Skip to main content

Free Schemes తీవ్రమైన అంశం : CJ

CJI Ramana about Free Schemes
CJI Ramana about Free Schemes

ఎన్నికల సమయంలో రాజకీయ పారీ్టలు ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలపై హామీలు ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. ఈ అంశంపై ఒక దృఢ వైఖరిని అవలంబించడానికి కేంద్ర ప్రభుత్వం  ఎందుకు సంకోచిస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. హేతుబద్ధత లేని ఉచితాలను కఠినంగా నియంత్రించాలని కోరుతూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం  జూలై 27న విచారణ చేపట్టింది. పార్టీలు ప్రకటించే ఉచితాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఆ తర్వాత ఇలాంటి వాటిని కొనసాగించాలో లేదో తాము నిర్ణయిస్తామని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. ఉచిత పథకాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేశారు. ఉచితాలను రాష్ట్రాల స్థాయిలోనే నియంత్రించాలని సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. ఉచిత పథకాల అమలు వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయని పిటిషనర్‌ అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.70 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. ఉచితాలను ప్రకటించే పార్టీల ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని, పార్టీల రిజిస్ట్రేషన్ ను సైతం క్యాన్సల్‌ చేయాలని కోరారు.   

Also read: Droupadi Murmu takes oath : ప్రమాణ స్వీకారం చేయించిన CJ  

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 27 Jul 2022 04:58PM

Photo Stories