Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 2nd కరెంట్ అఫైర్స్
Netanna Bima : ఆగస్టు 7 నుంచి ప్రారంభం
రైతు బీమా తరహాలో 60 ఏళ్లలోపు వయసున్న నేత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో 80 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి కలుగుతుందన్నారు. చేనేత, మరమగ్గాలపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని, లబ్ధిదారులు ఏదైనా కారణంతో మరణిస్తే 10 రోజుల్లో వారి కుటుంబ సభ్యుల ఖాతాలో రూ. 5 లక్షలు జమ చేస్తామన్నారు. చేనేత, జౌళి విభాగంఈ పథకం అమల్లో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, ఈ పథకం అమలు కోసం ఎల్‌ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. బీమా వార్షిక ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని, నేత కార్మికులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం అమలు కోసం సుమారు రూ. 50 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 25 కోట్లు విడుదల చేశామన్నారు. అర్హులైన చేనేత, మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం కలిగేలా ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ చెప్పారు.
also read: Weekly Current Affairs (Sports) Bitbank: భారతదేశ 74వ గ్రాండ్ మాస్టర్ ఎవరు?
AP Highcourt : ఏడుగురు న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం
అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్, బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడుగురి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. వీరిలో అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, బండారు శ్యాం సుందర్, ఊటుకూరు శ్రీనివాస్ న్యాయమూర్తులు కాగా, బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జునరావు, దుప్పల వెంకటరమణలు అదనపు న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 31కి చేరుతుంది.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: ప్రసార భారతి సీఈవోగా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు?
సీజే రమణకు OU Doctorate
ఉస్మానియా యూనివర్సిటీ రెండు దశాబ్దాల తర్వాత గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. ఆగస్టు 5న జరిగే 82వ స్నాతకోత్సవంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ 48వ ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నలుగురు న్యాయమూర్తులు ఓయూ గౌరవ డాక్టరేట్‌ను అందుకోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ డాక్టరేట్‌ను అందుకుంటున్న మొదటి తెలుగు వ్యక్తిగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉస్మానియా చరిత్రలో నిలిచిపోనున్నారు. సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన విశిష్టసేవలను గుర్తించి ప్రతిష్టాత్మక ఓయూ గౌరవ డాక్టరేట్ అందజేస్తోంది.
Also read: Raavi Shastri's centenary: హిందీ, ఇంగ్లిష్ లో రావిశాస్త్రి రచనలు
ఉన్నత విద్యా శిఖరం ఓయూ
ఉన్నత విద్య బోధనకు 1917లో నాటి నిజాం నవాబ్ హైదరాబాద్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. నేటి వరకు ఇక్కడ కోటి మంది విద్యార్థులు విద్యను అభ్యసించారు. 105 ఏళ్ల ఓయూ చరిత్రలో ఇప్పటివరకు 47 మంది మాత్రమే గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 27th కరెంట్ అఫైర్స్
జాతీయ, అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన మహోన్నత వ్యక్తులను గుర్తించి యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లను అందజేస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ స్థాపించిన నాటి నుంచి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేస్తోంది. 1917 నుంచి ఇప్పటి వరకు 47 మంది గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ఏటా విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేసే స్నాతకోత్సవ కార్యక్రమంలో పాలక మండలి ఎంపిక చేసిన వారికి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తారు.
Also read: Free Schemes తీవ్రమైన అంశం : CJ
21 సంవత్సరాల తర్వత
వివిధ కారణాల నేపథ్యంలో గత 21 ఏళ్లుగా గౌరవ డాక్టరేట్లను అందజేయలేదు. ప్రస్తుత వీసీ ప్రొ.రవీందర్ గౌరవ డాక్టరేట్ల పై వచ్చిన కథనాలకు స్పందించి ఈ నెల 5న జరిగే 82వ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్‌ను అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓయూ పాలక మండలి సభ్యుల ఆమోదంతో జస్టిస్ ఎన్వీ రమణను ఎంపిక చేశారు.
Also read: Droupadi Murmu takes oath : ప్రమాణ స్వీకారం చేయించిన CJ
రాష్ట్రం ఏర్పడ్డాక తొలి గౌరవం
తెలంగాణ రాష్ట్రం అవతరించాక ఓయూ తొలిసారి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో విశిష్టసేవలు అందించిన వారిని పరిశీలించి చివరకు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఎంపిక చేశారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఓయూ గౌరవ డాక్టరేట్ అందుకుంటున్న మొదటి వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ చరిత్రలో నిలిచిపోతారు.
