Singapore Open 2022: సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధు
2022లో తన నిలకడైన ఆటతీరును కొనసాగిస్తూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. జూలై 17న ముగిసిన సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో సింధు చాంపియన్‌గా అవతరించింది. 58 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 21–9, 11–21, 21–15తో ప్రపంచ 11వ ర్యాంకర్ ఆసియా చాంపియన్ వాంగ్ జి యి (చైనా)పై విజయం సాధించింది. ఈ ఏడాది స్విస్ ఓపెన్, సయ్యద్ మోడీ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన సింధు తాజా విజయంతో తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకుంది.
Also read: Weekly Current Affairs (Sports) Bitbank: రెడ్ బుల్‌లో స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్‌ను ఎవరు గెలుచుకున్నారు
విజేత సింధుకు 27,750 డాలర్ల (రూ. 22 లక్షల 13 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో ఐదుసార్లు సింగపూర్ ఓపెన్ టోర్నీలో పాల్గొన్న సింధు ఒక్కోసారి తొలి రౌండ్‌లో, ప్రిక్వార్టర్ ఫైనల్లో... రెండుసార్లు క్వార్టర్ ఫైనల్లో, ఒకసారి సెమీఫైనల్లో నిష్క్రమించి ఆరో ప్రయత్నంలో టైటిల్‌ను దక్కించుకుంది. తద్వారా ఈ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్ గా సింధు నిలిచింది. గతంలో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ (2010), పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ (2017) ఈ ఘనత సాధించారు.
Also read: World Athletics Championships: ప్రపంచ అథ్లెటిక్స్ పురుషుల 100 మీటర్లలో అమెరికాక్లీన్‌స్వీప్