Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జులై 20th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu July 20th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Current Affairs in Telugu July 20th 2022
Current Affairs in Telugu July 20th 2022

Telangana రైతులకి డ్రోన్లు 

వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు ఈ ఏడాది సబ్సిడీపై డ్రోన్లు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రైతులను పూర్తిగా ఆధునిక సాగు పద్ధతుల వైపు మళ్లించాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే ట్రాక్టర్లు, దుక్కు దున్నే యంత్రాలు, వరికోత యంత్రాలు, రొటవేటర్లు, పవర్‌ టిల్లర్లు తదితరాలు సబ్సిడీపై అందజేస్తోంది. దీంతో ఇప్పటికే ట్రాక్టర్ల వినియోగం పెరిగిపోయింది. రైతులు పురాతన, సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి ఆయా యంత్రాలను, పరికరాలను ఉపయోగిస్తున్నారు. దీనికి మరింత ఊతం ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో రైతులకు డ్రోన్లు అందజేసే దిశగా వ్యవసాయ శాఖ అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?

పిచికారీ కష్టాలకు చెక్‌ 
ప్రస్తుతం డ్రోన్లను ఫొటోలు తీయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే వ్యవసాయానికి వాడే డ్రోన్లు రైతుకు అనేక రకాలుగా ఉపయోగపడేలా చూస్తారు. ప్రధానంగా పురుగు మందులను పిచికారీ (స్ప్రే) చేయడానికి ఉపయోగిస్తారు. డ్రోన్‌ ఆధారిత స్ప్రే పద్ధతుల వల్ల నీరు, పురుగుమందులు తక్కువ మొత్తంలో అవసరమవుతాయి. పురుగు మందుల్ని రైతులే స్వయంగా పిచికారీ చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలకు గురి అవుతున్నారు. దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. డ్రోన్‌ పిచికారీ వీటన్నిటి నుంచి రైతుల్ని కాపాడుతుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది.  
కొన్ని పంటలకు మొక్కల పైన స్ప్రే చేస్తే సరిపోతుంది. కొన్నింటికి కాండం మొదల్లో చల్లాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పంటకు ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు డ్రోన్లకు అదనపు పరికరాలు సమకూరుస్తారు. ఒక్కో డ్రోన్‌ ధర రూ.10 లక్షలు అవుతుందని అంచనా వేశారు. వాటిని రైతులకు సబ్సిడీపై ఇస్తారు. అయితే చాలావరకు ఒక్కో రైతుకు ఒక్కో డ్రోన్‌ అవసరం ఉండదు. పైగా ధర ఎక్కువ. ఈ నేపథ్యంలో కొంతమంది రైతుల బృందానికి ఒక  డ్రోన్‌ ఇవ్వాలని భావిస్తున్నారు.  

Also read: Daily Current Affairs in Telugu: 2022, జులై 16th కరెంట్‌ అఫైర్స్‌

UK Prime Minister Race: బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషీ హవా      


బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌ (42) హవా కొనసాగుతోంది. కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుని ఎన్నిక ప్రక్రియలో జూలై 19న జరిగిన నాలుగో రౌండ్‌ ఓటింగ్‌ తర్వాత కూడా రిషియే అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు మద్దతిస్తున్న ఎంపీల సంఖ్య 118కి పెరిగింది. కన్జర్వేటివ్‌ ఎంపీల్లో మూడో వంతు మంది మద్దతు, అంటే 120 ఓట్లు సాధించేవారు తుది ఇద్దరు అభ్యర్థుల జాబితాలో నిలుస్తారు. దాంతో రిషి తుది పోటీలో నిలవడం దాదాపుగా ఖాయమైంది. ఆయనతో పాటు తుది పోరులో నిలిచేందుకు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ మధ్య హోరాహోరీ సాగుతోంది. రిషికి గట్టి పోటీదారుగా భావిస్తున్న మోర్డాంట్‌ 92 ఓట్లతో రెండో స్థానంలో, ట్రస్‌ 86 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. నాలుగో అభ్యర్థి కేమీ బదొనెక్‌ 59 ఓట్లతో రేసు నుంచి వైదొలిగారు. దీంతో రిషి, మోర్డంట్, ట్రస్‌ ముగ్గురే పోటీలో మిగిలారు. జూలై 20న ఐదో రౌండ్‌ తర్వాత తుది పోరులో నిలిచే ఇద్దరు ఎవరో తేలుతుంది. జూలై 21 నుంచి వారి మధ్య ముఖాముఖి పోరు సాగుతుంది. వారిలో కన్జర్వేటివ్‌ పారీ్టకి చెందిన 1.6 లక్షల పై చిలుకు సభ్యుల్లో అత్యధికుల మద్దతు కూడగట్టుకునేవారు పార్టీ నేత పదవిని, తద్వారా ప్రధాని పీఠాన్ని దక్కించుకుంటారు. కన్జర్వేటివ్‌ సభ్యుల ఓట్ల లెక్కింపు ఆగస్టు చివరికల్లా పూర్తవుతుంది. విజేతను సెప్టెంబర్ 5న ప్రకటిస్తారు. 

Also read; UBS CEOగా భారత–అమెరికన్‌ నౌరీన్‌(Naureen Hassan)

Yulimar Rojasకి ట్రిపుల్‌ జంప్‌లో 3వ స్వర్ణం 


వెనిజులా స్టార్‌ అథ్లెట్, ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత యులిమర్‌ రోజస్‌ మరోసారి అద్భుత ప్రదర్శనతో ట్రిపుల్‌ జంప్‌లో సత్తా చాటింది. వరుసగా మూడో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ రోజస్‌ స్వర్ణంతో మెరిసింది. అమెరికాలోని యుజీన్‌ లో జరుగుతున్న ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో  ఫైనల్లో రోజస్‌ 15.47 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో షనీకా రికెట్స్‌ (అమెరికా – 14.89 మీ.) రజతం సాధించగా, టోరీ ఫ్రాంక్లిన్‌ (అమెరికా – 14.72 మీ.) కాంస్యం గెలుచుకుంది. అథ్లెటిక్స్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు ఇది హ్యాట్రిక్‌ స్వర్ణం కావడం విశేషం. 2017 (లండన్‌), 2019 (దోహా)లలో కూడా ఆమె పసిడి పతకాన్ని అందుకుంది. ట్రిపుల్‌ జంప్‌లో ప్రస్తుత ప్రపంచ రికార్డు (15.74 మీటర్లు) రోజస్‌ పేరిటే ఉంది. తన రెండో ప్రయత్నంలోనే 15.47 మీటర్లు నమోదు చేసిన రోజస్‌ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో కూడా దానిని దాటలేకపోయింది. దాంతో పోలిస్తే చాలా తక్కువ దూరం ఆమె దూకగలిగినా...ఈ మెగా ఈవెంట్‌లో బంగారం గెలుచుకునేందుకు అది సరిపోయింది. 

Also read: Weekly Current Affairs (Sports) Bitbank: రెడ్ బుల్‌లో స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్‌ను ఎవరు గెలుచుకున్నారు?

