CWG 2022: అచింత షెయులికి స్వర్ణం
ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో బరిలోకి దిగిన తొలిసారే భారత వెయిట్ లిఫ్టర్ అచింత షెయులి స్వర్ణ పతకంతో మెరిశాడు. ఆగస్టు 1న జరిగిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 73 కేజీల విభాగంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన అచింత భారత్‌కు పసిడి పతకం అందించాడు. 20 ఏళ్ల అచింత (స్నాచ్‌లో 143+క్లీన్ అండ్ జెర్క్‌లో 170) మొత్తం 313 కేజీలు బరువెత్తి విజేతగా నిలిచాడు.
Also read; CWG 2022 : 11 స్వర్ణాల మెక్ కియోన్
భారత జూడో ప్లేయర్ సుశీలా దేవి పసిడి పతకమే లక్ష్యంగా బరిలో దిగి.. రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గాయాలతో బాధపడుతూనే ఫైనల్ బరిలోకి దిగిన సుశీల చివరకు రజతానికే పరిమితమైంది. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సుశీలపై దక్షిణాఫ్రికాకు చెందిన మైకేలా వైట్‌బూ విజయం సాధించింది. గాయం కారణంగా కుడి కాలికి నాలుగు కుట్లతో బరిలోకి దిగిన సుశీల 4.25 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచింది. పురుషుల 60 కేజీల విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. వారణాసికి చెందిన విజయ్ కుమార్ యాదవ్ కాంస్య పతక పోరులో 58 సెకన్లలోనే పెట్రోస్ క్రిస్టోడూలిడ్స్ (సైప్రస్)ను ఓడించాడు. అయితే జూడోలోనే భారత్‌కు రెండు పతకాలు చేజారాయి. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లలో పురుషుల 66 కేజీల విభాగంలో నాథన్ కట్జ్ (ఆస్టేలియా) చేతిలో జస్లీన్ సింగ్ సైనీ... మహిళల 57 కేజీల విభాగంలో క్రిస్టీ లెజెంటిన్ (మారిషస్) చేతిలో సుచిక తరియాల్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలతో ఆరో స్థానంలో ఉంది.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP