Skip to main content

PM-AASHA Schem: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం-ఆశా పథకం పొడిగింపు

ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (పీఎం-ఆశా) పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్రం పొడిగించింది.
Govt Extended PM-AASHA Scheme Until 2025-26 to Support Farmers

ఇంటిగ్రేటెడ్ పీఎం ఆశా పథకంలోని ధర మద్దతు పథకం(పీఎస్ఎస్) కింద, 2024-25 ఖరీఫ్ సీజన్‌లో పీఎస్ఎస్ కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, గుజరాత్, హరియాణా, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కంది పప్పు సేకరణకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలిపారు. 

అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఇప్పటికే సేకరణ ప్రారంభమైంది. ఈ రాష్ట్రాలలో ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ నాటికి మొత్తం 0.15 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) కంది కొనుగోలు జరిగింది. ఇతర రాష్ట్రాలలోనూ కంది సేకరణ త్వరలో ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 

రైతులు ఉత్పత్తి చేసే కందిలో 100 శాతం కందిని కేంద్ర నోడల్ ఏజెన్సీలైన నాఫెడ్, ఎన్సీసీఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. 

Rythu Bharosa: రైతులకు శుభ‌వార్త‌.. ఎకరంలోపు భూములున్న వారికి రైతు భరోసా నిధులు విడుదల

Published date : 19 Feb 2025 10:24AM

Photo Stories