Current Affairs Practice Test: వింబుల్డన్ 2022 పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు ఎవరు?
1. ఈ కింది వాటిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసే నివేదిక/సూచీ
1. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్
2. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్
3. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్
4. గ్లోబల్ హంగర్ ఇండెక్స్
సరైన సమాధానాన్ని గుర్తించండి.
A. 1,2,3
B. 2,3
C. 1,4
D. 1,2,3,4
- View Answer
- సమాధానం: A
2. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
A. 2021 పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత
B. 2022 నేతాజీ పురస్కార గ్రహీత
C. షింజో అబే మరణం దష్ట్యా భారత ప్రభుత్వం జూలై 9ని సంతాప దినంగా ప్రకటించింది
D. షింజో అబే అనారోగ్య సమస్యలతో గుండె పోటుతో మరణించారు.
- View Answer
- సమాధానం: D
3. వింబుల్డన్ 2022 పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు ఎవరు?
A. నోవాక్ జకోవిచ్, ఎలెనా రెబెకెనా
B. రఫెల్ నాదల్, ఎలెనా రెబెకెనా
C. నోవాక్ జకోవిచ్, ఇగా స్వియటెక్
D. రఫెల్ నాదల్, ఎలెనా రెబెకెనా
- View Answer
- సమాధానం: A
4. వస్తు సేవల పన్ను (GST) కి సంబంధించి సరికాని వ్యాఖ్య ?
A. భారత దేశంలో వస్తు సేవల పన్నును జూలై 1, 2017 నుండి అమల్లోకి తెచ్చారు.
B. 100వ రాజ్యాంగ సవరణ ద్వారా వస్తు సేవల పన్నును దేశంలో ప్రవేశ పెట్టారు
C. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న జీ ఎస్ టీ స్లాబులు 0,5,12,18,28
D. రాజ్యాంగ ప్రకరణ 279ఏ జీ ఎస్ టీ మండలి గురించి పేర్కొంటుంది.
- View Answer
- సమాధానం: B
5. ఇటీవల అణు సునామీని సష్టించే బెల్గోరోడ్ జలాంతర్గామి ఏ దేశానికి సంబంధించి వార్తల్లో నిలిచింది.
A. రష్యా
B. అమెరికా
C. ఆస్ట్రేలియా
D. ఇజ్రాఝెల్
- View Answer
- సమాధానం: A