World Athletics Championships: ప్రపంచ అథ్లెటిక్స్ పురుషుల 100 మీటర్లలో అమెరికా క్లీన్‌స్వీప్
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల విభాగంలో అమెరికా అథ్లెట్స్ క్లీన్‌స్వీప్ చేశారు. స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో మెరిపించారు. అమెరికాలోని యుజీన్‌లో జరుగుతున్న పోటీల్లో ఫ్రెడ్ కెర్లీ 9.86 సెకన్లలో అందరికంటే వేగంగా గమ్యానికి చేరి పసిడి పతకం సాధించడంతోపాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. అమెరికాకే చెందిన మార్వీన్ బ్రేసీ, ట్రేవన్ బ్రోమెల్ ఇద్దరూ 9.88 సెకన్లలోనే గమ్యానికి చేరగా... ఫొటో ఫినిష్ ద్వారా బ్రేసీకి రజతం, బ్రోమెల్‌కు కాంస్యం ఖాయమయ్యాయి. దాంతో 1991 తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల 100 మీటర్ల విభాగంలో మళ్లీ క్లీన్‌స్వీప్ నమోదైంది. 1991లో కార్ల్ లూయిస్, లెరాయ్ బరెల్, డెనిస్ మిచెల్ అమెరికాకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించారు.
Also read: Duvwarapu Sivakumar: అమెరికా తరఫున ఆంధ్ర ఆటగాడు శివకుమార్
శ్రీశంకర్‌కు ఏడో స్థానం
పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్లో భారత ప్లేయర్ మురళీ శ్రీశంకర్ 7.96 మీటర్ల దూరం దూకి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.