Skip to main content

World Shooting : అగ్రస్థానంలో భారత్

India tops ISSF Shooting World Cup
India tops ISSF Shooting World Cup

దక్షిణకొరియాలోని చాంగ్వాన్ లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్‌ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) ప్రపంచకప్‌ను భారత్‌ అగ్రస్థానంతో ముగించింది. జూలై 20న టోర్నీ ఆఖరి రోజు కూడా హవా కొనసాగిస్తూ మరో రజతం సాధించిన భారత్‌ మొత్తం 15 పతకాలతో నంబర్‌ వన్‌గా నిలిచింది. ఇందులో ఐదు స్వర్ణాలు కాగా, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలున్నాయి. రెండో స్థానంలో ఉన్న ఆతిథ్య కొరియా ఖాతాలో 12 పతకాలే ఉన్నాయి. జూలై 20న 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో అనిశ్‌ భన్వాలా, విజయ్‌ వీర్‌ సిద్ధు, సమీర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో భారత జట్టు 15–17తో మార్టీన్, థామస్, మతేజ్‌లతో కూడిన  చెక్‌ రిపబ్లిక్‌ చేతిలో ఓడిపోయింది. 

Also read: Giving PI: దానకర్ణుల నెట్‌వర్క్‌ ‘గివింగ్‌పీఐ’

 Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

 

Published date : 21 Jul 2022 05:18PM

Photo Stories