Indian Army Chief: భారత సైన్యాధ్యక్షుడికి నేపాల్ గౌరవ సేనాని హోదా
Sakshi Education
భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేదికి నేపాల్ సైన్యంలో గౌరవ సేనాని హోదా ప్రదానం చేశారు.
నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శీతల్ నివాస్‌లో జరిగిన కార్యక్రమంలో జనరల్ ద్వివేదిని ఈ గౌరవ హోదాతో సత్కరించారు.
1950 నుంచి భారత, నేపాల్ సైన్యాలు ఈ తరహా గౌరవ హోదాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ సాంప్రదాయానికి అనుగుణంగా, జనరల్ ద్వివేది ఈ గౌరవం పొందారు.
జనరల్ ద్వివేది, నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ సిగ్డెల్ ఆహ్వానంపై, ఐదు రోజుల అధికార పర్యటన కోసం నేపాల్ వెళ్లారు. ఈ పర్యటనలో.. సైన్యాధికారులు భారత-నేపాల్ సైన్యాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరచడం గురించి చర్చలు జరిపారు.
CISF Battalion : తొలిసారిగా మహిళా సీఐఎస్‌ఎఫ్ బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర హోం శాఖ ఆమోదం!
Published date : 22 Nov 2024 05:19PM