Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 3rd కరెంట్ అఫైర్స్
China-Taiwan Tensions: 25 ఏళ్ల తర్వాత తొలిసారి స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో
మలేషియా నుంచి విమానంలో తైవాన్ రాజధాని తైపీకి చేరుకున్నారు. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని, తమ మాట వినకుండా అక్కడ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ డ్రాగన్ దేశం చైనా చేసిన హెచ్చరికలను ఆమె ఏమాత్రం లెక్కచేయలేదు. అమెరికాకు తైవాన్ సన్నిహిత మిత్రదేశంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 25 ఏళ్ల తర్వాత తైవాన్‌ను సందర్శిస్తున్న అత్యున్నత అమెరికా ప్రతినిధి నాన్సీ పెలోసీ కావడం గమనార్హం. తైవాన్‌కు చేరుకున్నాక ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తైవాన్‌లో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని అమెరికా ఆకాంక్షిస్తోందని, అందుకు తగిన సాయాన్ని కొనసాగిస్తుండడాన్ని గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
also read: Indian Polity Bit Bank For All Competitive Exams:దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి?
పెలోసీ తైవాన్ పర్యటన నేపథ్యంలో అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లే అవకాశం కనిపిస్తోంది. తైవాన్‌లో పెలోసీ పర్యటన ప్రారంభం కాగానే చైనా అధికారిక జిన్‌హువా వార్తా సంస్థ స్పందించింది. తైవాన్ పరిసర సముద్ర జలాల్లో తమ(చైనా) సైన్యం ఆదివారం వరకు లైవ్–ఫైర్ డ్రిల్స్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. అమెరికాకు హెచ్చరికగా సైనిక విన్యాసాలకు చైనా శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. చైనా సైన్యం తైవాన్ వైపు 21 విమానాలను పంపించింది.
Also read: 5G Spectrum : రూ. 1.5 లక్షల కోట్ల బిడ్లు
నిప్పుతో చెలగాటం: చైనా
అమెరికా వైఖరిపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అసహనం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోతోందని అన్నారు. తైవాన్ విషయంలో కొందరు అమెరికా రాజకీయవేత్తలు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. అమెరికా వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదన్నారు. పెలోసీ పర్యటన ప్రభావం చైనా–అమెరికా సంబంధాలపై కచి్చతంగా ఉంటుందని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పెలోసీ పర్యటన కంటే ముందు హ్యాకర్లు తైవాన్ అధ్యక్షుడి కార్యాలయం వెబ్‌సైట్‌పై సైబర్‌దాడికి దిగారు. దాంతో కొద్దిసేపు వెబ్‌సైట్ పనిచేయలేదు.
also read: CWG 2022: అచింత షెయులికి స్వర్ణం
Loans Writeoff : 5 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్లు రద్దు
గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.2,36,265 కోట్లుండగా, 2021–22లో రద్దైన మొండి బకాయిలు రూ.1,57,096 కోట్లకు తగ్గినట్లు వివరించింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్ ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఆర్‌బీఐకి అందిన డేటాను అనుసరించి గత నాలుగేళ్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 10,306గా ఉందని ఆయన చెప్పారు. ఇందులో అగ్రభాగాన.. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.7,110 కోట్లు, ఈరా ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ రూ.5,879 కోట్లు, కాన్‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ రూ.4,107 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని వెల్లడించారు.
Also read: China-Taiwan Tensions: 25 ఏళ్ల తర్వాత తొలిసారి స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో
Digital Payments : భారతీయ యూజర్లు 34.6 కోట్లు
ఈ–కామర్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లుగా ఉన్న యూఎస్ జనాభా కంటే అధికం కావడం విశేషం. ‘భారత్‌లో ఇంటర్నెట్’ పేరుతో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మార్కెటింగ్ డేటా, అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. 2019లో దేశంలో ఆన్‌లైన్ లావాదేవీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు. కరోనా మహమ్మారి కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్ వినియోగం పరంగా సామాజిక మాధ్యమాలు, వినోదం, సమాచార కార్యకలాపాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సమాచార విభాగంలో టెక్ట్స్, ఈ–మెయిల్ అత్యంత ప్రజాదరణ పొందాయి. వాయిస్, దేశీయ భాషల వినియోగం భవిష్యత్తులో వృద్ధికి కీలకాంశాలుగా ఉంటాయి. గ్రామీణ భారతదేశంలో ఓటీటీ వేదికల వినియోగం పట్టణ భారత్‌తో సమానంగా ఉంది. ఆన్‌లైన్ గేమింగ్, ఈ–కామర్స్, డిజిటల్ చెల్లింపుల వ్యాప్తి ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లోనే అధికం.
Also read: Loans Writeoff : 5 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్లు రద్దు
దేశవ్యాప్తంగా 69.2 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 35.1 కోట్లు, పట్టణ ప్రాంతాల నుంచి 34.1 కోట్ల మంది ఉన్నారు. 2025 నాటికి నెటిజన్ల సంఖ్య భారత్‌లో 90 కోట్లను తాకుతుంది.
Also read: GST : 2022 జూలైలో వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు
యూపీఐ వినియోగం భేష్: ప్రధాని
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) జూలైలో ఆరు బిలియన్ల లావాదేవీలను నమోదు చేయడం ‘అత్యద్భుతమైన అంశమని‘ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 2న ప్రశంసించారు. కొత్త టెక్నాలజీలను స్వీకరించడానికి, ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా, పారదర్శకంగా మార్చడానికి ప్రజల సమిష్టి సంకల్పాన్ని ఇది సూచిస్తోందని అన్నారు. ‘‘యూపీఐ జూలైలో 6 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. 2016 నుండి ఎన్నడూ లేని విధంగా ఈ భారీ లావాదేవీలు జరిగాయి’’ అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో డిజిటల్ పేమెంట్ సరీ్వసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా మోదీ పేర్కొన్నారు.
India Exports - Imports : జూలై గణాంకాలు నిరాశాజనకం
భారత్ ఎగుమతులు–దిగుమతులకు సంబంధించి జూలై గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, ఎగుమతులు స్వల్పంగా 0.76 శాతం క్షీణించి (2021 జూలై నెలతో పోల్చి) 35.24 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఇక ఎగుమతులు 44 శాతం పెరిగి 66.26 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు భారీగా 31.02 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2021 జూలైలో భారత్ వాణిజ్యలోటు 10.63 బిలియన్ డాలర్లు మాత్రమే. పసిడి దిగుమతులు జూలైలో వార్షికంగా సగానికి సగం పడిపోయి 2.37 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం.
Also read: Quiz of The Day (August 03, 2022): భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది?
ఏప్రిల్ నుంచి జూలై వరకూ...: ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో భారత్ ఎగుమతుల విలువ 156 బిలియన్ డాలర్లు. దిగుమతుల విలువ 48 శాతం ఎగసి 256 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు 100 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం భారత్ ఎగుమతుల లక్ష్యం 400 బిలియన్ డాలర్ల సాధన నెరవేరింది. 2022–23లో కూడా 470 బిలియన్ డాలర్ల లక్ష్య సాధన నెరవేరుతుందన్న విశ్వాసాన్ని వాణిజ్యశాఖ కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం వ్యక్తం చేశారు. డిమాండ్–సరఫరాల సవాళ్లు, నియంత్రణలు, కోవిడ్–19 సమస్యలు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ, ఎగుమతుల విభాగం చక్కని పనితీరునే కనబరుస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మరో ప్రకటనలో పేర్కొంది.
E - Invoice : అక్టోబరు 1 నుంచి తప్పనిసరి
వార్షిక టర్నోవర్ రూ. 10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) నమోదిత బిజినెస్‌లు బీ2బీ లావాదేవీల కోసం ఇ–ఇన్‌వాయిస్‌లను జనరేట్ చేయడం అక్టోబర్ 1 తప్పనిసరని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం రూ. 20 కోట్లు, అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు అన్ని బీ2బీ లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ను జనరేట్ చేస్తున్నాయి.
Also read: Loans Writeoff : 5 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్లు రద్దు
CWG 2022 : లానా బౌల్స్ లో భారత్ కు స్వర్ణం
లాన్ బౌల్స్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. లవ్లీ, పింకీ, రూప, నయన్‌మోని సభ్యులుగా ఉన్న ‘ఫోర్స్’ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. ఫైనల్లో భారత్ 17–10 పాయింట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది.
Also read: Loans Writeoff : 5 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్లు రద్దు
టేబుల్ టెన్నిస్‌లో పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ హవా కొనసాగింది. ఫైనల్లో భారత్ 3–1 తేడాతో సింగపూర్‌పై విజయం సాధించింది. తొలి మ్యాచ్ డబుల్స్‌లో హర్మీత్ దేశాయ్–సత్యన్ జోడీ 13–11, 11–7, 11–5తో యాంగ్ క్విక్–కూన్ పాంగ్‌పై గెలుపొందింది. అయితే ఆ తర్వాత సింగిల్స్‌లో భారత టాప్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ అనూహ్యంగా 7–11, 14–12, 3–11, 9–11తో క్లారెన్స్ చూ చేతిలో ఓటమి పాలయ్యాడు. మరో సింగిల్స్‌లో సత్యన్ 12–10, 7–11, 11–7, 11–4తో ఎన్ కూన్ పాంగ్‌ను చిత్తు చేశాడు. ఆ తర్వాత కీలకమైన మూడో సింగిల్స్‌లో సత్తా చాటిన హరీ్మత్ దేశాయ్ 11–8, 11–5, 11–6తో క్లారెన్స్ చూపై గెలుపొంది భారత్‌కు స్వర్ణం ఖాయం చేశాడు.
Also read: CWG 2022 : 11 స్వర్ణాల మెక్ కియోన్
భారత సీనియర్ వెయిట్‌లిఫ్టర్ వికాస్ ఠాకూర్ వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్‌లోనూ పతకంతో మెరిశాడు. పురుషుల 96 కేజీల విభాగంలో 28 ఏళ్ల వికాస్ రజత పతకం సాధించాడు. పంజాబ్‌కు చెందిన వికాస్ మొత్తం 346 కేజీలు (స్నాచ్‌లో 155+క్లీన్ అండ్ జెర్క్‌లో 191) బరువెత్తి రెండో స్థానంలో నిలిచాడు. డాన్ ఒపెలోజ్ (సమోవా; 381 కేజీలు) స్వర్ణం, టానియెలా ట్యుసువా (ఫిజీ; 343 కేజీలు) కాంస్యం గెలిచారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 85 కేజీల విభాగంలో రజతం నెగ్గిన వికాస్... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 94 కేజీల విభాగంలో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 2nd కరెంట్ అఫైర్స్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP