Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 6th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu August 6th 2022
Current Affairs in Telugu August 6th 2022


World Athletics U 20: రూపల్‌ చౌదరీకి కాంస్యం  


ప్రపంచ అండర్‌–20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో పతకం వచ్చింది. కొలంబియాలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో మహిళల 400 మీటర్ల విభాగంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రూపల్‌ చౌదరీ కాంస్య పతకాన్ని సాధించింది. 17 ఏళ్ల రూపల్‌ 400 మీటర్ల దూరాన్ని 51.85 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. యెమీ మేరీజాన్‌ (బ్రిటన్‌; 51.50 సెకన్లు) స్వర్ణం గెలిచింది. ఈ పతకంతో రూపల్‌ ప్రపంచ అండర్‌–20 చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 4X400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్‌లో రజతం నెగ్గిన భారత బృందంలో రూపల్‌ సభ్యురాలిగా ఉంది.

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన 5వ జాయింట్‌గా ఎవరు నిలిచారు?

CWG 2022: రెజ్లింగ్ లో భారత్ కు 3 స్వర్ణాలు 

స్టార్‌ రెజ్లర్లు బజరంగ్‌ పూనియా, దీపక్‌ పూనియా, సాక్షి మలిక్‌ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్‌ రజతం... దివ్య కక్రాన్, మోహిత్‌ గ్రెవాల్‌ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్స్‌లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు.  

Also read: Quiz of The Day (August 06, 2022): భారతదేశంలో తొలి మొబైల్ మ్యూజిక్ క్లాస్ రూమ్, రికార్డింగ్ స్టూడియోను ఏ నగరంలో ప్రారంభించారు?

పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో బజరంగ్‌ పూనియా (65 కేజీలు), దీపక్‌ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్‌ గ్రెవాల్‌ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగంలో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్‌ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు.  

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్త చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?

బంగారం @ 75 
స్కాట్లాండ్‌కు చెందిన జార్జ్‌ మిల్లర్‌ ‘లేట్‌ వయసు’లో గ్రేట్‌ అనిపించుకున్నాడు. 75 ఏళ్ల 8 నెలల జార్జ్‌ ‘లాన్‌ బౌల్స్‌’ మిక్స్‌డ్‌ పెయిర్‌లో బంగారు పతకం సాధించాడు. మెలనీ ఇన్నెస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. తద్వారా కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో పసిడి పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: 1,800 టన్నుల రిఫైనింగ్ కెపాసిటీతో గోల్డ్ రీసైక్లింగ్‌లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది?

5.4 శాతానికి RBI Repo Rate  

ధరల కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు.. రెపోను మరో 50 బేసిస్‌ పాయింట్లు లేదా 0.5 శాతం (100 బేసిస్‌ పాయింట్లు 1%) పెంచాలని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీంతో రెపో 5.4 శాతానికి చేరింది.  మే నెల నుంచి రెపో రేటు 1.4 శాతం పెరిగినట్లయ్యింది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని తగ్గించి తద్వారా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్నది ఈ ఇన్‌స్ట్రుమెంట్‌ ఉద్దేశం. ఈ ప్రభావంతో బ్యాంకులు కూడా వడ్డీరేట్లను ఇంకాస్త పెంచనుండటంతో రుణాలపై నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు)  ఎగబాకనున్నాయి. కాగా, రిటైల్‌ ద్రవ్యోల్బణం 2022–23లో  6.7%గా ఉంటుందన్న అంచనాలను యథాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ పాలసీ పేర్కొంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు విషయంలోనూ అంచనాను యథాతథంగా 7.2 శాతం వద్ద కొనసాగించింది.  

Also read: Quiz of The Day (August 05, 2022): ప్రపంచంలో తొలి ఆటోమేటెడ్, డ్రైవర్‌లెస్ రైలును ప్రారంభించిన దేశం?

కోవిడ్‌–19 కన్నా పావుశాతం అధికం 
తాజా పెంపుతో రెపో రేటు కరోనా ముందస్తు స్థాయికన్నా పావుశాతం అధికం కావడం గమనార్హం.  వృద్ధి మందగమనాన్ని నిరోధించడానికి 2019 ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ 2020 మే 22 వరకూ మొత్తం 250 బేసిస్‌ పాయింట్ల రెపో రేటును తగ్గించింది.ఇందులో మహమ్మారి ప్రారంభమైన తర్వాత (2020 మార్చి నుంచి 2020 మే మధ్య) తగ్గింపే 115 బేసిస్‌ పాయింట్లు. అంటే మహమ్మారికి ముందు వరకూ రెపో రేటు 5.15 శాతంగా ఉంది.  2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 %కి) తగ్గించిన నాటి నుంచి 4% వద్ద రెపో రేటు (వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల్లో యథాతథ నిర్ణయం) కొనసాగింది. ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉంటుందన్న భరోసాను ఇస్తూ, వృద్ధే లక్ష్యంగా సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తూ వచ్చింది.  నాలుగేళ్ల తర్వాత (2018 ఆగస్టు అనంతరం) మొదటిసారి ఆర్‌బీఐ మే 4వ తేదీన ఆకస్మికంగా రెపో రేటును 0.40 శాతం పెంచింది. జూన్‌ 8వ తేదీన మరో 50 బేసిస్‌ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల పెంపును షురూ చేశాయి.  

Also read: Weekly Current Affairs (National) Bitbank: ఏ రాష్ట్ర ప్రభుత్వం 'ఫ్రూట్స్' సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించింది?

పాలసీ ముఖ్యాంశాలు... 

  • 2022–23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని పాలసీ భావిస్తోంది. 
  • రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.7 శాతంగా అంచనా వేయగా, వరుసగా 2,3,4 (2022 జూలై–మార్చి 2023) త్రైమాసికాల్లో 7.1%, 6.4%, 5.8 శాతాలుగా నమోదవుతాయి. 2023–24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 5%కి ఇది దిగివస్తుంది.  
  • భారత్‌ వద్ద ప్రస్తుతం 550 బిలియన్‌ డాలర్లకుపైగా ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకోగలిగిన స్థాయిలో ఉన్నాయి. అధిక ఫారెక్స్‌ నిల్వలు ఉన్న దేశాల్లో భారత్‌ నాల్గవ స్థానంలో ఉంది.  
  • వృద్ధి ధోరణి కొనసాగేలా తగిన చర్యలు తీసుకుంటూనే ద్రవ్యోల్బణం నియంత్రణే లక్ష్యంగా సరళ పాలసీ విధానాన్ని ఉపసంహరించుకోవడంపై ద్రవ్య విధాన కమిటీ దృష్టి సారిస్తుంది.  

    Also read: Polity Bit Bank For All Competitive Exams: సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
     
  • ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 4వ తేదీ వరకూ డాలర్‌ మారకంలో రూపాయి మారకపు విలువ 4.7 శాతం పతనమైంది. భారత ఆర్థిక వ్యవస్థ  స్థూల ఆర్థిక మూలాధారాల బలహీనత కంటే,  అమెరికా డాలర్‌ విలువ పెరగడం వల్ల రూపాయి విలువ మరింతగా క్షీణించింది. అయినా డాలర్‌ మారకంలో మిగిలిన దేశాలతో పోల్చితే భారత్‌ కరెన్సీ పటిష్టంగానే ఉంది.  
  • భారత్‌లోని తమ కుటుంబాల తరపున యుటిలిటీ, విద్య చెల్లింపుల కోసం ఎన్‌ఆర్‌ఐలు భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (బీబీపీఎస్‌)ను వినియోగించుకునేలా తగిన యంత్రాంగాన్ని రూపొందించనుంది.  
  • 2021 ఏప్రిల్‌–జూన్‌ మధ్య దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐల పరిమాణం 11.6 బిలియన్‌ డాలర్లు అయితే, 2022 ఇదే కాలంలో ఈ పరిమాణం 13.6 బిలియన్‌ డాలర్లకు చేరింది.  
  • తదుపరి ద్వైమాసిక సమావేశం సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ మధ్య జరగనుంది.

 
Americaతో అన్ని రకాల చర్చలు రద్దు చేసిన China  

పెలోసీ, ఆమె కుటుంబసభ్యులు తైవాన్‌కు రావద్దంటూ ఆంక్షలు విధించింది. రక్షణ, వాతావరణ మార్పులు తదితర కీలక అంశాలపై అమెరికాతో జరుగుతున్న చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు ఆగస్టు 5న ప్రకటించింది. ‘మా తీవ్ర ఆందోళనను, వ్యతిరేకతను పట్టించుకోకుండా పెలోసీ తైవాన్‌ను సందర్శించారు. ఈ చర్య ద్వారా చైనా అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. చైనా సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించారు. ఒకే చైనా విధానాన్ని తుంగలో తొక్కారు. తైవాన్‌ జల సంధిలో శాంతి, సుస్థిరతలను దెబ్బతీశారు. ఇందుకు బదులుగా ఆంక్షలు విధిస్తున్నాం’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘చైనా–యూఎస్‌ థియేటర్‌ కమాండర్స్, చైనా–యూఎస్‌ డిఫెన్స్‌ పాలసీ కోఆర్డినేషన్, చైనా–యూఎస్‌ మిలటరీ మారిటైమ్‌ కన్సల్టేటివ్‌ అగ్రిమెంట్‌పై జరిగే చర్చలను రద్దు చేసుకుంటున్నట్లు చైనా మరో ప్రకటనలో పేర్కొంది. అక్రమ వలసదారులను తిరిగి చైనాకు తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిన చర్చలు, నేరగాళ్లు, మాదకద్రవ్యాలు, వాతావరణ మార్పులపై అమెరికాతో చర్చల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు తెలిపింది. తైవాన్‌ తమదేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా అంటోంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత తైవాన్‌లో పర్యటించిన అమెరికా అత్యున్నత హోదా అధికారి పెలోసీయే. ఆమె రాకపై తీవ్రంగా స్పందించిన చైనా తైవాన్‌ జల సంధిని దిగ్బంధించింది. తైవాన్‌ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేపట్టేందుకు శుక్రవారం 100 యుద్ధ విమానాలను, 10 యుద్ధ నౌకలను పంపించింది. 

Also read: అమెరికా Taiwan పర్యటనతో China ఆగ్రహం

మమ్మల్ని చైనా అడ్డుకోలేదు: పెలోసీ 
చైనా ప్రభుత్వం ప్రకటించిన ఆంక్షలపై జపాన్‌ పర్యటనలో ఉన్న పెలోసీ స్పందించారు. అమెరికా అధికారులు తైవాన్‌లో పర్యటించకుండా చైనా అడ్డుకోలేదన్నారు. తైవాన్‌ను చైనా ఏకాకిని చేయలేదన్నారు. తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా కొనసాగిస్తున్న సైనిక విన్యాసాలను బాధ్యతారాహిత్యమైనవి, రెచ్చగొట్టేవి అంటూ అమెరికా పేర్కొంది.  


HAL Tejas పై  6 దేశాల ఆసక్తి 

తేజస్‌ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో రాయల్‌ మలేషియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి ప్రాథమిక టెండర్‌ను హెచ్‌ఏఎల్‌ స్వీకరించిందని అన్నారు. ట్విన్‌–సీటర్‌ వేరియంట్‌ తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనాలని మలేషియా నిర్ణయించుకుందని వెల్లడించారు. కాలంచెల్లిన రష్యన్‌ మిగ్‌–29 ఫైటర్‌ విమానాల స్థానంలో తేజస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోందని పేర్కొన్నారు. ఆగస్టు 5న లోక్‌సభలో ఓ ప్రశ్నకు అజయ్‌ భట్‌ సమాధానమిచ్చారు. స్టీల్త్‌ ఫైటర్‌ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు. ‘అటనామస్‌ ఫ్లైయింగ్‌ వింగ్‌ టెక్నాలజీ డెమాన్ర్‌స్టేటర్‌’ను డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని చెప్పారు. భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) అవసరాల కోసం రూ.48,000 కోట్లతో 83 తేలికపాటి తేజస్‌ యుద్దవిమానాల కొనుగోలు కోసం రక్షణ శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 3rd కరెంట్‌ అఫైర్స్‌
 
Talak రాతపూర్వకంగా కూడా చెల్లదు


 

ఏక వాక్యంలో మూడుసార్లు చెప్పే తలాక్‌కు ఎలాంటి గుర్తింపు లేదంది. మూడుసార్లు తలాక్‌ చెప్పి, దాన్ని రాతపూర్వకంగా పంపడం చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. ఒకవేళ ఇస్లాం చట్ట నిబంధనల ప్రకారం విడాకులు తీసుకోవాలంటే.. భార్య, భర్త ఇద్దరి తరపు మధ్యవర్తులు వారి మధ్య సయోధ్యకు ప్రయత్నించాలంది. అది సాధ్యం కానప్పుడే సహేతుక కారణాలతో తలాక్‌ చెప్పొచ్చునని, అలా చెప్పే తలాక్‌ల మధ్య తగిన వ్యవధి ఉండి తీరాలని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారీ ఇటీవల తీర్పు వెలువరించారు.

Also read: Justice U U Lalit : సుప్రీంకోర్టు కొత్త చీఫ్‌ జస్టిస్‌గా యూయూ లలిత్ ఎంపిక‌..

ఇదీ వివాదం...
తను, తన భర్త వేర్వేరుగా ఉంటున్న నేపథ్యంలో భర్త నుంచి జీవన భృతి ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పి.గౌస్‌బీ 2004లో పొన్నూరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనను ఆమె భర్త జాన్‌ సైదా వ్యతిరేకించారు. తాను తలాక్‌ చెప్పి, దాన్ని రిజిస్టర్‌ పోస్టులో భార్యకు పంపానని, అయితే అది తిరస్కరణ కారణంతో తిరిగి వచ్చిందని, కాబట్టి జీవన భృతి చెల్లించాల్సిన అవసరం లేదని సైదా వాదించారు. పొన్నూరు కోర్టు సైదా వాదనలను తోసిపుచ్చుతూ గౌస్‌బీ, ఆమె కుమారుడికి నెలకు రూ.8 వేలు జీవన భృతి కింద చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ జాన్‌ సైదా అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ జరిపిన గుంటూరు మొదటి అదనపు సెషన్స్‌ కోర్టు, కుమారుడికి జీవనభృతి చెల్లించాలని, గౌస్‌బీకి అవసరం లేదంటూ తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ గౌస్‌బీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రవినాథ్‌ తిల్హారీ విచారణ జరిపి ఇటీవల తీర్పు వెలువరించారు. గౌస్‌బీ, ఆమె కుమారుడికి జీవనభృతి చెల్లించాలంటూ పొన్నూరు కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. భార్యకు మూడుసార్లు తలాక్‌ చెప్పి, దాన్ని రిజిస్టర్‌ పోస్టులో పంపి వివాహం రద్దయినట్లు పేర్కొనడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం ద్వారా వివాహం రద్దు కాదన్నారు. భార్య, భర్త వేర్వేరుగా ఉంటున్నందున భర్త నుంచి భరణం పొందేందుకు ఆ మహిళ అర్హురాలేనని స్పష్టంచేశారు. 

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 4th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 06 Aug 2022 06:08PM

Photo Stories