Waqf Bill: వక్ఫ్ నిసాయిదా నివేదికకు జేపీసీ ఆమోదం
Sakshi Education
వక్ఫ్ ఆస్తులు, బోర్డ్ వ్యవహారాల్లో సంస్కరణలు, పారదర్శకత తేవడమే లక్ష్యంగా మోదీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును సమీక్షించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఎట్టకేలకు తమ ముసాయిదా నివేదికను జనవరి 29వ తేదీ ఆమోదించింది.

జేపీసీ 38వ సారి సమావేశమై ముసాయిదా నివేదికను ఆమోదించడం కోసం జరిపిన ఓటింగ్‌లో 15 మంది సభ్యులు నివేదికకు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు.
మెజారిటీ సభ్యులు అనుకూలంగా ఓట్లేయడంతో బీజేపీ నేత జగదాంబికాపాల్ నేతృత్వంలోని జేపీసీ ఈ నివేదికను ఆమోదించింది. జేపీసీలో సభ్యులుగా ఉన్న విపక్ష పార్టీల నేతలు ఈ నివేదికపై తమ పూర్తి అసంతృప్తిని వ్యక్తంచేస్తూ నోట్‌లను సమర్పించారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, ఆధునికత సాధించే ఉద్దేశ్యంతోనే గత ఏడాది ఆగస్ట్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిందని బీజేపీ సభ్యులు చెప్పారు.
Uniform Civil Code: దేశంలో తొలిసారి అమల్లోకి 'ఉమ్మడి పౌరస్మృతి చట్టం'
Published date : 30 Jan 2025 12:58PM