World Shooting : భారత్ కు 14వ పతకం 

దక్షిణ కొరియాలోని చాంగ్వాన్‌ లో జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్‌  సీజన్‌లోని మూడో ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. జూలై 19న భారత్‌ ఖాతాలో 14వ పతకం చేరింది. 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ విభాగంలో అనీశ్‌ భన్వాలా–రిథమ్‌ సాంగ్వాన్‌ ద్వయం భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. కాంస్య పతక పోరులో అనీశ్‌–రిథమ్‌ జోడీ 16–12 పాయింట్లతో అనా దెడోవా–మార్టిన్‌ పొదరాస్కీ (చెక్‌ రిపబ్లిక్‌) జంటపై విజయం సాధించింది. ఆరు జోడీలు పాల్గొన్న క్వాలిఫికేషన్‌ స్టేజ్‌–2లో అనీశ్‌–రిథమ్‌ 380 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతక పోరుకు అర్హత పొందారు. అనీశ్‌–రిథమ్‌ జంటకిది రెండో ప్రపంచకప్‌ పతకం. ఈ ఏడాది మార్చిలో కైరోలో జరిగిన ప్రపంచకప్‌ టోరీ్నలో అనీశ్‌–రిథమ్‌ జోడీ స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో బరిలోకి దిగిన రెండు భారత జోడీలు త్రుటిలో పతక మ్యాచ్‌లకు దూరమయ్యాయి. సంజీవ్‌ రాజ్‌పుత్‌–అంజుమ్‌ మౌద్గిల్‌ జంట ఐదో స్థానంలో, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌–ఆశీ చౌక్సీ జోడీ ఆరో స్థానంలో నిలిచాయి. తాజా ప్రపంచకప్‌ టోరీ్నలో భారత్‌ ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు సాధించి మొత్తం 14 పతకాలతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతోంది.

Also read: Yulimar Rojasకి ట్రిపుల్‌ జంప్‌లో 3వ స్వర్ణం

South Africa's T20  లీగ్‌ కమిషనర్‌గా గ్రేమ్‌ స్మిత్‌

దక్షిణాఫ్రికా మెరుపుల లీగ్‌కు తమ దిగ్గజ బ్యాటర్‌ గ్రేమ్‌ స్మిత్‌ను కమిషనర్‌గా నియమించింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌ తరహా టి20 లీగ్‌కు శ్రీకారం చుట్టిన క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) ఇందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది. జనవరి–ఫిబ్రవరి మాసాల్లో టి20 లీగ్‌ షెడ్యూల్‌ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా లీగ్‌ కమిషనర్, ఫ్రాంచైజీల వేలం కార్యక్రమాల్ని కూడా నిర్వహించింది. స్మిత్‌ స్పందిస్తూ సఫారీ క్రికెట్‌కు అంకితభావంతో సేవలందించేందుకు తానెప్పుడు సిద్ధమేనని... కొత్త బాధ్యతల్ని సంతోషంగా స్వీకరిస్తానని చెప్పాడు.

Also read: FIH అధ్యక్ష పదవికి నరీందర్ బత్రా రాజీనామా

ఆరు ఫ్రాంచైజీలు మనోళ్లవే! 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో విజయవంతమై భాగస్వాములైన భారత ఫ్రాంచైజీలే ఇప్పుడు దక్షిణాఫ్రికా లీగ్‌లో భాగమవుతున్నాయి. మొత్తం ఆరుకు ఆరు ఫ్రాంచైజీల్ని మన పారిశ్రామికవేత్తలే కొనుగోలు చేయడం విశేషం. ముకేశ్‌ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్‌ కేప్‌టౌన్‌ జట్టును కైవసం చేసుకోగా, సిమెంట్‌ పరిశ్రమల యజమాని, భారత బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌కు చెందిన చెన్నై సూపర్‌కింగ్స్‌ జొహన్నెస్‌బర్గ్‌ను దక్కించుకుంది. జీఎంఆర్‌–జిందాల్‌కు చెందిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రిటోరియాను, గోయెంకా గ్రూప్‌ లక్నో సూపర్‌జెయింట్స్‌ ఫ్రాంచైజీ డర్బన్‌ను, నన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ పోర్ట్‌ ఎలిజబెత్‌ను, రాజస్తాన్‌ రాయల్స్‌ పార్ల్‌ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి.  

