Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జులై 27th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu July 27th 2022 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu July 27th 2022
Current Affairs in Telugu July 27th 2022

ISS : సొంతంగా నిర్మించుకుంటామన్న రష్యా 

అమెరికా, యూరప్, జపాన్, కెనడా, రష్యా సంయుక్తంగా నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) నుంచి రష్యా వైదొలగనుంది. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పశ్చిమ దేశాలతో సఖ్యత పాడవడంతో రష్యా తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 2024 ఏడాది తర్వాత ఐఎస్‌ఎస్‌లో రష్యా భాగస్వామిగా ఉండబోదని రష్యా దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ(రోస్‌ కాస్మోస్‌) చీఫ్‌ యూరీ బొరిసోవ్‌ జూలై 26న చెప్పారు. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటామని స్పష్టంచేశారు.  

also read: Weekly Current Affairs (International) Bitbank: అధికారికంగా పేరు మార్చుకున్న దేశం ఏది?

ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లో ముఖ్యమైన రెండు భాగాలున్నాయి. ఒకటి రష్యా ఆధ్వర్యంలో పనిచేస్తుండగా మరోటి అమెరికా, ఇతర దేశాల భాగస్వామ్యంలో నడుస్తోంది. రష్యా నిష్క్రమించాక మొదటి భాగం బాధ్యతలు, నిర్వహణ ఖర్చులు ఎలా విభజిస్తారనే దానిపై స్పష్టత రాలేదు. భూమికి దాదాపు 250 మైళ్ల ఎత్తులో భూమి చుట్టూ పరిభ్రమించే ఐఎస్‌ఎస్‌లో దాదాపు ఏడుగురు వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనలు చేస్తుంటారు. భారరహిత స్థితిలో నెలల తరబడి అక్కడే ఉంటూ అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన నూతన పరికరాలనూ పరీక్షిస్తుంటారు. ఇటీవల నాసాతో రష్యాకు సంబంధాలు చెడిపోయాయి. ఇంతకాలం రష్యా రాకెట్లలో వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌కు తీసుకెళ్లినందుకు నాసా ఆ దేశానికి భారీ చెల్లింపులు జరిపేది. కొత్తగా ఎలాన్‌ మస్క్ కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ ఈ బాధ్యతలు తీసుకుని రష్యాను ఆర్థికంగా దెబ్బతీసింది.  

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2022 గెలుచుకున్న మొదటి హిందీ నవల ఏది?

Free Schemes తీవ్రమైన అంశం : CJ 


ఎన్నికల సమయంలో రాజకీయ పారీ్టలు ఓటర్లను మభ్యపెట్టేలా ఉచిత పథకాలపై హామీలు ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. ఈ అంశంపై ఒక దృఢ వైఖరిని అవలంబించడానికి కేంద్ర ప్రభుత్వం  ఎందుకు సంకోచిస్తోందో చెప్పాలని ప్రశ్నించారు. హేతుబద్ధత లేని ఉచితాలను కఠినంగా నియంత్రించాలని కోరుతూ బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం  జూలై 27న విచారణ చేపట్టింది. పార్టీలు ప్రకటించే ఉచితాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. ఆ తర్వాత ఇలాంటి వాటిని కొనసాగించాలో లేదో తాము నిర్ణయిస్తామని జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. ఉచిత పథకాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేశారు. ఉచితాలను రాష్ట్రాల స్థాయిలోనే నియంత్రించాలని సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. ఉచిత పథకాల అమలు వల్ల రాష్ట్రాలు దివాలా తీస్తున్నాయని పిటిషనర్‌ అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.70 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. ఉచితాలను ప్రకటించే పార్టీల ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని, పార్టీల రిజిస్ట్రేషన్ ను సైతం క్యాన్సల్‌ చేయాలని కోరారు.   

Also read: Droupadi Murmu takes oath : ప్రమాణ స్వీకారం చేయించిన CJ
 

Hospitals: అపోలో, బసవతారకం సేవలపై ప్రభుత్వ GO

హైదరాబాద్‌లోని అపోలో, బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రులు.. ఉచిత ఇన్‌ పేషంట్, ఔట్‌ పేషంట్‌ సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది. దీనిపై డీఎంహెచ్‌ఓ పర్యవేక్షణ ఉంటుందని వివరించింది. ఈ మేరకు తాజా జీవో ప్రతిని హైకోర్టుకు సమర్పించింది. రాష్ట్ర సర్కార్‌ నుంచి తక్కువ ధరలకు భూమి తీసుకున్నప్పుడు జరిగిన ఎంవోయూల మేరకు ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందజేయాలని, కనీసం కరోనా కష్టకాలంలోనైనా దీన్ని అమలు చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఓమిమ్‌ మానెక్షా డెబారా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం జూలై 27న విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. ‘ఎంఓయూల ప్రకారం రెండు ఆస్పత్రులు పేదలకు ఉచితంగా పడకలను కేటాయించి వైద్యం చేయకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్‌ కింద జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకుంటారు. జరిమానా విధింపు అవకాశం కూడా ఉంది. అపోలోకు భూమి ఇచ్చినప్పుడు 15% బెడ్స్‌ పేదలకు ఉచిత కేటాయించేలా ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు 1981లో జీవో 517 జారీ అయ్యింది. బసవతారకం ఆస్పత్రికి 7.35 ఎకరాలను 1989లో ప్రభుత్వం ఏడాదికి రూ.50 వేలకు లీజుకు ఇచ్చినందుకు గాను 25% పడకలు, రోజూ 40% ఔట్‌పేషంట్లకు ఉచిత వైద్యం చేసేలా 1989లో జీవో 437 జారీ అయ్యింది. ఇవి అమలు చేసే విధానాన్ని వివరిస్తూ ఈ నెల 16న రాష్ట్ర సర్కార్‌ మరో జీవో 80 జారీ చేసింది’అని ఏజీ వివరించారు. అనంతరం విచారణను ఆగస్టు 8న వాయిదా వేసింది. 

