Athlete Allyson Felix's: అమెరికన్ అథ్లెటిక్ ఫెలిక్స్ @ 30 పతకాలు
మేజర్ ఈవెంట్స్ (ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్)లో 30 పతకాలు సాధించడం అనేది అతికష్టమైన పని. ఈ పనిని తన ఆఖరి ప్రపంచ చాంపియన్ షిప్‌లో అమెరికన్ అథ్లెటిక్ దిగ్గజం అలిసన్ ఫెలిక్స్ పూర్తి చేసింది. జూలై 16న జరిగిన 4X400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో 36 ఏళ్ల ఫెలిక్స్ కాంస్య పతకం సాధించింది. సాధారణంగా మహిళల 200 మీ, 400 మీ., 4X100 మీ, 4X400 మీ. పరుగులో పోటీ పడే ఆమె ఈ సారి మిక్స్‌డ్ రిలేలోనే అర్హత పొందింది. పాల్గొన్న ఏకైక ఈవెంట్‌ను పతకంతో ముగించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆమెకిది 19వ పతకం. ఇందులో 13 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలున్నాయి. ఒలింపిక్స్‌లో మరో 11 (7 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యం) పతకాలు సాధించిన ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అథ్లెట్ ఫెలిక్స్. 2001 నుంచి 21 ఏళ్లుగా ఆమె ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పరుగుల చిరుతగా ఖ్యాతికెక్కింది. ప్రపంచ యూత్, ప్రపంచ జూనియర్, ప్రపంచ ఇండోర్, పాన్ అమెరికా గేమ్స్, వరల్డ్ అథ్లెటిక్స్ ఫైనల్, డైమండ్ లీగ్స్ ఇలా ఆమె పాల్గొన్న పోటీల చిట్టా చెబితే పతకాలు అర్ధసెంచరీకి పైనే ఉంటాయి.
Also read: Singapore Open 2022: సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధు