Skip to main content

Gagan Narang : భారత 'చెఫ్‌ డి మిషన్‌'గా గగన్‌ నారంగ్‌

భారత క్రీడాకారుల బృందానికి చెఫ్‌ డి మిషన్‌గా మాజీ షూటర్ ఎంపికైయ్యారు..
Gagan Narang as India's Chef de Mission Gagan Narang selected as chef de mission for Indian sports team at Paris Olympics

త్వరలో జరుగబోయే పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల బృందానికి చెఫ్‌ డి మిషన్‌గా మాజీ షూటర్, లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన హైదరాబాదీ గగన్‌ నారంగ్‌ ఎంపికయ్యాడు. ఈ మేరకు భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపారు. గతంలో ఈ బాధ్యతలను దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌కు అప్పగించినా.. వ్యక్తి గత కారణాలతో ఆమె వైదొలిగింది.

Vikram Misri: విదేశాంగ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ్‌ మిస్రీ

దీంతో గగన్‌ నారంగ్‌ను నియమించారు. విశ్వక్రీడ­ల ఆరంభ కార్యక్రమంలో భారత పతాకధారులుగా స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ అయిన తెలుగమ్మాయి పీవీ సింధు, టేబుల్‌ టెన్నిస్‌ దిగ్గజం ఆచంట శరత్‌ కమల్‌ ఉండనున్నారు. ఈసారి ఒలింపిక్స్‌కు భారత్‌ సుమారు వంద మందికి పైగా క్రీడాకారులను బరిలో నిలిపింది.

Published date : 17 Jul 2024 08:58AM

Photo Stories