Manipur CM Biren Singh: మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ రాజీనామా.. కారణం ఇదే..!

రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందజేశారు. అంతకుముందు బిరేన్ ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే రాజభవన్‌కు వెళ్లి రాజీనామా లేఖను అందజేశారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా బిరేన్ వైదొలగడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల అవిశ్వాస తీర్మానం ను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు కూడా బిరేన్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు శాంతి భద్రతలు కాపాడటంలో విఫలమయ్యారని, బిరేన్‌ను తొలగించకుంటే మరొక దారి చూసుకుంటామని కొందరు ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిస్థితిలో, బిరేన్ కేబినెట్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను రద్దు చేశారు.
Delhi Election Result: 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం
అసెంబ్లీలో బలాబలాలివీ..
అసెంబ్లీలోని 60 మంది సభ్యులకు గాను అధికార కూటమికి 43 మంది. సభ్యుల బలముంది. ఇందులో బీజేపీకి 37 మంది, ఎన్పీఎఫ్‌కు ఐదుగురు, జేడీయూకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాత్మక ఘటనలను బిరేన్ సింగ్ ప్రభుత్వం నిలువరించ లేకపోతోందంటూ సంకీర్ణంలోని మేఘాలయ సీఎం కొన్రాడు చెందిన ఎన్సీపీ, అనంతరం జేడీయూ కూడా వైదొలిగాయి. కాంగ్రెస్ సహా ప్రతిపక్షానికి అసెంబ్లీలో 16 మంది సభ్యులున్నారు. 2023 మే నుంచి రాష్ట్రంలో తెగల మధ్య జరుగుతున్న హింసాకాండలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.