Droupadi Murmu takes oath : ప్రమాణ స్వీకారం చేయించిన CJ
దేశ 15వ రాష్ట్రపతిగా ‘ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను కాపాడుతాను’ అంటూ భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జూలై 25న ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతులు రామ్‌నాథ్ కోవింద్, ప్రతిభా పాటిల్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, త్రివిధ దళాల అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఆహూతుల హర్షధ్వానాల మధ్య రిజిస్టర్‌లో ముర్ము సంతకం చేశారు. తర్వాత సైనికులు ఆమెకు 21 గన్ సెల్యూట్ సమర్పించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ త్రివిధ దళాల జవాన్లు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: RBI ప్రకారం భారతీయులు ఎక్కువగా ఇష్టపడే బ్యాంక్ నోట్ ఏది?
‘12 జన్‌పథ్’కు రామ్‌నాథ్
మాజీ రాష్ట్రపతి కోవింద్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూలై 25న కొత్త ఇంటికి మారారు. ఢిల్లీలోని జన్‌పథ్ రోడ్డులో (12 జన్‌పథ్) ప్రభుత్వం ఆయనకు నివాసాన్ని కేటాయించింది. ఇదే ఇంట్లో దివంగత కేంద్ర మంత్రి పాశ్వాన్ 3 దశాబ్దాలపాటు నివసించారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ చాలాకాలం ఉన్నారు. అధికారుల నోటీసులతో ఏప్రిల్‌లో ఖాళీ చేశారు. కోవింద్ రాష్ట్రపతి భవన్ నుంచి కొత్త ఇంటికి చేరుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ సందర్భంగా వెంట రాష్ట్రపతి ముర్ము కూడా ఉన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ వద్ద కోవింద్‌కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి భవన్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
Also read: Driverless Robo Taxi ఆవిష్కరించిన చైనా