Mann Ki Baat: పెరిగిన ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు..
మహిళల్లో పెరుగుతున్న ఆదరణ, ఉద్యోగాల కల్పన కారణంగా 400 శాతం ఖాదీ, చేనేత దుస్తుల అమ్మకాలు పెరిగాయన్నారు. భారత పౌరులు ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా మోదీ పౌరులకు సూచించారు.
మోదీ మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా గ్రామాల్లో తయారుచేస్తున్న ఖాదీ వ్యాపారం తొలిసారిగా రూ.1.5 లక్షల కోట్లకు చేరింది. గతంతో పోలిస్తే వీటి విక్రయాలు 400 శాతం పెరిగాయి. ఖాదీ, చేనేత విక్రయాలు పెరిగి పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిశ్రమ పురోగతి వల్ల దీనిపై ఎక్కువగా ఆధారపడిన మహిళలకు ప్రయోజనం చేకూరుతోంది. ఇంతకుముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని చాలా మంది ప్రజలు ఇప్పుడు గర్వంగా వీటిని ధరిస్తున్నారు. ఇప్పటి వరకు ఖాదీ దుస్తులు కొనకపోతే వాటిని కొనడం ప్రారంభించండి’ అన్నారు.
ఇదిలా ఉండగా.. ప్రభుత్వం చేనేత, ఖాదీ ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహకాలు అందించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో నేషనల్ హ్యాండ్యూమ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం రూ.200 కోట్లు కేటాయించారు.
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లో హాళ్లకు కొత్త పేర్లు ఇవే..