Also read: World Cup Shooting Tournament: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ - స్కిట్ లో భారత్‌కు తొలి స్వర్ణం
 

Junior Weightlifting Championships: యూత్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్షదకు స్వర్ణం 

తాష్కంట్‌లో జరుగుతున్న ఆసియా యూత్, జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన  హర్షద గరుడ్‌ బంగారు పతకం సాధించింది. మహిళల 45 కేజీల కేటగిరీలో 18 ఏళ్ల భారత లిఫ్టర్‌ 157 కేజీల (స్నాచ్‌లో 69+ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 88) బరువెత్తి విజేతగా నిలిచింది. మరో భారత లిఫ్టర్‌ సౌమ్య దాల్వి 145 కేజీల (63+82)తో కాంస్యం గెలుచుకుంది. పురుషుల 49కేజీల యూత్‌ ఈవెంట్‌లో ధనుశ్‌ (స్నాచ్‌లో 85 కేజీలు) కాంస్యం గెలిచాడు.

Also read: Weekly Current Affairs (Economy) Bitbank: భారతదేశపు మొట్టమొదటి దంత ఆరోగ్య బీమా పథకాన్ని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది?

Giving PI: దానకర్ణుల నెట్‌వర్క్‌ ‘గివింగ్‌పీఐ’


దాతల కుటుంబాలు చేతులు కలిపాయి. విప్రో ప్రేమ్‌జీ, జిరోదా నిఖిల్‌ కామత్, రోహిణి నీలేకని, నిసా గోద్రెజ్‌ సంయుక్తంగా ‘గివింగ్‌పీఐ’ పేరుతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 2030 నాటికి ఏటా బిలియన్‌ డాలర్లను సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన (ఎస్‌డీజీ) కోసం సమీకరించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగమయ్యే ప్రతీ సభ్యుడు/సభ్యురాలు ఏటా కనీసం రూ.50 లక్షలను విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా 2030 నాటికి 5,000 మంది సభ్యుల స్థాయికి నెట్‌వర్క్‌ను విస్తరించాలని వీరు నిర్ణయించారు. అదితి, రిషబ్‌ ప్రేమ్‌జీ, బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్, మనీషా, ఆశిష్‌ ధావన్, నిఖిల్‌ కామత్, నిసా గోద్రెజ్, రాజన్‌ నవాని, రోహిణి నీలేకని, స్కోల్‌ ఫౌండేషన్, టెరా సింగ్, వచాని, వాసవి భారత్‌ రామ్, వివేక్‌జైన్‌ ఈ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు చేతులు కలిపిన వారిలో ఉన్నారు. 
భారత్‌లో 113 మంది బిలియనీర్లు, 6,884 అధిక ధనవంతులు ఉన్నారు. వీరి సంఖ్య వచ్చే ఐదేళ్లలో 12,000కు చేరుకుంటుందని బెయిన్‌ అండ్‌ కంపెనీ నివేదిక చెబుతోంది. అంతర్జాతీయంగా ఉన్న తోటివారిని వీరు స్ఫూర్తిగా తీసుకుని కుటుంబ దాతృత్వానికి ముందుకు వస్తే భారత్‌లో అదనంగా రూ.60,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు సమకూరతాయని అంచనా.  
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: ఇన్ఫోసిస్ యొక్క CEO & MD గా తిరిగి ఎవరు నియమితులయ్యారు? 

Award: ప్రతిభారాయ్‌కి సినారె జాతీయ పురస్కారం


జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్‌ డాక్టర్‌ సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ ఒడియా రచయిత్రి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రతిభారాయ్‌ అందుకోనున్నారు. డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా జూలై 29న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో ఆమెకు పురస్కారాన్ని అందజేయనున్నామని సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య తెలిపారు. పురస్కారం కింద రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రంతో సత్కరి స్తామన్నారు. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేస్తారని చెప్పారు. 

Also read: Padma Shri Awardee: పోరాటమే chutni devi ‘మంత్రం’

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 20 Jul 2022 05:34PM

Photo Stories