GST : 2022 జూలైలో వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు
వివిధ రకాల పరోక్ష పన్నుల స్థానంలో 2017 జూలై నుంచి జీఎస్‌టీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో పన్ను వసూళ్లు జరగడం ఇది రెండవ సారి. 2022 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి. ఎకానమీ రికవరీ, పన్నుల ఎగవేతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్న ఫలితమే తాజా భారీ పరోక్ష పన్ను వసూళ్లకు కారణమని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి
నెలవారీగా రూ.1.40 లక్షల కోట్ల పైబడి జీఎస్‌టీ వసూళ్లు జరగడం ఈ వ్యవస్థ ప్రారంభం తర్వాత ఇది ఆరవసారి. 2022 మార్చి నుంచి వరుసగా ఐదు నెలలూ ఈ స్థాయిపైనే వసూళ్లు జరిగాయి. ఒక్క ఫిబ్రవరిని మినహాయిస్తే, ఈ ఏడాది ఇప్పటి వరకూ వసూళ్లు ప్రతినెలా రూ.1.40 లక్షల కోట్లపైనే నమోదయ్యాయి. వరుసగా 13 నెలల నుంచి రూ. లక్ష కోట్లపైన వసూళ్లు జరిగాయి.
Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి
మొత్తం రూ.1,48,995 కోట్ల వసూళ్లలో సెంట్రల్ జీఎస్‌టీ రూ.25,751 కోట్లు. స్టేస్ జీఎస్‌టీ రూ.32,807 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.79,518 కోట్లు. సెస్ రూ.10,920 కోట్లు.
Also read: GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్