Quacquarelli Symonds: నైపుణ్యాల సన్నద్ధతలో భారత్‌కు రెండో ర్యాంకు
Sakshi Education
భారతదేశం కృత్రిమమేధ, డిజిటల్ టెక్నాలజీ, హరిత రంగాల వంటి భవిష్యత్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న నైపుణ్యాల కోసం నిర్వహించే సన్నద్ధతలో రెండో ర్యాంకు సాధించింది.

ఇందులో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. జనవరి 16వ తేదీ క్వాక్వరెల్లి సైమండ్స్ (క్యూఎస్) వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్ 2025 వెల్లడించింది. లండన్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ సంస్థ క్యూఎస్(Quacquarelli Symonds) ఈ సంవత్సరం తన మొదటి ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్‌ను విడుదల చేసింది.
క్యూఎస్ ఇండెక్స్‌లో భారత్‌కు అధిక ప్రాధాన్యం లభించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
Published date : 18 Jan 2025 11:27AM