Skip to main content

Most Distant Star ఎరెండల్

విశ్వమంతటిలోనూ అత్యంత సుదూరంలో ఉన్న నక్షత్రం ఎరెండల్‌ ను  జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ క్లిక్‌మనిపించింది. ఇది సన్‌రైజ్‌ ఆర్క్‌ అనే గెలాక్సీలో ఉందని పేర్కొంది.
Most Distant Star Arendal
Most Distant Star Arendal

ఈ గెలాక్సీ భూమికి ఏకంగా 2,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇప్పటిదాకా మనకు చిక్కిన అత్యంత సుదూరంలోని తార కేవలం 1,000 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దానికంటే ఎరెండల్‌ ఏకంగా 1,800 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది ముందుగా హబుల్‌ టెలిస్కోప్‌కు కనిపించింది. దాంతో ఆశ్చర్యానికి లోనైన నాసా సైంటిస్టులు జూలై 30న జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ ద్వారా కూడా పరీక్షించారు. దాని ఉనికి నిజమేనని నిర్ధారించుకున్నారు. దీని కాంతి భూమిని చేరేందుకు ఏకంగా 1,290 కోట్ల కాంతి సంవత్సరాలు పడుందని తేల్చారు. ఆ లెక్కన మనకిప్పుడు చిక్కిన ఎరెండెల్‌ రూపం బిగ్‌బ్యాంగ్‌ అనంతరం కేవలం 90 కోట్ల ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు తెలిపారు.  
ఎరెండెల్‌ అంటే వేకువ తార అని అర్థం. 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 08 Aug 2022 06:02PM

Photo Stories