Skip to main content

Assembly Election: ప్రశాంతంగా జ‌రిగిన‌ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు

మహారాష్ట్ర, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు న‌వంబ‌ర్ 20వ తేదీ ప్రశాంతంగా ముగిశాయి.
Maharashtra, Jharkhand Assembly Election 2024  Maharashtra and Jharkhand assembly elections

మహారాష్ట్రలో.. 288 స్థానాల ఉన్న శాసనసభకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టంగా చేపట్టబడి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. సాయంత్రం 5 గంటలకల్లా రాష్ట్రంలో 58.22 శాతం ఓటింగ్‌ నమోదైంది. 1,00,186 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి, 4,100 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడతాయి.

జార్ఖండ్‌లో.. రెండో విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినవి. 38 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలవరకు 67.59 శాతం ఓటింగ్‌ నమోదైంది. 12 జిల్లాల్లో 14,218 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. జార్ఖండ్‌లో తొలి విడత పోలింగ్‌ 13వ తేదీన జరిగింది. ఈ నెల 23న ఫలితాలు వెలువడతాయి.

Karimganj District: కరీంగంజ్ జిల్లా పేరు మార్చిన ప్రభుత్వం

ఉప ఎన్నికలు: ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కూడా న‌వంబ‌ర్ 20వ తేదీ ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఉప ఎన్నికలు నిర్వహించబడ్డాయి. 

Published date : 22 Nov 2024 03:43PM

Photo Stories