Daily Current Affairs in Telugu: 2022, జులై 29th కరెంట్ అఫైర్స్
INS Vikrant : ఆగస్టు 15న విధుల్లోకి
భారత నావికా దళం కొత్త శక్తిని సముపార్జించుకుంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ జూలై 28న నేవీకి అందజేసింది. షెడ్యూల్ ప్రకారం విక్రాంత్‌ను ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేవీ విధుల్లోకి చేర్చుకుంటారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ విక్రాంత్ చేరికను కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. రూ.20 వేల కోట్లతో నిర్మించిన విక్రాంత్ నాలుగో, తుది దశ సీ ట్రయల్స్‌ను మూడు వారాల క్రితం విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో, యుద్ధ విమాన వాహక నౌకలను దేశీయంగా డిజైన్ చేసి, నిర్మించుకునే సామర్థ్యం సొంతం చేసుకున్న అరుదైన ఘనతను దేశం సొంతం చేసుకుంది. దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సమయాన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహకనౌక(ఐఏసీ) అందడం చారిత్రక సందర్భమని నేవీ పేర్కొంది. ‘త్వరలో నావికాదళంలోకి ప్రవేశించే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో భారతదేశం స్థానం మరింత సుస్థిరం అవుతుంది’అని నేవీ పేర్కొంది.
Also read: Quiz of The Day (July 29, 2022): పులుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
ఐఏసీలో 76% దేశీయంగా తయారు చేసిన సామగ్రినే వినియోగించారు. విక్రాంత్‌లో మెషినరీ ఆపరేషన్, నేవిగేషన్, సర్వైవబిలిటీ గరిష్ట స్థాయి ఆటోమేషన్‌తో రూపొందాయి. ఫిక్స్‌డ్ వింగ్, రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనుగుణంగా దీని డిజైన్ ఉందని నేవీ వివరించింది. ఐఏసీ నుంచి మిగ్–29కే యుద్ధ విమానాలతోపాటు కమోవ్–31 హెలికాప్టర్లు, ఎంఐఐ–60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను కలిపి మొత్తం 30 వరకు నిర్వహించవచ్చు. ఐఏసీలో 2,300 కంపార్టుమెంట్లుండగా 1,700 మంది సిబ్బంది పనిచేసేందుకు, ముఖ్యంగా మహిళా అధికారులకు ప్రత్యేక సౌకర్యాలతో డిజైన్ చేశారు. దీని సాధారణ వేగం 18 నాట్స్ కాగా, గరిష్ట వేగం 28 నాట్స్. ఇది 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు.
Also read: Current Affairs Practice Test: వింబుల్డన్ 2022 పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు ఎవరు?
మరిన్ని వివరాలు
రక్షణ శాఖ, కొచ్చిన షిప్‌యార్డ్ మధ్య ఒప్పందం: 2007
నిర్మాణం ప్రారంభం: 2009
ఐఏసీ పొడవు 262 మీటర్లు,
వెడల్పు 62 మీటర్లు,
ఎత్తు 59 మీటర్లు
88 మెగావాట్ల సామర్థ్యం కలిగిన
4 గ్యాస్ టర్బైన్లు
గరిష్ట వేగం: 28 నాట్స్
also read; Weekly Current Affairs (Sports) Bitbank: పురుషుల హాకీ ఆసియా కప్ 2022ను ఏ జట్టు గెలుచుకుంది?
Vote Application : 17 ఏళ్లు దాటితే దరఖాస్తు
నూతన ఓటర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం జూలై 28న కొత్త నిర్ణయం వెలువరించింది. 18 ఏళ్ల వయసు వచ్చేదాకా వేచి ఉండాల్సిన పనిలేదని, 17 ఏళ్లు నిండగానే ఓటరు నమోదు కోసం ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ స్పష్టంచేశారు. 17 ఏళ్ల వారి ఓటరు దరఖాస్తు స్వీకరణకు అనువుగా రాష్ట్రాల్లో సాంకేతికమార్పు చేయాలని ఎన్నికల అధికారులకు ఈసీ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ ఏడాదికి ముందస్తు దరఖాస్తులను నవంబర్ 9లోపు సమర్పించాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్, ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండేల ప్యానెల్ ఆదేశించినట్లు ఈసీ జూలై 28న ఒక ప్రకటన విడుదలచేసింది. గతంలో జనవరి ఒకటో తేదీనాటికి 18 ఏళ్లు పూర్తయిన వారు మాత్రమే కొత్త ఓటర్లుగా నమోదుచేసుకోవాల్సి వచ్చేది. ఆతేదీకాకుండా కొన్ని రోజుల తర్వాతే 18 ఏళ్లు నిండితే వారు వచ్చే ఏడాది జనవరి ఒకటి దాకా వేచి ఉండాల్సిందే. ఇటీవల సవరణ తెచ్చిన నేపథ్యంలో ఇకపై జనవరి ఒకటి, ఏప్రిల్ ఒకటి, జూలై 1, అక్టోబర్ ఒకటో తేదీ.. వీటిల్లో ఏ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినా వెంటనే కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ప్రతీ 3 నెలకోసారి కొత్త దరఖాస్తుల స్వీకరణకు వీలు చిక్కింది.
also read: GK Persons Quiz: భారతదేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
Moutaineering : 13 ఏళ్లకే కార్తికేయ రికార్డు
13 ఏళ్ల వయసులోనే హిమాలయాల్లోని ఎత్తయిన పర్వతాలుగా పేరుగాంచిన కాంగ్‌యాత్సే, డోజో జోంగోలను తక్కువ సమయంలో అధిరోహించి ఔరా అనిపించాడు. కార్తికేయ 9వ తరగతి చదువుతున్నాడు. అతని అక్క వైష్ణవికి పర్వతారోహణ హాబీ. 2020లో డెహ్రాడూన్‌లోని ఓ పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్తున్న తన వెంట తమ్ముణ్ని సైతం తీసుకెళ్లింది. అక్కయ్య పోరాటాన్ని చూసిన కార్తికేయ కూడా పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రముఖ మౌంటైన్ కోచ్ భరత్ తమ్మినేని వద్ద తర్ఫీదు పొందాడు.
Also read: Bella J Dark: ఐదేళ్ల వయసు పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిన చిన్నారి
70 గంటల్లో రెండు పర్వతాలు..
ఈ నెల 20వ తేదీన హిమాలయాల్లోని లదాక్‌లో అత్యంత ఎత్తయిన కాంగ్‌యాత్సే, జోజోంగో పర్వతాలను 70 గంటల సమయంలో అధిరోహించాడు. పిన్న వయసులోనే ఈ ఘనత సాధించి రికార్డు నెలకొల్పాడు కార్తికేయ. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ పర్వతాలను అధిరోహించిన రికార్డు ఉంది.
Also read: Justice Ujjal Bhuyan is the new CJ of the High Court:హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్
Nuclear Weapons : అమెరికాకి ఉత్తరకొరియా హెచ్చరిక
అమెరికా, దక్షిణకొరియాలతో యుద్ధం వస్తే అణ్వాయుధాలను ప్రయోగించడానికి సైతం తాము సిద్ధమని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ స్పష్టం చేశారు. 1950–53 కొరియా యుద్ధానికి 69 ఏళ్లవుతున్న సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ‘ఎలాంటి సంక్షోభం తలెత్తినా దీటుగా స్పందించేందుకు మా సైనిక బలగాలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయి. అణ్వాయుధాలను సైతం కచ్చితంగా, వేగంగా ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన పేర్కొన్నట్లు అధికార కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కిమ్ హెచ్చరికలతో కొరియా ద్వీపకల్పంపై యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయంది. అమెరికా తన విధానాలను సమర్థించుకోవడానికి ఉత్తరకొరియాను దుష్ట దేశంగా చిత్రీకరిస్తోందని కిమ్ ఆరోపించారు. దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు చేపట్టడం అమెరికా ద్వంద్వ ప్రమాణాలకు, గ్యాంగ్‌స్టర్ వైఖరికి నిదర్శనమన్నారు. అమెరికా రెచ్చగొట్టే, బెదిరింపు చర్యల వల్లే తాము అణు పరీక్షలు జరపాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు అంటున్నారు.
Also read: INS Vikrant : ఆగస్టు 15న విధుల్లోకి
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP