AP హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులకు ఏడుగురు న్యాయాధికారుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, జడ్జిలు జస్టిస్ ఉమేశ్ ఉదయ్ లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్ నేతృత్వంలోని కొలీజియం జూలై 20న సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది. ఏడుగురు న్యాయాధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. కేంద్రం ఆమోదముద్ర వేసిన తరువాత ఆ పేర్లు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళతాయి. రాష్ట్రపతి ఆమోదం తరువాత వారు న్యాయమూర్తులుగా ప్రమాణం చేస్తారు.
Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 20th కరెంట్ అఫైర్స్
కొలీజి యం సిఫారసు చేసిన వారిలో ఎ. వెంకటరవీంద్రబాబు, వి.రాధాకృష్ణ కృపాసాగర్, బి.వరాహలక్ష్మీ నర్సింహచక్ర వర్తి, బి. శ్యాంసుందర్, యూ.శ్రీనివాస్, టి. మల్లికార్జునరావు, డి.వెంకటరమణ ఉన్నారు. వీరిలో రవీంద్రబాబు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా, రాధాకృష్ణ కృపాసాగర్ కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా, శ్యాంసుందర్ 3 విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, శ్రీనివాస్ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జిగా, చక్రవర్తి హైకోర్టు రిజిస్ట్రార్ (ఐటీ)గా, మల్లికార్జునరావు నూజివీడు 15వ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా, వెంకటరమణ హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన)గా బాధ్యతలు నిర్వర్తిస్తు న్నారు. ఈ ఏడుగురి తోపాటు ఇప్పటికే కేంద్రానికి చేరిన న్యాయవాది ఎస్.ఎం.సుభాని పేరుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరుతుంది.
Also read: Quiz of The Day (July 20, 2022): భారత లోక్‌సభకు ఎన్నికైన తొలి సినీ నటుడు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP