుపెడుతూ వచ్చాం. పిల్లలే మాకు బిల్డింగ్‌ అనుకున్నాం. స్పోర్ట్స్‌ అంటే మంచి పోషకాహారం, ఫిట్‌నెస్, ట్రయినింగ్‌ ఉండాలి. ఖర్చు అని చూసుకోలేదు.' అని జ్యోతిక తల్లి లక్ష్మీ నాగ వెంకటేశ్వరి అన్నారు.

Paris Olympics: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే ఏపీ క్రీడాకారులు వీరే..

Published date : 29 Jul 2024 06:38PM

Photo Stories