Daily Current Affairs in Telugu: 2022, జులై 26th కరెంట్ అఫైర్స్
Droupadi Murmu takes oath : ప్రమాణ స్వీకారం చేయించిన CJ
గిరి పుత్రిక ద్రౌపదీ ముర్ము (64) రాష్ట్రపతి భవన్‌లోకి సగర్వంగా అడుగుపెట్టారు. దేశ 15వ రాష్ట్రపతిగా ‘ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను కాపాడుతాను’ అంటూ భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జూలై 25న ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతులు రామ్‌నాథ్ కోవింద్, ప్రతిభా పాటిల్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు, త్రివిధ దళాల అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఆహూతుల హర్షధ్వానాల మధ్య రిజిస్టర్‌లో ముర్ము సంతకం చేశారు. తర్వాత సైనికులు ఆమెకు 21 గన్ సెల్యూట్ సమర్పించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అక్కడ త్రివిధ దళాల జవాన్లు ఆమెకు గౌరవ వందనం సమర్పించారు.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: RBI ప్రకారం భారతీయులు ఎక్కువగా ఇష్టపడే బ్యాంక్ నోట్ ఏది?
‘12 జన్‌పథ్’కు రామ్‌నాథ్
మాజీ రాష్ట్రపతి కోవింద్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూలై 25న కొత్త ఇంటికి మారారు. ఢిల్లీలోని జన్‌పథ్ రోడ్డులో (12 జన్‌పథ్) ప్రభుత్వం ఆయనకు నివాసాన్ని కేటాయించింది. ఇదే ఇంట్లో దివంగత కేంద్ర మంత్రి పాశ్వాన్ 3 దశాబ్దాలపాటు నివసించారు. ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ చాలాకాలం ఉన్నారు. అధికారుల నోటీసులతో ఏప్రిల్‌లో ఖాళీ చేశారు. కోవింద్ రాష్ట్రపతి భవన్ నుంచి కొత్త ఇంటికి చేరుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ సందర్భంగా వెంట రాష్ట్రపతి ముర్ము కూడా ఉన్నారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ వద్ద కోవింద్‌కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రపతి భవన్ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
Also read: Driverless Robo Taxi ఆవిష్కరించిన చైనా
TS Highcourt : ఆరుగురు కొత్త జడ్జీలు
తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులను నియమించాలంటూ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం జూలై 25న కేంద్రానికి సిఫార్సు చేసింది. న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేష్ భీమపాక, పుల్లా కార్తీక్ అలియాస్ పి.ఎలమందర్, కాజా శరత్, జగన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం సిఫార్సుల్లో పేర్కొంది. ఈ సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కాగా, సీజేఐగా ఎన్‌వీ రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచారు. ఏడాది కాలంలో 17 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో 27 మంది జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆరుగురికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే జడ్జీల సంఖ్య 33కు పెరగనుంది.
Also read: AP హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు
State Finances : 2021 -22 Budget Analysis : అప్పుల్లో తమిళనాడు టాప్
ఈ మేరకు జూలై 25న లోక్‌సభలో బీజేపీ ఎంపీ కిషన్‌కపూర్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు తమిళనాడు రూ.6,59,868 కోట్ల అప్పుతో మొదటిస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు కాగా, ఏపీ అప్పు రూ.3,98,903 కోట్లుగా ఉందని తెలిపారు. అయితే రాష్ట్రాల రుణాలను ఆమోదించేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ద్వారా నిర్దేశించిన ఆర్థిక పరిమితులను అనుసరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సాధారణ నికర రుణ సీలింగ్(ఎన్బీసీ)ను కేంద్రం నిర్ణయిస్తుందని, క్రితం సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలను తదుపరి సంవత్సరంలోని రుణ పరిమితులలో సర్దుబాటు చేస్తారని పేర్కొన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీ) ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్‌ల నుంచి అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ దృష్టికి వచి్చందన్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ రకమైన రుణాల ద్వారా రాష్ట్రాల ఎన్బీసీని దాటడం వల్ల కలిగే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని రుణాల లెక్కలను నిర్ణయించి రాష్ట్రాలకు తెలియచేశామన్నారు.
also read: Cryptos: క్రిప్టోలను నిషేధించే యోచనలో రిజర్వ్ బ్యాంక్
టాప్–15 రాష్ట్రాల అప్పులు
తమిళనాడు 6,59,868 కోట్లు
ఉత్తరప్రదేశ్ 6,53,307 కోట్లు
మహారాష్ట్ర 6,08,999 కోట్లు
పశ్చిమ బెంగాల్ 5,62,697 కోట్లు
రాజస్తాన్ 4,77,177 కోట్లు
కర్ణాటక 4,62,832 కోట్లు
గుజరాత్ 4,02,785 కోట్లు
ఆంధ్రప్రదేశ్ 3,98,903 కోట్లు
కేరళ 3,35,989 కోట్లు
మధ్యప్రదేశ్ 3,17,736 కోట్లు
తెలంగాణ 3,12,191 కోట్లు
పంజాబ్ 2,82,864 కోట్లు
హరియాణా 2,79,022 కోట్లు
బిహార్ 2,46,413 కోట్లు
ఒడిశా 1,67,205 కోట్లు
Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి
AP Call ACB : అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీ నంబర్ 14400
ప్రభుత్వ సేవల్లో అవినీతికి ఏమాత్రం తావు లేకుండా కఠిన చర్యలు చేపట్టి పారదర్శకంగా వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్, ఎమ్మార్వో, ఎండీవో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అవినీతిపై ఫిర్యాదులకు సంబంధించి ఏసీబీ నంబర్ 14400తో పోస్టర్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ స్పష్టంగా కనిపించేలా ఈ పోస్టర్‌ను ప్రదర్శించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నంబర్ అందరికీ తెలిసేలా ప్రదర్శించాలని సూచించారు.
Also read: AP School Education : ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన - ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
World Athletics Championships 2022: 33 పతకాలతో అగ్రస్థానంలో అమెరికా
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు తొలిసారి ఆతిథ్యమిచ్చిన అమెరికా చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టింది. జూలై 25న ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి మొత్తం 33 పతకాలతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. ఒకే చాంపియన్‌షిప్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన జట్టుగా అమెరికా రికార్డు నెలకొల్పింది. 1987లో తూర్పు జర్మనీ అత్యధికంగా 31 పతకాలు సాధించింది. పోటీల చివరిరోజు రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. పురుషుల పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో అర్మాండ్ డుప్లాంటిస్ (స్వీడన్)... మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో టోబీ అముసాన్ (నైజీరియా) కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. ప్రపంచ రికార్డులు సృష్టించినందుకు డుప్లాంటిస్, టోబీ అముసాన్‌లకు లక్ష డాలర్ల చొప్పున (రూ. 79 లక్షల 80 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
Also read: World Athletics Championships: నోరా జెరుటోకు స్వర్ణం
ఆఖరి రోజు ఎనిమిది విభాగాల్లో ఫైనల్స్ జరిగాయి. మహిళల 4X400 మీటర్ల రిలేలో తలీతా డిగ్స్, అబీ స్టెనర్, బ్రిటన్ విల్సన్, సిడ్నీ మెక్‌లాఫ్లిన్‌లతో కూడిన అమెరికా జట్టు 3ని:17.79 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించింది. పురుషుల 4X400 మీటర్ల రిలేలోనూ అమెరికాకే స్వర్ణం లభించింది. పురుషుల పోల్‌వాల్ట్ ఫైనల్లో డుప్లాంటిస్ 6.21 మీటర్ల ఎత్తుకు ఎగిరి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
Also read: Athlete Allyson Felix's: అమెరికన్ అథ్లెటిక్ ఫెలిక్స్ @ 30 పతకాలు
6.20 మీటర్లతో తన పేరిటే ఉన్న రికార్డును డుప్లాంటిస్ సవరించాడు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్ సెమీఫైనల్లో టోబీ అముసాన్ 12.12 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు లిఖించింది. ఫైనల్ రేసును టోబీ 12.06 సెకన్లలోనే ముగించి మరోసారి ప్రపంచ రికార్డు సాధించి, బంగారు పతకం గెలిచినా... రేసు జరిగిన సమయంలో గాలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆమె రికార్డును గుర్తించలేదు.
Also read: 2022 World Athletics Championships: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో షెల్లీకి 5వ స్వర్ణం
స్వర్ణంతో ఫెలిక్స్ రిటైర్...
అమెరికా మహిళా దిగ్గజ అథ్లెట్ అలీసన్ ఫెలిక్స్ తన కెరీర్‌ను స్వర్ణ పతకంతో ముగించింది. 36 ఏళ్ల అలీసన్ ఫెలిక్స్ 4X400 మీటర్ల ఫైనల్లో స్వర్ణం నెగ్గిన అమెరికా రిలే జట్టులో పోటీపడలేదు. అయితే ఆమె హీట్స్‌లో బరిలోకి దిగడంతో ఫెలిక్స్‌కు కూడా పసిడి పతకాన్ని ఇచ్చారు. అంతకుముందు ఆమె 4X400 మిక్స్‌డ్ రిలేలో కాంస్య పతకం సాధించింది. ఓవరాల్‌గా పది ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న ఫెలిక్స్ మొత్తం 20 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు) సాధించింది.
Also read: World Shooting : అగ్రస్థానంలో భారత్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP