Vote Application : 17 ఏళ్లు దాటితే దరఖాస్తు
నూతన ఓటర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం జూలై 28న కొత్త నిర్ణయం వెలువరించింది. 18 ఏళ్ల వయసు వచ్చేదాకా వేచి ఉండాల్సిన పనిలేదని, 17 ఏళ్లు నిండగానే ఓటరు నమోదు కోసం ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ స్పష్టంచేశారు. 17 ఏళ్ల వారి ఓటరు దరఖాస్తు స్వీకరణకు అనువుగా రాష్ట్రాల్లో సాంకేతికమార్పు చేయాలని ఎన్నికల అధికారులకు ఈసీ మార్గదర్శకాలు జారీచేసింది. ఈ ఏడాదికి ముందస్తు దరఖాస్తులను నవంబర్ 9లోపు సమర్పించాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్, ఎలక్షన్ కమిషనర్ అనూప్ చంద్ర పాండేల ప్యానెల్ ఆదేశించినట్లు ఈసీ జూలై 28న ఒక ప్రకటన విడుదలచేసింది. గతంలో జనవరి ఒకటో తేదీనాటికి 18 ఏళ్లు పూర్తయిన వారు మాత్రమే కొత్త ఓటర్లుగా నమోదుచేసుకోవాల్సి వచ్చేది. ఆతేదీకాకుండా కొన్ని రోజుల తర్వాతే 18 ఏళ్లు నిండితే వారు వచ్చే ఏడాది జనవరి ఒకటి దాకా వేచి ఉండాల్సిందే. ఇటీవల సవరణ తెచ్చిన నేపథ్యంలో ఇకపై జనవరి ఒకటి, ఏప్రిల్ ఒకటి, జూలై 1, అక్టోబర్ ఒకటో తేదీ.. వీటిల్లో ఏ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినా వెంటనే కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతో ప్రతీ 3 నెలకోసారి కొత్త దరఖాస్తుల స్వీకరణకు వీలు చిక్కింది.
also read: GK Persons Quiz: భారతదేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఎవరు నియమితులయ్యారు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP