Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం ఏర్పాటు

50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు ఈ ప్రక్రియకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 16వ తేదీ ఈ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదముద్ర వేసిన విషయం అధికారికంగా ప్రకటించబడింది.
ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి, కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. అయితే, వేతన సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడుతుందో, అది ఎప్పటి వరకు పనిచేయనుందో అన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.
ఫిట్మెంట్ 2.57 రెట్లకు బదులుగా 2.86 రెట్లు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ ఫిట్మెంట్ పెరిగినట్లయితే, మూలవేతనాలు, హౌస్ రెంట్ అలవెన్సులు, ఇతరత్రాలు కూడా పెరిగి, జీతభత్యాలు భారీగా పెరగవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Indian Economy: 2025లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 6.6 శాతం
ఇతర వేతన సంఘాల సందర్భంలో.. 7వ వేతన సంఘం 2016లో ఏర్పడిన తరువాత, జీతభత్యాల పెంపు, ఫిట్మెంట్ ను 2.57 రెట్లు పెంచడం వంటి సిఫార్సులతో 1 లక్ష కోట్ల ఆర్థిక భారాన్ని తీసుకువచ్చింది. అయితే, జీతాలు పెరిగిన తరువాత ఆర్థిక వృద్ధి కూడా పుంజుకోవడం, వినియోగం పెరగడం వంటి అంశాలు మరింత ఆర్థిక ప్రోత్సాహకంగా మారాయని వాదనలు ఉన్నాయి.
7వ వేతన సంఘంలో.. కనీస వేతనం రూ.18,000, గరిష్ట వేతనం రూ.2.5 లక్షలతో మూలవేతనంతో పోలిస్తే 2.57 రెట్లు ఎక్కువ జీతం సాధించాలని సిఫార్సు చేశారు. 6వ వేతన సంఘం కూడా 2016లో ఫిట్మెంట్ 1.86 రెట్లు సూచించింది.
అరకోటి మంది ఉద్యోగులకు లబ్ధి
ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుతో అరకోటి మందికి లాభం ఉండటంతో, రక్షణ శాఖ, ఢిల్లీ పరిర్భావములో ఉద్యోగులు కూడా ఈ సిఫార్సుల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5న జరుగబోయే ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రకటన ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి.