Skip to main content

State Finances : 2021 -22 Budget Analysis : అప్పుల్లో తమిళనాడు టాప్

‘స్టేట్‌ ఫైనాన్స్‌లు: 2021–22 బడ్జెట్‌ల అధ్యయనం’పేరుతో రిజర్వ్‌ బ్యాంక్‌ రూపొందించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పుల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ వెల్లడించారు.
Study of State Finances 2020-21
Study of State Finances 2020-21

ఈ మేరకు జూలై 25న లోక్‌సభలో బీజేపీ ఎంపీ కిషన్‌కపూర్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు తమిళనాడు రూ.6,59,868  కోట్ల అప్పుతో మొదటిస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్‌ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు కాగా, ఏపీ అప్పు రూ.3,98,903 కోట్లుగా ఉందని తెలిపారు.  అయితే రాష్ట్రాల రుణాలను ఆమోదించేటప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫారసుల ద్వారా నిర్దేశించిన ఆర్థిక పరిమితులను అనుసరిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రతి రాష్ట్రానికి సంబంధించిన సాధారణ నికర రుణ సీలింగ్‌(ఎన్బీసీ)ను కేంద్రం నిర్ణయిస్తుందని, క్రితం సంవత్సరాల్లో రాష్ట్రాలు అధికంగా తీసుకున్న రుణాలను తదుపరి సంవత్సరంలోని రుణ పరిమితులలో సర్దుబాటు చేస్తారని పేర్కొన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికల్స్‌(ఎస్పీవీ) ద్వారా బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్‌ల నుంచి అందిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ దృష్టికి వచి్చందన్నారు. ఈ ఏడాది మార్చిలో ఈ రకమైన రుణాల ద్వారా రాష్ట్రాల ఎన్బీసీని దాటడం వల్ల కలిగే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని రుణాల లెక్కలను నిర్ణయించి రాష్ట్రాలకు తెలియచేశామన్నారు.  

also read: Cryptos: క్రిప్టోలను నిషేధించే యోచనలో రిజర్వ్ బ్యాంక్

టాప్‌–15 రాష్ట్రాల అప్పులు
తమిళనాడు        6,59,868 కోట్లు 
ఉత్తరప్రదేశ్‌        6,53,307 కోట్లు 
మహారాష్ట్ర        6,08,999 కోట్లు 
పశ్చిమ బెంగాల్‌    5,62,697 కోట్లు 
రాజస్తాన్‌        4,77,177 కోట్లు 
కర్ణాటక        4,62,832 కోట్లు 
గుజరాత్‌        4,02,785 కోట్లు 
ఆంధ్రప్రదేశ్‌    3,98,903 కోట్లు 
కేరళ        3,35,989 కోట్లు  
మధ్యప్రదేశ్‌        3,17,736 కోట్లు 
తెలంగాణ        3,12,191 కోట్లు 
పంజాబ్‌        2,82,864 కోట్లు 
హరియాణా        2,79,022 కోట్లు 
బిహార్‌        2,46,413 కోట్లు 
ఒడిశా        1,67,205 కోట్లు 

Also read: GST 2022–23 మొదటి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లలో 37 శాతం వృద్ధి
 

Published date : 26 Jul 2022 05:48PM

Photo Stories