Also read: Maharastra Political Crisis: విస్తృత ధర్మాసనం పరిశీలించాల్న సీజే
డాక్టరేట్ అందుకోనున్న 5వ న్యాయమూర్తి
ఓయూ క్యాంపస్ ఠాగూర్ ఆడిటోరియంలో ఆగస్టు 5న రాష్ట్ర గవర్నర్, ఓయూ ఛాన్స్‌లర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ ఆధ్వర్యంలో జరిగే 82వ స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్వీ రమణ 48వ గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్న 5వ న్యాయమూర్తి కావడం విశేషం. కృష్ణా జిల్లా, పొన్నవరం గ్రామానికి చెందిన చెందిన జస్టిస్ ఎనీ్వరమణ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం పూర్తి చేసి న్యాయవాదిగా, న్యాయమూర్తిగా సమాజానికి సేవలందిస్తున్నారు. ఓయూ గౌరవ డాక్టరేట్లను 1917 నుంచి 2001వ సంవత్సరం వరకు 47 మంది అందుకున్నారు. ఓయూలో 1982, 1986 సంవత్సరాల్లో జరిగిన స్నాతకోత్సవాల్లో రికార్డు స్థాయిలో ఒకేసారి ఐదుగురికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు.
Also read: HC Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
గౌరవ డాక్టరేట్ అందుకున్న వారు వీరే
నవాబ్ జమాదుల్ ముల్క్ బహదూర్ (1917), నవాబ్ సర్ అమీన్ జంగ్ బహదూర్(1918), నవాబ్ మసూద్ జంగ్ బహదూర్ (1923), సర్ తేజ్ బహదూర్ సిప్రూ(1938) విశ్వకవి రవింద్రనాథ్ ఠాగూర్ (1938), మహారాజ్ సర్ కిషన్ పరిషద్ బహదూర్ (1938), సర్ మహ్మద్ ఇక్బాల్ (1938), ప్రిన్స్ ఆజం జాహె బహదూర్(1939), మహారాజ్ ఆదిరాజ్ బికనూర్ ప్రభు(1939), ప్రిన్స్ ఆజం జాహె బహదూర్ (1940), నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ (1943), సి.రాజగోపాల చారి (1944), రామస్వామి ముదలియర్ (1945), సర్ జాన్ సర్ గేంట్ (1947), పండిట్ జవహర్‌లాల్ నెహ్రు. (1947), మేజర్ జనరల్ చౌదరి(1949), బాబు రాజేంద్రప్రసాద్ (1951), బింగ్ సిలిన్ (1951), డాక్టర్ సర్వేపల్లి రా«ధాకృష్ణన్ (1953), డాక్టర్ బాబా సాహేబ్ అంబేడ్కర్. (1953), ఎంకే వేల్లోడి(1953), కేఎం మున్షీ (1954), వీకే కృష్ణమీనన్ (1956), బూర్గుల రామకృష్ణారావు (1956), అలియార్ జంగ్ (1956), షేక్ అహ్మద్ యూమని. (1975), డాక్టర్ జార్‌హర్ట్ హెర్డ్ బెర్గ్.(1976), ప్రొఫెసర్ సయ్యద్ సరుల్ హసన్. (1977), కలియంపూడి రాధాకృష్ణ(1977), తాలాహె ఈ దైనీ తరాజీ. (1979), యాసర్ అరాఫత్. (1982), డాక్టర్ వై.నాయుడమ్మ.(1982), ప్రొఫెసర్ రాంజోషి. (1982), జి.పార్థసారధి(1982), డాక్టర్ జహిర్ అహ్మద్ (1982), జస్టిస్ మహ్మద్ (1985), జస్టిస్ నాగేందర్ సింగ్(1986), జస్టిస్ నిఝంగ్యూ (1986), ఆర్.వెంకటరామన్ (1986), ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్ రావు.(1986), జస్టిస్ మన్మోహన్‌రెడ్డి(1986), డాక్టర్ రాజా రామన్న1990), బి.పి.ఆర్ విఠల్ (1993), ప్రొఫెసర్ రామిరెడ్డి (1993), డాక్టర్ ఎం.సింగ్వీ(1994), డాక్టర్ మన్మోహన్‌సింగ్(1996), డాక్టర్ అరుణ్ నేత్రావలి (2001)
CWG 2022 : 11 స్వర్ణాల మెక్ కియోన్
ఆ్రస్టేలియా మహిళా స్విమ్మర్ ఎమ్మా మెక్‌కియోన్ కామన్వెల్త్ గేమ్స్‌లో కొత్త చరిత్ర లిఖించింది. ఈ క్రీడల్లో అత్యధికంగా 11 స్వర్ణ పతకాలు గెలిచిన అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. 28 ఏళ్ల ఈ ‘కంగారూ’ స్విమ్మర్ తాజాగా ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో మూడో స్వర్ణం మహిళల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో గెలిచింది. 2014 గ్లాస్గో గేమ్స్‌లో, 2018 గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో ఎమ్మా నాలుగు స్వర్ణాల చొప్పున నెగ్గింది.
Also read: CWG 2022 : జెరెమీ లాల్‌రినుంగాకి స్వర్ణం
CWG 2022: అచింత షెయులికి స్వర్ణం
ఇంగ్లండ్ లోని బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో బరిలోకి దిగిన తొలిసారే భారత వెయిట్ లిఫ్టర్ అచింత షెయులి స్వర్ణ పతకంతో మెరిశాడు. ఆగస్టు 1న జరిగిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 73 కేజీల విభాగంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన అచింత భారత్‌కు పసిడి పతకం అందించాడు. 20 ఏళ్ల అచింత (స్నాచ్‌లో 143+క్లీన్ అండ్ జెర్క్‌లో 170) మొత్తం 313 కేజీలు బరువెత్తి విజేతగా నిలిచాడు.
Also read; CWG 2022 : 11 స్వర్ణాల మెక్ కియోన్
భారత జూడో ప్లేయర్ సుశీలా దేవి పసిడి పతకమే లక్ష్యంగా బరిలో దిగి.. రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గాయాలతో బాధపడుతూనే ఫైనల్ బరిలోకి దిగిన సుశీల చివరకు రజతానికే పరిమితమైంది. మహిళల 48 కేజీల విభాగం ఫైనల్లో సుశీలపై దక్షిణాఫ్రికాకు చెందిన మైకేలా వైట్‌బూ విజయం సాధించింది. గాయం కారణంగా కుడి కాలికి నాలుగు కుట్లతో బరిలోకి దిగిన సుశీల 4.25 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచింది. పురుషుల 60 కేజీల విభాగంలో భారత్‌కు కాంస్యం లభించింది. వారణాసికి చెందిన విజయ్ కుమార్ యాదవ్ కాంస్య పతక పోరులో 58 సెకన్లలోనే పెట్రోస్ క్రిస్టోడూలిడ్స్ (సైప్రస్)ను ఓడించాడు. అయితే జూడోలోనే భారత్‌కు రెండు పతకాలు చేజారాయి. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లలో పురుషుల 66 కేజీల విభాగంలో నాథన్ కట్జ్ (ఆస్టేలియా) చేతిలో జస్లీన్ సింగ్ సైనీ... మహిళల 57 కేజీల విభాగంలో క్రిస్టీ లెజెంటిన్ (మారిషస్) చేతిలో సుచిక తరియాల్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 3 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి ఎనిమిది పతకాలతో ఆరో స్థానంలో ఉంది.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: భారతదేశ 74వ గ్రాండ్ మాస్టర్ ఎవరు?
GST : 2022 జూలైలో వసూళ్లు రూ.1.49 లక్షల కోట్లు
వివిధ రకాల పరోక్ష పన్నుల స్థానంలో 2017 జూలై నుంచి జీఎస్‌టీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో పన్ను వసూళ్లు జరగడం ఇది రెండవ సారి. 2022 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.68 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి. ఎకానమీ రికవరీ, పన్నుల ఎగవేతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్న ఫలితమే తాజా భారీ పరోక్ష పన్ను వసూళ్లకు కారణమని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి
నెలవారీగా రూ.1.40 లక్షల కోట్ల పైబడి జీఎస్‌టీ వసూళ్లు జరగడం ఈ వ్యవస్థ ప్రారంభం తర్వాత ఇది ఆరవసారి. 2022 మార్చి నుంచి వరుసగా ఐదు నెలలూ ఈ స్థాయిపైనే వసూళ్లు జరిగాయి. ఒక్క ఫిబ్రవరిని మినహాయిస్తే, ఈ ఏడాది ఇప్పటి వరకూ వసూళ్లు ప్రతినెలా రూ.1.40 లక్షల కోట్లపైనే నమోదయ్యాయి. వరుసగా 13 నెలల నుంచి రూ. లక్ష కోట్లపైన వసూళ్లు జరిగాయి.
Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి
మొత్తం రూ.1,48,995 కోట్ల వసూళ్లలో సెంట్రల్ జీఎస్‌టీ రూ.25,751 కోట్లు. స్టేస్ జీఎస్‌టీ రూ.32,807 కోట్లు. ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.79,518 కోట్లు. సెస్ రూ.10,920 కోట్లు.
Also read: GST: ఐదేళ్లుగా దేశమంతా ఒకే మార్కెట్
5G Spectrum : రూ. 1.5 లక్షల కోట్ల బిడ్లు
అమ్ముడైన స్పెక్ట్రంలో దాదాపు సగ భాగాన్ని (24,740 మెగాహెట్జ్) దక్కించుకుని టెలికం దిగ్గజం రిలయన్స్ జియో అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా రూ. 88,078 కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలు చేసింది. భారతి ఎయిర్‌టెల్ రూ. 43,084 కోట్లు (19,867.8 మెగాహెట్జ్), వొడాఫోన్ ఐడియా రూ. 18,799 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను (6,228 మెగాహెట్జ్) కొనుగోలు చేశాయి. ప్రైవేట్ సర్వీసుల కోసం అదానీ ఎంటర్‌ప్రైజెస్ సుమారు రూ. 212 కోట్లతో 400 మెగాహెట్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. మొత్తం 10 బ్యాండ్లలో 72,098 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలం వేయగా 51,236 మెగాహెట్జ్ (71 శాతం) అమ్ముడైనట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం మీద రూ. 1,50,173 కోట్ల బిడ్లు వచ్చాయని, తొలి ఏడాది ప్రభుత్వ ఖజానాకు రూ. 13,365 కోట్లు రాగలవని ఆయన పేర్కొన్నారు. ‘దేశంలో దాదాపు అన్ని సర్కిళ్లకు సరిపడేంతగా టెల్కోలు స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. దీంతో రాబోయే 2–3 ఏళ్లలో మెరుగైన 5జీ కవరేజీ లభించగలదు‘ అని ఆయన చెప్పారు. ఆగస్టు 10 నాటికి స్పెక్ట్రం కేటాయించవచ్చని, అక్టోబర్ కల్లా సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంస్కరణలతో అనిశ్చితి, రిస్కులు తొలగిపోవడంతో రాబోయే రెండేళ్లలో టెలికం రంగంలో రూ. 2–3 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని అంచనా వేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇకపైనా సర్వీసులను చౌకగానే అందించే ధోరణే కొనసాగవచ్చని విశ్వసిస్తున్నట్లు వివరించారు. జులై 26న ప్రారంభమైన వేలంలో రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను విక్రయానికి ఉంచారు. తొలి రోజునే ఏకంగా రూ. 1.45 లక్షల కోట్ల బిడ్లు రాగా.. ఆ తర్వాత మిగతా రోజుల్లో మాత్రం బిడ్డింగ్ నామమాత్రంగా పెరుగుతూ వచ్చింది.
Also read: GSTకి ఐదేళ్లు పూర్తి
IT Returns : 5.83 కోట్ల రిటర్నులు
జూలై 22 వరకు, గతేడాది ఇదే సమయానికి పోల్చి చూస్తే 40 శాతం రిటర్నులు (2.48 కోట్లు) దాఖలు కాగా.. చివరి 10 రోజుల్లో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ముందుకు వచ్చి రిటర్నులు వేశారు. గడువు పొడిగించే అవకాశం లేదని ఆదాయపన్ను శాఖ తేల్చి చెప్పడంతో పన్ను చెల్లింపుదారులు చివరి రోజుల్లో త్వరపడ్డారు. ముఖ్యంగా ఆఖరి రోజైన జూలై 31న 72.42 లక్షల రిటర్నులు వచ్చాయి. 2020–21 ఆర్థిక సంవత్సరానికి దాఖలైన పన్ను రిటర్నులు 5.87 కోట్లతో పోలిస్తే 4 లక్షల మేర తగ్గినట్టు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ 31 వరకు గడువు ఇవ్వడం అనుకూలించింది. అంతకుముందు 2020లోనూ డిసెంబర్ 31 వరకు గడువు పొడిగింపు లభించింది.
Also read: Survey 2022 జీఎస్టీకి 5 ఏళ్లు - డెలాయిట్ జీఎస్టీ @ సర్వే 2022
చివరి రోజున ఒక దశలో సెకనుకు 570 చొప్పున, నిమిషానికి 9,573, గంటకు 5,17,030 చొప్పున రిటర్నులు ఫైల్ అయినట్టు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. మొత్తం 5.83 కోట్ల రిటర్నుల్లో
50 శాతం ఐటీఆర్–1 కాగా,
11.5 శాతం ఐటీఆర్–2,
10.9 శాతం ఐటీఆర్–3,
26 శాతం ఐటీఆర్–4 ఉన్నాయి.
Also read: 5G Spectrum : రూ. 1.5 లక్షల కోట్ల బిడ్లు