Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్‌లో హాళ్లకు కొత్త పేర్లు
పలు ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా ఉన్న దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లను పేర్లను.. ఇకపై ‘గణతంత్ర మండపం’,‘అశోక్ మండపం’గా పిలవనున్నారు. ఈ పేర్లను మార్చినట్లు రాష్ట్రపతి భవన్ సచివాలయం (ప్రెసిడెంట్ సెక్రటేరియట్) ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా చేయడంలో భాగంగా ఈ పేర్లు మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా జాతీయ అవార్డుల ప్రదానం వంటి కీలక కార్యక్రమాలు దర్బార్ హాల్‌లో జరుగుతుంటాయి. ‘దర్బార్’ అనే పదం కోర్టు, అసెంబ్లీ అనే అర్థాలను ప్రతిబింబిస్తుంది. గతంలో ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు. అయితే భారత్ గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యతను కోల్పోయింది. గణతంత్ర అనే పదం స్వతంత్ర భారతంలో లోతుగా పాతుకుపోయింది. అందుకే ఈ హాల్‌కు గణతంత్ర మండపంగా మారుస్తున్నాం’ అని అధికారికంగా వెల్లడించింది.
Royalty is Not Tax: చారిత్రక తీర్పు.. మైనింగ్ ట్యాక్స్ రాయల్టీ రాష్ట్రాలకే..!