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: RBI ప్రకారం భారతీయులు ఎక్కువగా ఇష్టపడే బ్యాంక్ నోట్ ఏది?

Unclaimed deposits: క్లెయిమ్‌ చేయని నిధులు రూ.48,262 కోట్లు

బ్యాంకింగ్‌లో క్లెయిమ్‌ చేయని నిధుల మొత్తం భారీగా పెరిగినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వార్షిక నివేదిక పేర్కొంది. దీని ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.39,264 కోట్లుగా ఉన్న ఈ నిధులు ఈ ఏడాది మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.48,262 కోట్లకు ఎగశాయి. ఈ నిధుల్లో అధిక మొత్తం తెలుగురాష్ట్రాలుసహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి. తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక, బిహార్‌లు జాబితాలో ఉన్న మిగిలిన ప్రధాన రాష్ట్రాలు. దీనితో ఈ అంశంపై ఆయా రాష్ట్రాల్లో విస్తృత ప్రాతిపదికన ప్రచారం నిర్వహించి, క్లెయిమ్‌ చేయని వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు బ్యాంకింగ్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

Also read: State Finances : 2021 -22 Budget Analysis : అప్పుల్లో తమిళనాడు టాప్

క్లెయిమ్‌ చేయని నిధులు అంటే.. 
సెంట్రల్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం,  10 సంవత్సరాల పాటు ఎవ్వరూ నిర్వహించని సేవింగ్స్‌ లేదా కరెంట్‌ ఖాతాలలోని నిల్వలు లేదా మెచ్యూరిటీ తేదీ నుండి 10 సంవత్సరాలలోపు క్లెయిమ్‌ చేయని టర్మ్‌ డిపాజిట్లను ‘క్లెయిమ్‌ చేయని డిపాజిట్లు‘గా వర్గీకరిస్తారు. ఈ తరహా డబ్బును బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే ‘డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌ నెస్‌ ఫండ్‌’కి బదిలీ చేస్తాయి. అయితే, డిపాజిటర్లు తమ డబ్బు ను వడ్డీతో పాటు బ్యాంక్‌ వద్ద ఎప్పటికైనా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. బ్యాంకులు, అలాగే ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలు చేపట్టినప్పటికీ, క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల మొత్తం పెరుగుతున్న ధోరణి కనబడ్డం గమనించాల్సిన అంశమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 

Also read: RBI on Rupee : రూపాయే బలంగా నిలబడిందన్న శక్తికాంతదాస్

కారణాలు ఏమిటి? 
క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల పరిమాణం ప్రధానంగా సేవింగ్స్, కరెంట్‌ ఖాతాలను మూసివేయకపోవడం వల్ల పెరుగుతోంది. డిపాజిటర్లు కొద్దో గొప్పో బ్యాంక్‌ ఖాతాల్లో వదిలివేసి ఆపరేట్‌ చేయకూడదనుకోవడం లేదా మెచ్యూర్డ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కోసం బ్యాంకులకు రిడెంప్షన్‌ క్లెయిమ్‌లను సమర్పించకపోవడం వంటి అంశాలు ప్రధానంగా తమ దృష్టికి వస్తున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు వెల్లడించాయి. ఇక కొన్ని సందర్భాల్లో మరణించిన డిపాజిటర్లకు సంబంధించిన ఖాతాల విషయంలో నామినీలు లేదా చట్టబద్ధమైన వారసులు  డబ్బును వెనక్కి తీసుకోవడానికి ముందుకు రాని కేసులు కూడా ఉన్నట్లు సమాచారం. క్లెయిమ్‌ చేయడంలో సహాయపడటం తమ ప్రచార కార్యక్రమం లక్ష్యంగా ఉంటుందని  సెంట్రల్‌ బ్యాంక్‌ తెలిపింది.

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 26th కరెంట్‌ అఫైర్స్‌

World Wrestling : అండర్ - 17లో భారత్ కు స్వర్ణం 


ప్రపంచ రెజ్లింగ్‌ అండర్‌–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్‌ విభాగంలో భారత్‌కు 32 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం లభించింది. జూలై 26న జరిగిన 55 కేజీల గ్రీకో రోమన్‌ విభాగంలో భారత యువ రెజ్లర్‌ సూరజ్‌ విజేతగా అవతరించాడు. ఫైనల్లో సూరజ్‌ 11–0తో ఫరైమ్‌ ముస్తఫయెవ్‌ (అజర్‌బైజాన్‌)పై విజయం సాధించాడు. తద్వారా 1990లో పప్పూ యాదవ్‌ తర్వాత ప్రపంచ అండర్‌–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్‌ విభాగంలో పసిడి పతకం నెగ్గిన భారత రెజ్లర్‌గా సూరజ్‌ గుర్తింపు పొందాడు.

Also read: World Shooting : అగ్రస్థానంలో భారత్ 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 27 Jul 2022 05:05PM

Photo Stories